ఆంధ్రాలో జ‌న‌సేన కార్యాల‌యానికి మూడేళ్ల లీజ్‌..!

మ‌రో ఏడాదిన్న‌ర‌లో ఎన్నిక‌లు రాబోతున్నాయి. అందుకే, ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల‌న్నీ ఒక్కోటిగా అమ‌రావ‌తికి చేరుకుంటున్నాయి. రాష్ట్రం విడిపోయాక తెలుగుదేశం పార్టీ ఏపీ రాష్ట్ర కార్యాల‌యాన్ని అక్క‌డ ఏర్పాటు చేసుకుంది. ఇత‌ర పార్టీలు కూడా అదే బాట‌లో ఆంధ్రాకు చేరుకున్నాయి. అయితే, ప్ర‌తిప‌క్ష పార్టీ వైకాపాకి మాత్రం కొద్దిరోజుల కింద‌టి వ‌ర‌కూ ఏపీలో ఆఫీస్ లేదు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు ముందే విజ‌య‌వాడ‌లో ఆఫీస్ ఓపెన్ చేశారు. ఇక‌, మిగిలింది జ‌న‌సేన పార్టీ. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సొంతంగా అన్ని నియోజ‌క వ‌ర్గాల్లో పోటీ చేసేందుకు సిద్ధమౌతున్న‌ట్టు జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల‌కు జ‌న‌సేన కూడా సంసిద్ధ‌మౌతోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన ఆంధ్రా కార్యాల‌యాన్ని గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేయ‌బోతున్నారు. చిన‌కాకాని ద‌గ్గ‌ర మూడున్న‌ర ఎక‌రాల భూమిని జ‌న‌సేన పార్టీ ఒక రైతు ద‌గ్గ‌ర లీజుకు తీసుకుంది. ఆ లీజు స‌మ‌యం కూడా మూడేళ్లే కావ‌డం గ‌మ‌నార్హం.

అయితే, మూడేళ్ల లీజ్ ఏంట‌నేదే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం! సాధార‌ణంగా, భూమి లీజు అంటే క‌నీసం ఓ ఐదేళ్లు, ఏడేళ్లు పెట్టుకుంటారు. ఎందుకంటే, ఆ స్థ‌లంలో కార్యాల‌యం నిర్మించుకోవాలి. ఆ నిర్మాణానికి కూడా బాగానే ఖ‌ర్చు అవుతుంది క‌దా. దాంతో పాటు లీజు సొమ్ము కూడా స్థ‌లం య‌జ‌మానికి ఇవ్వాల్సి ఉంటుంది. అలాంట‌ప్పుడు, క‌నీసం ఓ ఐదేళ్ల‌యినా లీజు ఉండాలి. కానీ, జ‌న‌సేన పార్టీ మూడేళ్లు లీజుకు స్థ‌లం తీసుకోవ‌డం వెన‌క వేరే ఆలోచ‌న ఏదైనా ఉందా అనే చ‌ర్చ జ‌రుగుతోంది. దీనిపై ర‌క‌ర‌కాల క‌థ‌నాలూ వినిపిస్తున్నాయి. ఎన్నిక‌ల త‌రువాత, అప్ప‌టి ప‌రిస్థితిని బ‌ట్టీ ఆంధ్రాలో ఆఫీస్ విష‌య‌మై నిర్ణ‌యం తీసుకుంటార‌నే అభిప్రాయం చ‌క్క‌ర్లుకొడుతోంది. అదేం కాదూ… వ‌చ్చే ఎన్నిక‌ల త‌రువాత శాశ్వ‌త భ‌వ‌నం నిర్మించుకుందామ‌నే ఆలోచ‌న ఆ పార్టీకి ఉంద‌ని కొంత‌మంది అంటున్నారు. అందుకే, మూడేళ్ల‌కే లీజుకు తీసుకున్నార‌న్నంటున్నారు. కానీ, ఈ స్వ‌ల్ప వ్య‌వ‌ధి లీజు వెన‌క వాస్త‌వ ప‌రిస్థితి మ‌రోలా ఉంద‌ని తెలుస్తోంది!

అమ‌రావ‌తికి ద‌గ్గ‌ర్లోనే పార్టీ కార్యాల‌యం ఉండాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ మొద‌ట్నుంచీ ప‌ట్టుబ‌డుతూ వ‌చ్చార‌ట‌. ఆ విధంగానే విజ‌య‌వాడ‌, గుంటూరు ప‌రిస‌ర ప్రాంతాల్లో స్థ‌లం కోసం అన్వేషించారు. కానీ, అనువైన స్థ‌లం వారికి ల‌భించ‌లేదు. అంతేకాదు, ఐదు లేదా ప‌దేళ్ల‌పాటు లీజులుకు ఇచ్చేందుకు కూడా రైతులు మొగ్గు చూప‌డం లేదు. ఎందుకంటే, మ‌రో రెండుమూడేళ్ల‌లో భూముల ధ‌ర‌లు అనూహ్యంగా పెర‌గొచ్చ‌నే అంచ‌నా వారికి ఉంది. ఏళ్ల త‌ర‌బ‌డి లీజుకు ఇవ్వ‌డం స‌రైంది కాద‌నేది వారి లెక్క. అందుకే, జ‌న‌సేన కార్యాల‌యానికి మూడేళ్ల లీజుకు మాత్ర‌మే స్థ‌లం దొరికింద‌ని అంటున్నారు. ఎలాగూ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోంది కాబ‌ట్టి, కార్యాల‌య స్థ‌లం కోసం అన్వేష‌ణ పేరుతో స‌మ‌యం వృధా చెయ్యొద్ద‌ని ప‌వ‌న్ ప‌దేప‌దే చెప్ప‌డంతో ఈ మూడున్న‌ర ఎక‌రాలను లీజుకు తీసుకున్న‌ట్టు స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close