అన్ని స్థానాల్లో గాజు గ్లాస్ ఖాయం – అడ్డుకోలేరా ?

జనసేన ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసును ఆ పార్టీ పోటీ చేయని చోట స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించనున్నారు. ఇండిపెండెంట్లు తమకు ఏ గుర్తు కావాలో కోరుకునేచాన్స్ ఉంది. వారికి అందుబాటులో ఉన్న గుర్తుల్లో గ్లాస్ ఉంది. జనసేనకు గాజు గ్లాసును ఎన్నికల గుర్తుగా ఇవ్వడాన్ని హైకోర్టు అనుమతించింది. ఈ తీర్పు ప్రకారం ఆ పార్టీ పోటీ చేస్తున్న చోట మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులకు ఈ గుర్తు కేటాయిస్తారు. ఆ పార్టీ అభ్యర్థులు లేనిచోట స్వతంత్ర అభ్యర్థులు ఎవరైనా కోరుకుంటే వారికి ఈ గుర్తు ఇస్తారు.

ఇండిపెండెంట్లు కోరుకోవడానికి వీలుగా కొన్ని గుర్తులను ఫ్రీ సింబల్స్‌ పేరిట ఎన్నికల కమిషన్‌ ముందే ప్రకటించింది. అందులో గాజు గ్లాసు గుర్తు ఉంది. జనసేన 21 అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లకు పోటీ చేస్తోంది. తిరుపతి ఉపఎన్నికల సమయంలో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. బీజేపీ అభ్యర్థి బరిలో ఉన్నా.. గాజు గ్లాస్ గుర్తు కూడా వేరే అభ్యర్థికి కేటాయించారు. ఆ అభ్యర్థికి రెండున్నర వేల ఓట్లు వచ్చాయి.

గాజు గ్లాస్ గుర్తును కూడా కూటమి అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ అవకాశాన్ని వైసీపీ అసలు వదులు కోదు. తమ తరపున అభ్యర్థున్ని నిలబెట్టి విస్తృతంగా ప్రచారం చేసినా ఆశ్చర్యపోవాల్సిన పన ిఉండదు. ఈ సమస్యను ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ దృష్టికి జనసేన నాయకులు తీసుకెళ్లారు. ఈసీ తీసుకునే నిరణయం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close