పదవుల లెక్క తేల్చుకోలేని కాంగ్రెస్-జేడీఎస్..! కాలు తొక్కిన నాడే కాపురం చేసే కళ తెలుస్తోందా..?

కర్ణాటకలో కలసి కాపురం ప్రారంభించముందు కాంగ్రెస్-జేడీఎస్ సిగపట్లు పడుతున్నాయి. ప్రమాణస్వీకారం చేసి వారం దాటుతున్నా.. మంత్రులెవరో రెండు పార్టీలు నిర్ణయించుకోలేకపోతున్నాయి. శాఖల దగ్గర్నుంచి .. ఎవరెవరు మంత్రులనేదాని వరకూ.. ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. తమకు రెండు ఉప ముఖ్యమంత్రులు ఉండాలని కాంగ్రెస్ మొదటి నుంచి డిమాండ్ చేస్తోంది. అందుకు కుమారస్వామి నిరాకరించడంతో ఒక ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకుంది. ఇప్పుడు మలి దఫా చర్చల్లో అదే ప్రధానాంశమైంది. కాంగ్రెస్ నేత శివకుమార్ కు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుపడుతోంది. కుమారస్వామిపై ఒత్తిడి తెస్తోంది. కానీ కుమారస్వామి మాత్రం వెనక్కి తగ్గడం లేదు. శివకుమార్ కు డిప్యూటీ సిఎం ఇవ్వలేని పక్షంలో లింగాయత్ సామాజికవర్గానికి చెందిన నేతకు కేటాయించాలని కూడా కాంగ్రెస్ ప్రతిపాదించింది. దీనిపైనా కుమారస్వామి అంత సుముఖంగా లేరు.

మరో వైపు ఆర్థిక మంత్రిత్వ శాఖ కోసం రెండు పార్టీలు టగ్ ఆఫ్ వార్ ప్రారంభించాయి. ఆర్థిక శాఖ తమకే కావాలని కాంగ్రెస్ కోరుతోంది. అయితే సీఎంగా ఆర్థిక శాఖను కూడా తానే నిర్వహిస్తానని కుమారస్వామి తేల్చి చెబుతున్నారు. ఆర్థిక శాఖతో పాటు రెవెన్యూ, ప్రజా పనుల శాఖ ఇప్పుడు రెండు పార్టీల మధ్య వివాదానికి కారణమవుతున్నాయి. ఈ మూడు శాఖలూ కోరిన కాంగ్రెస్ ఇప్పుడు రెండో ఉప ముఖ్యమంత్రి పదవి, ఆర్థిక శాఖను అప్పగిస్తే మిగతా రెండు శాఖలు వదులుకునేందుకు అభ్యంతరం లేదని ప్రతిపాదన పెట్టింది. కానీ కుమారస్వామి సిద్ధంగా లేరు. జేడీఎస్ కన్నా.. రెట్టింపు సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నా.. సీఎం పదవిని తాము వదులుకున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పదే పదే గుర్తు చేస్తోంది. బదులుగా ఆర్థిక, రెవెన్యూ, ప్రజాపనులు, గ్రామీణాభివృద్ధి, బెంగళూరు పట్టణాభివృద్ధి, విద్యుత్, ఆరోగ్యం, గనులు లాంటి కీలక శాఖల్లో అత్యధికం తమ వద్దనే ఉండాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

కర్ణాటక కేబినెట్లో మొత్తం 34 మంది మంత్రులు ఉండొచ్చు. అందులో 22 మంత్రి పదవులు కాంగ్రెస్‌కు ఇస్తున్నారు. కానీ కీలకమైన శాఖలను మాత్రం వదులుకునేందుకు సిద్దపడటం లేదు. కాలు తొక్కిన నాడే కాపురం చేసే కళ తెలుస్తుందన్నట్లుగా… శాఖల విషయంలోనే తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్ – జేడీఎస్ రేపు పాలనలో వచ్చే సమస్యలపై ఎలా సమన్వయానికి వస్తుందన్నది పెద్ద పజిల్ గా మారింది. ఇప్పుడు కాకపోయినా రేపయినా…జేడీఎస్ ను డిక్టేట్ చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. అప్పుడు కుమారస్వామి కూడా ఎదురు తిరగడం ఖాయం. అదే జరిగితే ఇప్పుడు దేవేగౌడ.. అప్పుడప్పుడు బీజేపీని పొగుడుతున్నదానికి కొనసాగింపు రాజకీయం ఉంటుందేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close