పాపం.. జ‌యంతిని కూడా చంపేశారు

మీడియా తొంద‌ర‌పాటుకి మ‌రో ఉదాహ‌ర‌ణ ఇది. సీనియ‌ర్ న‌టి జ‌యంతి ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో ఉన్నారు. ఆమె మ‌ర‌ణించార‌ని మంగ‌ళ‌వారం రాత్రి పొద్దుపోయాక ఓ వార్త చ‌క్క‌ర్లు కొట్టింది. టీవీలో బ్రేకింగ్ న్యూస్‌లు వేశారు. స్టోరీలూ వండారు. వెబ్ సైట్ల‌లో అయితే.. జ‌యంతి మ‌ర‌ణంపై వార్త‌లు రాసేశారు. సోష‌ల్ మీడియాలో రిప్‌, శ్ర‌ద్దాంజ‌లి పోస్ట‌ర్లు ద‌ర్శ‌న‌మిచ్చాయి. ఆఖ‌రికి ఈనాడు లాంటి సంస్థ కూడా త‌న వెబ్ సైట్లో జ‌యంతి మ‌ర‌ణించింద‌న్న వార్త ప్ర‌చురించింది. ఈటీవీలోనూ బ్రేకింగులు ప‌డ్డాయి. దాంతో మిగిలిన వాళ్లు ఈనాడుని ఫాలో అయిపోయారు.

నిజానికి జ‌యంతి ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంది. ఆమె ప్ర‌స్తుతం బెంగ‌ళూరులోని ఓ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వార్త‌లు చూసి జ‌యంతి కుటుంబ స‌భ్యులు కంగారు ప‌డ్డారు. టీవీ ఛాన‌ళ్ల‌కు ఫోన్లు చేసి ‘ఆమె బాగానే ఉన్నారు. ముందు మీ వార్త‌లు ఆపండి’ అంటూ విన్న‌వించుకోవాల్సివ‌చ్చింది. ఓ వ్య‌క్తి అంప‌శ‌య్య‌పై ఉంటే.. కోలుకోవాల‌ని ప్రార్థించాలే త‌ప్ప‌, బ్రేకుంగుల కోసం.. ముందు మ‌న‌మే ఇచ్చాం అని చెప్పుకోవ‌డం కోసం బ‌తికున్న వ్య‌క్తిని ఇలా తొంద‌ర‌ప‌డి చంపేయ‌డం దేనికి? ఇదేం కొత్త కాదు. ఇది వ‌ర‌కు చాలామంది విష‌యంలో ఇలానే జ‌రిగింది. సుధాక‌ర్ చ‌నిపోయాడ‌ని, శ్రీ‌కాంత్‌కి ఏదో అయ్యింద‌ని వార్త‌లు వండి ప‌డేశారు. జ‌యంతి విష‌యంలో కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close