మళ్లీ కేసీఆర్ సహపంక్తి భోజనాల రాజకీయం..!

ఊరకనే రారు మహానుభావులు అని నానుడి.. అ విషయం రాజకీయనేతలందరికి వంద శాతం వర్తింప చేయవచ్చు…. ఈటింగ్.. డ్రింకింగ్.. స్లీపింగ్.. మొత్తం రాజకీయంతో ముడిపడే ఉండే..రాజకీయ నేతల సంగతయితే ఇక చెప్పాల్సిన పని లేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాలు … ప్రతీ అడుగులోనూ రాజకీయంతోనే ముడిపడి ఉంటాయి. ఎవరికైనా ఫోన్లు చేసినా… వారి గ్రామానికి వరాలు కురిపించినా.. అదంతా రాజకీయమే. ఇప్పుడు.. ఆయన దృష్టి యాదాద్రి జిల్లాలోని వాసాల మర్రి అనే గ్రామంపై పడింది. వెంటనే గ్రామ సర్పంచ్‌కు ఫోన్ చేశారు. దావత్ చేసుకుందాం.. పెద్ద స్థలం చూడాలని సూచించారు. ఆ ఫోన్ సంభాషణ.. మీడియాకు అందేలా చేశారు. దాంతో ఇప్పుడు ఏదో పెద్ద విశేషం అయిపోయింది.

22వతేదీన యాదాద్రి జిల్లాలోని తుర్కపల్లి మం. వాసాలమర్రిలోకి వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. గ్రామ అభివృద్ధిపై ప్రజలతో చర్చించి అక్కడే గ్రామస్తులతో కలిసి భోజనం చేయాలని ప్రణాళిక. ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటాని గతంలో కేసీఆర్ ప్రకటించారు. కానీ మర్చిపోయారు. ఇప్పుడు… హుజూరాబాద్ ఉపఎన్నికలో.. మరో కారణమో.. కానీ దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అలా ఆషామాషీగా ప్రకటన చేస్తే బాగుండదు కాబట్టి.. ఊరి ప్రజలందరికీ దావత్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.

ఉపఎన్నికలు వచ్చినా .. లేకపోతే మరో రాజకీయ కారణం అయినా కేసీఆర్ నియోజకవర్గాలకు.. గ్రామాలకు వందల కోట్ల సాయం ప్రకటించేస్తూ ఉంటారు. అవన్నీ ఎంత వరకు అమలవుతున్నాయో ఎవరూ క్రాస్ చెక్ చేయరు. మీడియా కూడా పట్టించుకోదు. పదుల సార్లు… అనేక ప్రాజెక్టుల విషయంలో తానే వచ్చి కుర్చీ వేసుకుని కూర్చుని పనులు చేయిస్తానని చెప్పారు. గిరిజనుల పోడు భూముల విషయంపై తానేజిల్లాలు తిరిగి పరిష్కరిస్తానని చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు ఇలా చిటికెలో పరిష్కరిస్తానని అవసరం వచ్చినప్పుడల్లా చెబుతూంటారు. కానీ.. తర్వాత పెద్దగా పురోగతి ఉండదు. వాసాల మర్రికి కేసీఆర్ ఎన్ని వరాలు ప్రకటిస్తారో… వాటి అమలు ఎలా ఉంటుందో ముందు ముందు తెలుస్తుంది..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అదే జరిగితే సజ్జల పరిస్థితి ఏంటి..?

వైసీపీలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుండటంతో జగన్ రెడ్డి ఆత్మగా చెప్పుకునే సజ్జల రామకృష్ణ పరిస్థితి ఏంటనేది బిగ్ డిబేట్ గా మారింది. వైసీపీ అధికారంలో ఉన్నాన్నాళ్ళు తనే సీఎం అనే తరహాలో...

థియేట‌ర్లు క్లోజ్.. హీరోల షేర్ ఎంత‌?

తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ మూత‌ప‌డ‌డంతో టాలీవుడ్ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. నిజానికి ఇలాంటి ప‌రిస్థితి ఎప్పుడో ఒక‌ప్పుడు వ‌స్తుంద‌న్న భ‌యం, ఆందోళ‌న అంద‌రిలోనూ ఉంది. అది ఒక్క‌సారిగా నిజ‌మ‌య్యేస‌రికి అవాక్క‌య్యారు. నిజానికి నెల రోజుల...

ఐ ప్యాక్ బృందానికి జగన్ రెడ్డి వీడ్కోలు..?

ఏపీ ఎన్నికల్లో అధికార వైసీపీకి సేవలందించిన ఐ ప్యాక్ కార్యాలయానికి జగన్ రెడ్డి ఎన్నికలు ముగిసిన రెండు రోజుల తర్వాత వెళ్తుండటం చర్చనీయాంశం అవుతోంది. వాస్తవానికి పోలింగ్ ముగిసిన తర్వాత ఐ ప్యాక్...

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close