జాన్వి చేతిలో తొలి అవార్డు

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి.. అందుకున్న పుర‌స్కారాల‌కు లెక్కేలేదు. ఉత్త‌మ‌న‌టిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుల‌తో పాటు, రాష్ట్ర ప్ర‌భుత్వాల పుర‌స్కారాల్నీ ద‌క్కించుకుంది. శ్రీ‌దేవి వార‌స‌త్వం పుణికి పుచ్చుకుని క‌థానాయిక‌గా అడుగుపెట్టిన జాన్వి.. తొలి సినిమాతోనే అవార్డు కొట్టేసింది. వోగ్ మ్యాగ‌జైన్ ఈ యేడాది ఫ్రెష్ ఫేస్ అవార్డుని జాన్వికి అందజేసింది. జాన్వి తొలి చిత్రం ధ‌డ‌క్ ఇటీవ‌లే విడుద‌లైంది. బాక్సాఫీసు ద‌గ్గ‌ర కాసులు కురిపిస్తోంది. జాన్వి న‌ట‌న‌కు, స్క్రీన్ ప్ర‌జెన్స్‌కీ మంచి మార్కులు ప‌డుతున్నాయి. ఈలోగా… ఓ పుర‌స్కారం త‌న చేతికొచ్చేసింది. తొలి సినిమాతోనే.. జాన్వి ఓ అవార్డు ద‌క్కించుకోవ‌డం, తాను చేసిన తొలి సినిమానే బాక్సాఫీసు హిట్టుగా నిల‌వ‌డంతో మంచి ఆరంభం ల‌భించిన‌ట్టైంది. జాన్విని క‌థానాయిక‌గా చూసుకోవాల‌ని శ్రీ‌దేవి ఆశ‌. అది తీరే స‌మ‌యానికి… శ్రీ‌దేవి ఈ లోకంలో లేకుండా పోయింది. త‌ల్లి మ‌ర‌ణంతో కృంగిపోయిన జాన్వికి ఈ విజ‌యాలే ఊర‌ట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అధికారం కోల్పోయినా సరే కానీ… జగన్ టార్గెట్ అదే..!?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం మరో మూడు రోజుల్లో ముగియనుంది. ప్రధాన పార్టీలన్నీ ప్రత్యర్ధులను దెబ్బతీసేందుకు ఎప్పటికప్పుడు పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలను మార్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పిఠాపురంలో పవన్ ఓటమి లక్ష్యంగా వైసీపీ...

వెట‌ర‌న్‌ల‌కు వెండి తెర స్వాగ‌తం

క్రికెట్‌లో వెట‌రన్ అనే మాట ఎక్కువ‌గా వాడుతుంటారు. ఆటగాడిగా రిటైర్ అయిపోయిన త‌ర‌వాత‌.. వాళ్లంతా వ్య‌క్తిగ‌త జీవితాల‌కు ప‌రిమితం అయ్యేవారు. ఇప్పుడు ఐపీఎల్ వ‌చ్చింది. దాంతో రిటైర్ ఆట‌గాళ్లంతా కోచ్‌లుగా, మెంట‌ర్లుగా మారుతున్నారు....

అందర్నీ గొడ్డలితో నరికేసి సింగిల్ ప్లేయర్ అవ్వండి – భారతికి షర్మిల సలహా

వైఎస్ జగన్, ఆయన సతీమణిపై వైఎస్ షర్మిలారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బధవారం మీడియాతో మాట్లాడిన షర్మిల వైసీపీ వాళ్లే అధికారంలో ఉండాలి... వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వారందర్నీ...

విజ‌య్ సినిమాల‌కు టైటిళ్లు కావ‌లెను!

రేపు.. అంటే మే 9న విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా విజయ్ కొత్త సినిమాల సంగ‌తులు రేపే రివీల్ కాబోతున్నాయి. మైత్రీ మూవీస్ లో విజ‌య్ ఓ సినిమా చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close