కేసీఆర్ బీహార్ టూర్ ఫీడ్‌బ్యాక్ చాలా బ్యాడ్ !

కేసీఆర్ బీహార్ పర్యటన పై పూర్తి స్థాయిలో నెగెటివ్ ప్రచారం జరుగుతోంది. బీహార్ కు వెళ్లి బీహార్ వాళ్లకు సాయం చేయడం తప్ప.. రాజకీయంగా సాధించాలనుకున్న మైలేజీలో ఒక్క శాతం సాధించకపోగా.. నితీష్ కుమార్ దెబ్బకు కేసీఆర్‌పై దేశ స్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది. దీనికి కారణం ప్రెస్మీట్‌లో నితీష్ కుమార్ వ్యవహిరంచిన తీరే. విపక్ష కూటమికి మోదీని నాయకుడిగా ప్రతిపాదిస్తారా అని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు కేసీఆర్ సూటిగా సమాధానం చెప్పలేదు. ఆ సమయంలోనే నితీష్ కుమార్ లేచి నిలబడ్డారు.

ఇక చాలు వెళదామని జర్నలిస్టులకు సైగ చేశారు. అయితే కేసీఆర్ మాత్రం ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసి చేయి పట్టి కూర్చోబెట్టారు. కానీ కొన్ని సెకన్లకే మళ్లీ నితీష్ కుమార్ లేచివెళ్లారు. అదే ప్రెస్‌మీట్‌లో నితీష్ కుమార్ మాట్లాడలేదు. బీజేపీపై కలిసి పోరాడదామని చెప్పలేదు. అందుకే ఈ వీడియోను ఇతర పార్టీల నేతలు విపరీతంగా వైరల్ చేస్తున్నారు. కలసి కూర్చోలేని వారు కలసి పోరాటం ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ నేతలు… కేసీఆర్‌ను ఎద్దేవా చేస్తున్నారు.

ఆయన ను చూసి ఉత్తరాదిలో నవ్వుకుంటున్నారని అంటున్నారు. తెలంగాణ ప్రజల సొమ్మును రాజకీయం కోసం ఇతర రాష్ట్రాల్లో పంచుతున్నారని.. కానీ అక్కడ ఎవరూ కేసీఆర్‌ ను గొప్పగా చూడటం లేదని.. రాజకీయం కోసమే అలా చేస్తున్నారని అంటున్నారు.కేసీఆర్ తమది ధర్డ్ ఫ్రంట్ కాదు.. మెయిన్ ఫ్రంట్ అని చెప్పినా ఇరువురి మధ్య అండస్టాండింగ్ మాత్రం రాలేదు. తాము కేసీఆర్‌తో కలిసి పనిచేస్తామని నితీష్ కుమార్ చెప్పలేదు. అంటే కేసీఆర్‌కు వ్రతం చెడింది.. ఫలితమూ దక్కలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్, కేటీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో !?

బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను ఎవరో ఎత్తుకుపోతారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఉన్నప్పుడంతా స్వర్గం.. ఇప్పుడు నరకం అని ప్రజలకు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కొత్తగా తాము లేకపోతే...

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close