పీకే టీం సర్వేలకు కేసీఆర్ గుడ్ బై !

తెలంగాణ సీఎం కేసీఆర్ పీకే టీం సేవలను తగ్గించుకున్నారు. ఆ టీంతో సర్వేలు అవసరం లేదని తేల్చి చెప్పారు. దీంతో తెలంగాణలో పని చేస్తున్న దాదాపు నలభై సర్వే టీములు పని మానేశాయి. చివరికి మునుగోడులోనూ ఐ ప్యాక్ టీములు పని చేయడం లేదు. అవన్నీ ఏపీలో సర్వేలు చేయడానికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. అక్కడ కూడా పీకే టీమే జగన్‌కు సేవలు అందిస్తోంది. పీకే టీం హఠాత్తుగా సర్వేలు మానేయడానికి కారణం కేసీఆర్‌కు కోపం రావడమేనని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

ఇటీవల తెలంగాణలో పీకే టీం సర్వేలు ఉంటూ కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో వైరల్ అయ్యాయి. అవి టీఆర్ఎస్‌కు నెగెటివ్ గా ఉన్నాయి. అదే సమయంలో అదే సర్వే రిపోర్టు కేసీఆర్ చేతికి వెళ్లింది. ముందే లీక్ కావడం.. సీక్రెట్‌గా ఉంచాల్సిన వాటిని లీక్ చేయడంపై కేసీఆర్ అసంతృప్తికి గురయ్యారు. ఇక తమ పార్టీకి సర్వే సేవలు వద్దని పీకేకి తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. కేవలం సోషల్ మీడియా స్ట్రాటజీలు చూసుకుంటే చాలని చెప్పినట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

దీంతో రిక్రూట్ చేసుకున్న సిబ్బందిని ఏం చేయాలో తెలియక.. ఏపీకి పంపారని.. జగన్ కోసం.. ఇప్పుడు ఆ టీములన్నీ ఏపీలో తిరుగుతున్నాయని చెబుతున్నారు. పీకే సర్వేలను కేసీఆర్ వదిలించుకోవడంతో.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. తమకు టిక్కెట్లు ఇచ్చేది పీకేనేనని ఇప్పటి వరకూ వారిలో ఆందోళన ఉండేది. ఇప్పుడు కేసీఆర్ … సిట్టింగ్‌లు అందరికీ టిక్కెట్లు ఇస్తామన్నట్లుగా మాట్లాడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close