జాన్వీ క‌పూర్‌… కొత్త‌ కండిష‌న్లు

జాన్వీ క‌పూర్ టాలీవుడ్ లో అడుగుపెట్టేసింది. ఎన్టీఆర్ ‘దేవ‌ర‌’తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌బోతోంది. ఈ సినిమా విడుద‌ల కాకుండానే రామ్‌చ‌ర‌ణ్ – బుచ్చిబాబు ప్రాజెక్ట్‌లో క‌థానాయిక‌గా ఫిక్స‌య్యింద‌ని వార్త‌లొచ్చాయి. అయితే చిత్ర‌బృందం మాత్రం అధికారికంగా ఖ‌రారు చేయ‌లేదు. ఇప్పుడు బోనీకపూర్ మాత్రం జాన్వీ ఎంట్రీ గురించి అఫీషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసేశారు. చ‌ర‌ణ్ సినిమాలో జాన్వీ న‌టిస్తోందంటూ డిక్లేర్ చేసేశారు. ఓ ఇంట‌ర్వ్యూలో జాన్వీ చేస్తున్న ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడిన బోనీ ”చ‌ర‌ణ్‌తో క‌లిసి న‌టిస్తోంది. ఇది దైవానుగ్ర‌హం” అంటూ కామెంట్ చేశారు. దాంతో.. చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించ‌కుండానే జాన్వీ ఎంపిక ఖాయ‌మైన‌ట్టైంది.

ఈ సినిమా కోసం జాన్వీ రూ.3 కోట్ల పారితోషికం తీసుకోబోతోంద‌ని కూడా వార్తలొస్తున్నాయి. తెలుగులో టాప్ హీరోయిన్స్‌కే ఈ స్థాయి పారితోషికం ద‌క్కుతోంది. త‌న నుంచి ఒక్క సినిమా కూడా బ‌య‌ట‌కు రాకుండా, రూ.3 కోట్ల రేంజ్ కు చేరుకొందంటే మామూలు విష‌యం కాదు. తెలుగులో జాన్వీకి మ‌రిన్ని అవ‌కాశాలు వ‌స్తున్నాయి. అయితే జాన్వీ మాత్రం ఆచి తూచి అడుగులేస్తోంది. `టాప్ స్టార్స్‌తోనే న‌టిస్తా` అంటూ కండీష‌న్స్ కూడా పెడుతోంది. చిన్న‌, మ‌ధ్య స్థాయి హీరోల సినిమాల్ని జాన్వీ తిర‌స్కరిస్తోంద‌ని టాప్ లీగ్ లో ఉన్న హీరోల సినిమా అంటేనే మొగ్గు చూపిస్తోంద‌ని టాక్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close