కేఏ పాల్ పాస్ పోర్టు కోసం అమెరికా నుంచి ప్రయత్నిస్తున్నారు. పాస్ పోర్టు కోసం ఆన్ లైన్లో అప్లికేషన్ ఫిలప్ చేస్తూంటే ఎర్రర్ వస్తోందట. ఆయన ఈ విషయాన్ని వీడియో ద్వారా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తనను అటూ ఇటూ తిప్పుతున్నారని కానీ పాస్ పోర్టు ఇవ్వడం లేదని అంటున్నారు.
ఆయనకు పాస్ పోర్టు ఎందుకు ఇవ్వడం లేదో కానీ.. కిలారి ఆనందపాల్ అనే అమెరికన్ సిటిజన్ అని చాలా మందికి సందేహం ఉంది. ఇప్పటి వరకూ ఆయనకు అమెరికా పాస్ పోర్టు ఉండి ఉంటుంది. రెన్యూవల్ చేసుకోవాలంటే అమెరికా పాస్ పోర్టు మాత్రమే రెన్యూవల్ చేసుకోవాలి. ద్వంద్వ పౌరసత్వం ఉన్నప్పటికీ ఆయనకు రెండు పాస్ పోర్టులకు అర్హత ఉండదు. ఈ సాంకేతికపరమైన అంశంతో ఆయనకు పాస్ పోర్టు ఇవ్వడం లేదేమో కానీ ఆయన మాత్రం అసలు విషయం చెప్పకుండా పాస్ పోర్టు ఇవ్వడం లేదని అంటున్నారు.
కేఏపాల్ పాస్ పోర్టులో పేజీలు అయిపోయాయి. ఆ పాస్ పోర్టు ఇండియాదా అమెరికాదా అన్నది స్పష్టత లేదు. ఆయన మాత్రం .. తనకు పాస్ పోర్టు ఇవ్వడం లేదని దానికి అంతర్జాతీయ కుట్ర ఉందని ఆరోపణలు చేస్తున్నారు. అంటే కేఏ పాల్ ఇండియాకు రావడానికి కొంత సమయం పట్టొచ్చు. ఆయన అక్కడ ఉన్న సమయంలోనే ఇక్కడ హైదరాబాద్లో లైంగిక వేధింపుల కేసు కూడా నమోదు అయింది.
