రేపు సీఎంగా కేసీఆర్ ప్రమాణం..! వందశాతం ఏపీకి వెళ్తానని ప్రకటన..!!

అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ .. గురువారం మధ్యాహ్నం రాజ్ భవన్ లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ ను తమ లీడర్ గా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. కేసీఆర్ తో ఐదుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడిన కేసీఆర్… వంద శాతం ఏపీకి వెళ్తానని మరోసారి ప్రకటించారు. అక్కడి నుంచి తనకు ఆహ్వానాలు వస్తున్నాయంటున్నారు. మంత్రివర్గంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. మంత్రివర్గంలో 18 మందికే అవకాశం ఉంది..పెంచాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ప్రత్యేకహోదా విషయంలో ఏపీకి మద్దతిచ్చే అంశంపై చెప్పకుండా.. ప్రత్యేకహోదావస్తే ఏముందని చంద్రబాబు పెద్ద పెద్ద డైలాగులు కొట్టారని.. ఇప్పుడు ఆయనే ప్రత్యేకహోదా అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. హోదాపై చంద్రబాబుకే క్లారిటీ లేదన్నారు.

జాతీయ రాజకీయాలపై కేసీఆర్ మరోసారి తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేంద్రం తాను చేయాల్సిన పనిచేయకుండా అధికారాలు పెట్టుకొని..రాష్ట్రాలపై పెత్తనం చేస్తోందని విమర్శించారు. ఇదే అభిప్రాయం చాలా రాష్ట్రాలు, పార్టీల్లో ఉందన్నారు. రూరల్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌, వైద్యం, విద్య.. కేంద్రం దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. మోదీ ఫెడరలిజం అని చెబుతున్నా ఎక్కడా ఆచరించడం లేదని.. బీజేపీ, కాంగ్రెస్‌ తేడా లేదు.. దొందూ దొందేని కేసీఆర్ తేల్చి చెప్పారు. దేశానికి కొత్త ఆర్థిక విధానం అవసరమన్నారు. కొత్త వ్యవసాయం విధానం అవసరం..మూస వ్యవసాయ విధానం పోవాలన్నారు. రైతుబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. ఎంత పెట్టుబడి అవుతుందో ఐడియా ఉందని.. సుమారు 3 నుంచి 4 లక్షల కోట్లు అవుతుందని వ్యాఖ్యానించారు. ఇంత పెద్ద దేశంలో మైనార్టీల బడ్జెట్‌ 4 వేల కోట్లా? అని కేసీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ చెప్పుకునేది జాతీయ పార్టీ..రాష్ట్రానికో పాలసీ ఉంటుందని విమర్శించారు. ఉద్యోగులకు సీపీసీ విధానం తెచ్చిందే కాంగ్రెస్‌ అని మండిపడ్డారు. కేసీఆర్ ఏ హామీలు అమలు చేయలేదన్న రాహుల్ విమర్శపై కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. తాము చెప్పని కార్యక్రమాలు కూడా చేశామన్నారు. ఉద్యోగుల భర్తీపైనా తనను తాను డిఫెండ్ చేసుకున్నారు. నిరుద్యోగులను మోసం చేసే పార్టీలు చాలా ఉన్నాయన్నారు. మాకన్నా ముందు కాంగ్రెస్‌, టీడీపీ 60 ఏళ్లు పాలించాయని.. ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చాయని ప్రశ్నించారు. యువతకు పచ్చి అబద్దాలు చెప్పి కన్ఫ్యూజ్ చేశారని ఎన్ని ఉద్యోగ ఖాళీలున్నా వంద శాతం భర్తీ చేస్తామని ప్రకటించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close