ఎన్నార్సీకి మద్దతుగా “జేడీ” వాయిస్..! క్లారిటీ వచ్చేసినట్లేనా…?

సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేసిన తరవాత ఎటు వైపు వెళ్తారన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో జేడీ కీలకమైన హింట్ ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా ఉన్న ఎన్నార్సీ, ఎన్పీఆర్, సీఏఏల విషయంలో అనుకూలంగా మాట్లాడారు. అచ్చంగా బీజేపీ నేతలు చెప్పే డైలాగులయిన… దేశం ధర్మశాల కాదని అంటున్నారు. దేశ భద్రత చాలా ముఖ్యమని అంటున్నారు. ఇప్పటి వరకూ.. జేడీ ఇలాంటి విషయాలపై బహిరంగంగా స్పందించిన దాఖలాలు తక్కువే. జనసేన బయటకు వచ్చిన తర్వాత.. ఇప్పుడు.. చాలా ఘాటుగాఇలా వ్యాఖ్యానించడం కాస్త ఆసక్తికరమైన విషయంగానే రాజకీయవర్గాలు చెబుతున్నాయి.

సహజంగా జేడీ లక్ష్మినారాయణ ఆరెస్సెస్ నేపధ్యం నుంచి వచ్చారని చెబుతూంటారు. ఆయన ఆరెస్సెస్ సమావేశాలకు హాజరయిన ఫోటోలు చాలా సార్లు బయటకు వచ్చాయి. ఇటీవలి కాలంలో రామ్ మాధవ్‌తో కలిసి కూడా ఆయన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ తరుణంలో… బీజేపీ విధానం అయిన ఎన్నార్సీ విషయంలో.. ఘాటుగా స్పందించడంతో… దీని వెనుక రాజకీయ వ్యూహం ఉందని అంచనా వేస్తున్నారు. లక్ష్మినారాయణకు రాజకీయాలపై చాలా ఆసక్తి ఉంది. అందుకే ఆయన వాలంటరీ రిటైర్మెంట్ కూడా తీసుకున్నారు. కానీ… సరైన అడుగులు వేయడంలో విఫలమయ్యారు. మరో సారి అలాంటి తప్పు చేయకూడదన్న ఉద్దేశంలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

తన లాంటి మాజీ బ్యూరోక్రాట్లు.. జాతీయ పార్టీల్లో ఉంటేనే … ఏదో విధంగా యాక్టివ్ గా ఉండవచ్చని… తన సేవల్ని ఎలాగైనా వాడుకుంటారని అంచనా వేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. లక్ష్మినారాయణకు .. బీజేపీ ఎప్పుడో ఆహ్వానం పలికింది. కానీ గత ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేస్తే ప్రయోజనం ఉండదని ఆగిపోయినట్లుగా ఉన్నారు. ఈ సారి మాత్రం.. కాస్త సమయం తీసుకుని అయినా .. తన భావజాలానికి తగ్గట్లుగా ఉన్న బీజేపీలో చేరే అవకాశం ఉందని.. ఆయన మాటల ద్వారా స్పష్టమవుతోందంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close