యాదాద్రి ప్రారంభోత్సవంపై తప్పుతున్న కేసీఆర్ అంచనాలు..!

యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దగలిగిన కేసీఆర్ .. ఆలయ ప్రారంభోత్సవానికి వేస్తున్న ప్రణాళికలు మాత్రం ముందుకు సాగడం లేదు. ఇప్పటికి రెండు, మూడు సార్లు ఆయన చినజీయర్ స్వామిని కలిసి.. ప్రారంభోత్సవం కనీవినీ ఎరుగని రీతిలో చేయడానికి అవసరమైన కార్యక్రమాలపై చర్చించారు. ఏడాది కిందటే… ఆలయ ప్రారంభోత్సవానికి కొన్ని తేదీలను అనుకున్నారు. ఏర్పాట్లు ప్రారంభించాలనుకునేసరి.. మహమ్మారి వచ్చేసింది. అప్పట్నుంచి ఆలయ ప్రారంభోత్సవానికి ఏ తేదీ కుదరదడం లేదు. గత ఏడాది చినజీయర్ స్వామిని కలిసినప్పుడు.. ఫిబ్రవరి నెలలో సుదర్శన యాగం, చండీయాగంతో పాటు రాజశ్యామల యాగం చేయాలని అనుకున్నారు. అప్పటికల్లా యాదాద్రి పనులు పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు.

ఫిబ్రవరిలో కాలం కలసి రాలేదు. ఆ తర్వాత మే నెలలో ఆలయ ప్రారంభోత్సవాన్ని కనివినీ ఎరుగని రీతిలో చేయనున్నారు. 1,048 యజ్ఞ కుండాలతో మహా సుదర్శన యాగం కూడా చేయాలని కూడా కేసీఆర్ ప్రణాళికలు వేసుకున్నారు. కానీ నిర్మాణ పనులు మాత్రం ఆయన ఆశించినంత వేగంగా సాగ లేదు. కీలకమైన పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కరోనా కూడా పనులు మందగించడానికి ఓ కారణం. అయితే ఆలయ కట్టడాలతో పాటు సుందరీకరణ పనులన్నీ తుది దశకు చేరాయి. కేసీఆర్ తరచూ యాదాద్రిపై సమీక్షలు చేస్తున్నారు. ఆలయాన్ని ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు.

యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి తెలంగాణలో రాజకీయ మార్పులకు సంబంధం ఉందన్న చర్చ కూడా కొంత కాలంగా సాగుతోంది. గత ఏడాది డిప్యూటీ స్పీకర్ పద్మారావు… యాదాద్రి లక్ష్మినరసింహాస్వామిని దర్శించుకుని ఆలయం ప్రారంభమైన గంటల్లోనే… కేటీఆర్ సీఎంగా ప్రమాణస్వీకారం ఉంటుందని ప్రకటించారు. ఆ ఆలయ ప్రారంభోత్సవం అయిన వెంటనే… కేసీఆర్… కుమారుడికి పదవి అప్పగిస్తారని ఆయన తేల్చారు. ఆలయ ప్రారంభోత్సవాన్ని కేసీఆర్ ఎప్పుడు నిర్వహిస్తారో.. అప్పుడే రాజకీయంగా కూడా కీలక మార్పులుంటాయని.. ఎక్కువ మంది నమ్ముతున్నారు. అందుకే యాదాద్రి ఆలయప్రారంభోత్సవంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

వివరణ కూడా అడగకుండానే ఎమ్మెల్సీపై అనర్హత !

టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై శాసనమండలి చైర్మన్ అనర్హతా వేటు వేశారు. వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎంపికైన ఆయన ఇటీవల టీడీపీలో చేరారు. దీనిపై వైసీపీ విప్ లేళ్ల అప్పిరెడ్డి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close