నంద‌మూరి ఇంటి నుంచి మ‌రో హీరో

నంద‌మూరి కాంపౌండ్ నుంచి హీరోలు వ‌స్తూనే ఉన్నారు. బాల‌కృష్ణ ని ఫాలో అవుతూ ఎన్టీఆర్‌, క‌ల్యాణ్‌రామ్‌, తార‌క‌ర‌త్న వ‌చ్చారు. ప్ర‌స్తుతం మోక్ష‌జ్ఞ ఎంట్రీకి సంబంధించిన క‌స‌ర‌త్తులు జ‌రుగుతున్నాయి. వ‌చ్చే యేడాది ఏప్రిల్‌లో మోక్ష‌జ్ఞ హీరోగా ఓ సినిమా మొద‌ల‌వుతుంది. ఈలోగా…నంద‌మూరి ఇంటి నుంచి మ‌రో న‌టుడు బ‌రిలో దిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. త‌నే క‌ల్యాణ్ రామ్ త‌న‌యుడు శౌర్య రామ్‌. ఇప్పుడు శౌర్య వ‌య‌సు ప‌న్నేండేళ్లు.

క‌ల్యాణ్ రామ్ క‌థానాయ‌కుడిగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రానికి నిర్మాత కూడా క‌ల్యాణ్ రామే. ఇందులో ఓ ఛైల్డ్ ఎపిసోడ్ ఉంద‌ట‌. అందులో శౌర్య‌రామ్ క‌నిపించ‌బోతున్నాడ‌ని టాక్‌. వేస‌వి సెల‌వ‌లు కాబ‌ట్టి శౌర్య‌కి కూడా టైమ్ పాస్ గా ఉంటుంద‌ని క‌ల్యాణ్‌రామ్ భావిస్తున్నాడ‌ట‌. ఫ‌స్ట్ షెడ్యూల్‌లోనే శౌర్య‌పై సీన్లు తెర‌కెక్కిస్తార‌ని టాక్‌. శౌర్య క‌నిపించేది రెండు మూడు స‌న్నివేశాలే అయినా ఆ ఇంపాక్ట్ చాలా ఉంటుంద‌ని, ఈ సినిమాలో అదో కీ రోల్ అవుతుంద‌ని చిత్ర‌బృందం చెబుతోంది. మ‌రి ఈ నంద‌మూరి వార‌సుడి ఎంట్రీ ని పూరి ఏ రేంజులో డిజైన్ చేశాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ ఘోర పరాజయం ఖాయం – జగన్‌కు ఎప్పుడో చెప్పా : ప్రశాంత్ కిషోర్

ఏపీ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ తన అంచనాను మరోసారి చెప్పారు. వైసీపీ ఘోర పరాజయం ఖాయమని అన్నారు. ఈ విషయాన్ని తాను ఏడాదిన్నర కిందటే జగన్ కు చెప్పానని స్పష్టం చేశారు. ఆర్టీవీ...

ఆ రూ. 14వేల కోట్లు మంగళవారం ప్రజల ఖాతాల్లో వేస్తామని చెప్పడం లేదేంటి ?

తెలంగాణ ఎన్నికల సమయంలో రైతు బంధు రాజకీయం జరిగింది. ఎన్నికల సంఘం నిధులు జమ చేయడానికి అంగీకారం తెలిపింది. కానీ హరీష్ రావు దాన్ని ఎన్నికల ప్రచారంలో వాడుకోవడంతో మళ్లీ...

ఎలక్షనీరింగ్ : అంచనాల్ని అందుకోలేకపోయిన వైసీపీ

ఈ సారి ఎన్నికల్లో వైసీపీ డబ్బుల పండగ చేస్తుందని ఓటర్లు ముఖ్యంగా వైసీపీకి చెందిన ఓటర్లు నమ్మకంతో ఉన్నారు. పార్టీ ద్వితీయ శ్రేణి క్యాడర్ కు కూడా రూ....

మోడీ దృష్టిలో జగన్‌ విలువ అంతే !

మోడీకి దత్తపుత్రుడినని అందుకే తాను ఇలా ఉన్నానని జగన్ అనుకుంటూ.. సర్వ అరాచకాలకు పాల్పడ్డారు. కానీ మోడీ దృష్టిలో జగన్ కు గుర్తింపు ఆయన ఓ రాష్ట్ర సీఎం.. తాను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close