రివ్యూ : జ్యో అచ్యుతానంద అలరించే అచ్చతెలుగు సినిమా

నటీనటులుః నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా
మ్యూజిక్ః కళ్యాణ్ కోడూరి
ప్రొడ్యూసర్స్ః సాయి కొర్రపాటి
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ః శ్రీనివాస్ అవసరాల
రిలీజ్ డేట్ః 09.09.2016

రేటింగ్ః 3/5

ఇంట్రడక్షన్ః
మన దగ్గర ప్రతి వారం ఓ రెండు మూడు కొత్త తెలుగు సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. కొత్తగా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి కొత్త సినిమా అనుకోవడమే కానీ అందులో కొత్తదనం అంటూ ఏమీ ఉండదు. టైటిల్ దగ్గర నుంచీ పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్, కథ, క్యారెక్టర్స్, క్యారెక్టరైజేషన్స్, సీన్స్, డైలాగ్స్, ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్….సినిమాకు సంబంధించిన అవుట్ పుట్ అంతా కూడా ఏధో ఒక సినిమాను గుర్తుచేస్తూ ఉంటుంది. కొన్నికొత్త సినిమాలయితే ఓ పది పాత సినిమాలను కలిపితీశారా అన్నట్టు ఉంటాయి. ఎక్కడా కూడా కొత్తగా ట్రై చేయడమనేదే ఉండదు. అలాగే సినిమాకి కూడా సాహిత్య విలువలు ఉంటాయని, సినిమాలో కూడా జీవితాలను చూపించొచ్చన్న విషయాన్ని మన తెలుగు ఫిల్మ్ మేకర్స్ చాలా మంది ఎప్పుడో మర్చిపోయారు. తెలుగు భాషను తెలుగు రాష్ట్రాలలో ఉన్న తెలుగు వాళ్ళందరూ మర్చిపోయే ప్రయత్నాల్లో బిజిగా ఉంటే… అక్కడెక్కడో అమెరికాలో ఉన్న మనవాళ్ళు తెలుగు కోసం తపిస్తున్నట్టుగా…..మనదైన తెలుగు సినిమాను, మన తెలుగు జీవితాలను కూడా అమెరికా నుంచి వచ్చిన తెలగువాళ్ళే మనకు గుర్తు చేస్తున్నారు. అలాంటి వారిలో అగ్రగణ్యుడు అవసరాల శ్రీనివాస్. తెలుగు సినిమాకు గౌరవం తీసుకురావడం కోసం తపిస్తున్నాడు. నటన, దర్శకత్వం, తన బిహేవియర్…తనకు సంబంధించిన ప్రతి విషయం నుంచి ఎదుటి వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకోవాలి అని అనుకునే స్థాయిలో అవసరాల ఉన్నాడు. పంచ్‌లు, ప్రాసలు, అడల్ట్ కామెడీలు అంటూ కొట్టుకుపోతున్న తెలుగు సినిమాకు మనదైన ది బెస్ట్ కామెడీ…ఇంటిల్లిపాదీ చూసి నవ్వుకునే కామెడీ…..పొట్టచెక్కలయ్యేలా నవ్వుకునే కామెడీని జ్యో, అచ్చుత్, ఆనంద్‌ల ద్వారా మనకు మరోసారి పరిచయం చేశాడు. ఆ ముగ్గురి కథేంటో మనమూ చూద్దాం రండి.

స్టోరీః
మనకు బాగా తెలిసిన కథ. జ్యో, అచ్చుత్, ఆనంద్‌ల మధ్య జరిగే సీన్స్‌ని మనం కూడా ఎక్కడో చూసినట్టుగానో, లేకపోతే అలా బిహేవ్ చేసినట్టుగానో అనుక్షణం గుర్తు చేస్తూ ఉండే కథ. బాగాలేని సినిమాలకు నష్టం చేసినా ఫర్వాలేదు కానీ ఇష్టపడి, కష్టపడి, ప్రేమించి తీసిన సినిమాలకు మాత్రం నష్టం చేయడం కరెక్ట్ కాదు. అందుకే కథ చెప్పడం లేదు. అయితే మనందరికీ ట్రైలర్ ద్వారా తెలిసి ఉన్న విషయం గురించి మాత్రం చెప్పుకుందాం. అచ్యుత్, ఆనంద్‌లు సొంత అన్నదమ్ములు. ఇద్దరూ కూడా హీరోలు కాదు. మామూలుగా మనం…మన కుటుంబాల్లో తరచుగా చూసే ఇద్దరు అన్నదమ్ములు. ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారు. అమ్మా,నాన్న అంటే భయం, గౌరవం ఉన్నవాళ్ళే. అలాంటి వాళ్ళ ఇంటి పై పోర్షన్‌లో ఓ అందమైన అమ్మాయి అద్దెకు దిగుతుంది. తెలుగు సినిమా తెరపైన కనిపించే సినిమాటిక్ ప్రేమ కాకుండా….ఆ తెరపైన ప్రేమలు చూసి మన తెలుగు కుర్రాళ్ళు ప్రేమలో పడుతూ ఉంటారు కదా….జ్యో అనే ఆ అమ్మాయితో మన అచ్యుత్, ఆనంద్‌లు కూడా అలాంటి ప్రేమలో పడతారు. ఆ అమ్మాయి ప్రతి మాటకు, ప్రతి చర్యకు తమకు నచ్చిన, తమ ప్రేమ ఊహలకు తగ్గ అర్థాలను వెతుక్కుని…..ఆ అమ్మాయి తమను ప్రేమిస్తుందని ఫిక్స్ అయి….ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పేస్తారు. ఆ ప్రేమ వీళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? చివరకు జ్యో ఎవరి సొంతమైంది? అన్నది కథ.

ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ః

శిల్పం యొక్క అందం శిల్పికి ఉన్న స్కిల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా…..ఇంకా సినిమాలో కనిపించిన ఏ ఒక్క ఆర్టిస్ట్ యొక్క నటనలోనూ ఒక్క లోపాన్ని కూడా చూపించలేం. అంటే డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ స్కిల్స్ ఆ రేంజ్‌లో ఉన్నాయన్నమాట. సినిమా ప్రారంభంలో నారా రోహిత్ శరీరం కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది కానీ ఆ తర్వాత్తర్వాత ఆ లోపాన్ని కూడా అద్భుతంగా మేనేజ్ చేశాడు అవసరాల. అఫ్కోర్స్ రోహిత్ డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ స్కిల్స్ కూడా డిస్టింక్షన్ లెవెల్‌లో ఉన్నాయనుకోండి. అలాగే మిగతా ఆర్టిస్ట్స్ అందరి నటన కూడా చాలా చాలా బాగుంది.

టెక్నికల్ పెర్ఫార్మెన్స్ః

టెక్నీషియన్స్ అందరి నుంచీ కూడా మంచి అవుట్ పుట్ రాబట్టకున్నాడు అవసరాల. సినిమాలో ఉన్న కామెడీ సీన్స్ స్టాండర్డ్స్‌తో కంపేర్ చేస్తే మాత్రం సాంగ్స్ ఇంకా బాగుంటే బాగుండేదనిపించింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అల్టిమేట్‌గా ఉంది. ఇక అవసరాల శ్రీనివాస్ స్వయంగా వ్రాసుకున్న కథ, స్క్రీన్ ప్లే, మాటల విషయానికి వస్తే కామెడీ సీన్స్, కామెడీ డైలాగ్స్ విషయంలో ఓ మైల్ స్టోన్ లాంటి బెంచ్ మార్క్‌ని క్రియేట్ చేశాడు అవసరాల. త్రివిక్రమ్ శ్రీనివాస్ కంటే కూడా కామెడీని బాగా పండించాడు. ముఖ్యంగా విజువల్ కామెడీ అయితే ఆనందబాష్పాలు తెప్పించే స్థాయిలో ఉంది. ఒన్ ఆఫ్ ద బెస్ట్ కామెడీని ఈ సినిమాలో మనం చూడొచ్చు. ఇక కథ, సెంటిమెంట్ ఎమోషనల్ సీన్స్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యాడేమో అనిపిస్తుంది. సీరియస్ ఎమోషన్స్‌ని కొంచెం లోతుగా చెప్పడానికి తెలుగు ఫిల్మ్ మేకర్స్ పూర్తిగా ధైర్యం చేయలేకపోతున్నారు. క్లైమాక్స్‌తో సహా ఇంకా చాలా సీన్స్‌లో ఇంకొంచెం డెప్త్ ఉండి ఉంటే చాలా చాలా బాగుండేది.

హైలైట్స్ః
కామెడీ సీన్స్
అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్, డైలాగ్స్
ఆర్టిస్ట్స్ పెర్ఫార్మెన్స్
టెక్నికల్ బ్రిలియన్స్
నిజ జీవితంలో జరిగిన సన్నివేశాలను గుర్తుచేసే నిజమైన ప్రేమకథ
ప్రొడక్షన్ వ్యాల్యూస్

డ్రాబ్యాక్స్ః
బేసిక్ కథకు సంబంధించిన సెంటిమెంట్ ఎమోషనల్ సీన్స్‌ని ఇంకా బెటర్‌గా డీల్ చేసి ఉంటే బాగుండేది.

ఎనాలసిస్ః
ఒక సినిమా చూస్తున్నప్పుడు…ఆ సినిమా ద్వారా డైరెక్టర్ చెప్పదల్చుకున్న కథ, క్యారెక్టర్స్, వాటి తాలూకు ఎమోషన్స్ మాత్రమే కనిపించాయంటే ఆ సినిమా సూపర్ సక్సెస్ అయినట్టే. డబ్బులు రావడమనేది బోనస్ అంతే. అంత పర్ఫెక్ట్‌గా వచ్చిన సినిమాలకు డబ్బులు రాకుండా ఉండే పరిస్థితే లేదు. ఈ జ్యో, అచ్యుత్, ఆనంద్‌ల కథ కూడా అలాంటి అందమైన సినిమానే. అలాగే సినిమా చూశాక డైరెక్టర్ గురించి మొదట మాట్లాడుకుని ఆ తర్వాత నటీనటుల గురించి మాట్లాడారంటే కూడా ఆ సినిమా గొప్ప సినిమా అని అర్థం. ఈ సినిమాను ఆ లిస్టులో కూడా చేర్చవచ్చు. సినిమాటిక్ ప్రేమకథలకు బాగా అలవాటు పడిన మనకు ఈ రియల్ ప్రేమకథ కొంచెం కొత్తగానే ఉంటుంది. అలాగే అవసరాల శ్రీనివాస్ పండించిన కామెడీ అయితే ఒక్క క్షణం కుదురుగా కుర్చీలో కూర్చోనివ్వదు. ఆ స్థాయిలో నవ్వుల పంట పండిస్తుంది. సెంటిమెంట్ సీన్స్‌, బేసిక్ ప్లాట్‌కు సంబంధించిన సీన్స్‌ని కూడా అంతే అద్భుతంగా తెరకెక్కించి ఉంటే గ్యారెంటీగా క్లాసిక్ ఫిల్మ్ అయి ఉండేది. ఆ విషయల్లో అవసరాల తడబడ్డాడు. అదే సినిమా స్టాండర్డ్స్‌ని కొంచెం తగ్గించింది. కమర్షియల్ లెక్కులు ఇన్‌ఫ్లుయెన్స్ చేశాయేమో తెలియదు మరి. కానీ ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం చాలా మంచి సినిమా. మంచి కామెడీ. ఫిల్మీ స్టైల్ ప్రేమకథ, ఫిల్మీ స్టైల్ క్యారెక్టరైజేషన్స్ కాకుండా మన నిజజీవితాలకు దగ్గరగా ఉండే ప్రేమ కథ, మన సొంత జీవితాలనో, మన చుట్టుపక్కన ఉన్నవాళ్ళనో రిలేట్ చేసుకుంటూ చూసి ఎంజాయ్ చేయదగ్గ స్థాయి సినిమా. లాభం నష్టం చూసుకోకుండా తెలుగు ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించాలని ప్రేమగా కష్టపడుతున్న సాయి కొర్రపాటి గారికి కృతజ్ఙతలు చెప్పాల్సిందే.

జ్యో, అచ్యుత్, ఆనంద్‌లు నచ్చారు….అవసరాల మెప్పించాడు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close