ద‌ర్శ‌కేంద్రుడి ప్రేమ‌లేఖ‌… మ‌రీ కాస్ల్టీ గురూ..!

కె. రాఘ‌వేంద్ర‌రావుది వంద సినిమాల ప్ర‌యాణం. నాలుగు ద‌శాబ్దాల అనుభ‌వం. ఆయ‌న పుస్త‌కం రాశారంటే… అందులో ఏముందో తెలుసుకోవాల‌న్న త‌ప‌న ఉంటుంది. స‌గ‌టు సినీ అభిమానులు, సినిమా పిచ్చోళ్లు.. క‌చ్చితంగా ద‌ర్శ‌కేంద్రుడి పుస్త‌కంపై ఓ లుక్ వేస్తారు. రాఘ‌వేంద్ర‌రావు ఈమ‌ధ్య `నేను సినిమాకి రాసుకొన్న ప్రేమ‌లేఖ‌` అంటూ ఓ పుస్త‌కం రాశారు. ఈ పుస్త‌కం ఇప్పుడు మార్కెట్‌లో ఉంది. అయితే.. ఈ పుస్త‌కం వెల ఎంతో తెలుసా? అక్ష‌రాలా రూ.5 వేలు.

నిజం… ఈ పుస్త‌కానికి 5 వేల ధ‌ర నిర్ణ‌యించారు. ఇంత ఖ‌రీదైన పుస్త‌కం తెలుగు సినీ సాహితీ చ‌రిత్ర‌లోనే లేదేమో..? మ‌రి అంత‌గా అందులో ఏముంది? అనే అనుమానం రావొచ్చు. ఇందులో ఏం లేదు. ఆయ‌న జీవితంలోని కొన్ని సినిమాల గురించీ, కొంత‌మంది వ్య‌క్తుల గురించీ రాసుకొన్నారు. ఇదేం స‌మ‌గ్ర ఆత్మ క‌థ కాదు. కేవ‌లం… విహంగ వీక్ష‌ణంలా సాగిందంతే. పుస్త‌కంలో స‌గం పేజీలు ఫొటోల‌తో నింపేశారు. అవి కూడా త‌ర‌చూ సోష‌ల్ మీడియాలో క‌నిపించే చిత్రాలే. రాఘ‌వేంద్రుడి పుస్త‌కం కొనుక్కొని, ఆయ‌న జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం అనుకునేవాళ్లంతా దాని రేటు చూసి అవాక్క‌వుతున్నారు. అస‌లే పుస్త‌క ప‌ఠ‌నం బాగా త‌గ్గింది. పైగా సినిమావాళ్ల పుస్త‌కాలంటే.. అందులో పెద్ద‌గా సాహితీ విశేషాలూ, త‌ప్ప‌కుండా తెలుసుకోద‌గ్గ అంశాలూ ఏమీ ఉండ‌వ‌న్న ఓ అప‌వాదు ఉంది. అలాంట‌ప్పుడు రూ.5 వేలు పెట్ట‌డంలో మ‌ర్మ‌మేమిటో? ఇదే రేటు ఉంటే… క‌నీసం 5 పుస్త‌కాలు కూడా అమ్ముడ‌వ్వ‌వు. అన్నీ ఉచితంగా, కాంప్లిమెంట‌రీలుగా స‌మ‌ర్పించుకోవాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close