ప‌వ‌న్‌ సీరియ‌స్ నాయ‌కుడు కాద‌న్న కేశినేని నాని..!

రాజ‌ధాని ప్రాంతంలో రైతుల‌కు తీవ్ర అన్యాయం జ‌రిగిపోతోంద‌నీ, చూస్తూ ఊరుకునేది లేద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే! అంతేకాదు, మ‌హారాష్ట్ర త‌ర‌హాలో ఉద్య‌మం తీసుకొస్తాన‌నీ, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఇంటి ముందు ధ‌ర్నా చేస్తామ‌నీ, అమ‌రావ‌తి నిర్మాణాన్ని అడ్డుకుని తీర‌తామ‌ని ప‌వ‌న్ ఆగ్ర‌హించారు. ఈ కామెంట్ల‌పై తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని స్పందించారు. ప‌వ‌న్ వ్యాఖ్యల్ని అంత తీవ్రంగా తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక సీరియ‌స్ పొలిటీషియ‌న్ కాద‌న్నారు. ఆయ‌న వృత్తి వేరు, ఆయ‌న తీరు వేరు, ఆయ‌న లైఫ్ స్టైల్ వేర‌ని నాని అన్నారు. నాలుగు రోజులు రోడ్డు మీద ఉంటే, న‌ల‌భై రోజులు నిద్ర‌పోయే ర‌క‌మ‌నీ, కుంభ‌క‌ర్ణుడిలా అప్పుడ‌ప్పుడూ నిద్ర‌లేచి వ‌స్తుంటార‌ని ఎద్దేవా చేశారు. ఆంధ్ర‌ప్రదేశ్ రైతులు చాలా ఆనందంగా ఉన్నార‌న్నారు. ప‌ట్టిసీమ వ‌ల్ల కృష్ణా డెల్టా బాగుపడింద‌నీ, క‌డ‌ప నుంచి చిత్తూరు వ‌ర‌కూ నీళ్లు వెళ్తున్నాయ‌నీ, పులివెందుల‌లో పొలాల‌న్నీ ప‌చ్చ‌గా ఉన్నాయ‌నీ, త‌మ‌కు నీళ్లివ్వ‌డం వ‌ల్ల బంగారం పండిస్తున్నామ‌ని రైతులు సంతోషంగా ఉన్నార‌న్నారు. పేప‌ర్ల‌లో టీవీల్లో ఎప్పుడూ క‌నిపించాల‌నే త‌పన త‌ప్ప‌… నిజంగా పోరాటం చేసే ఉద్దేశం ప‌వ‌న్ క‌ల్యాణ్ కి లేద‌న్నారు. ఆయ‌న భాజ‌పాతో కుమ్మ‌క్కైన వ్య‌క్తి అనీ, కేంద్రంపై అవిశ్వాసం పెడితే మ‌ద్ద‌తు కూడ‌గ‌డ‌తాన‌ని చెప్పి అడ్ర‌స్ లేకుండా పోయార‌న్నారు. చిత్త‌శుద్ధి, క‌మిట్మెంట్‌, ఒక మాట మీద నిల‌బ‌డ‌లేని వ్య‌క్తులు రాజ‌కీయాల్లో ఉంటే ఇలానే ఉంటుంద‌ని నాని అన్నారు.

తాజాగా కేంద్రం ఫైల్ చేసిన అఫిడ‌విట్ పై మాట్లాడుతూ.. గ‌వ‌ర్న‌ర్‌, కేసీఆర్‌, మోడీ క‌లిసి ఆడుతున్న కుట్ర‌గా దీన్ని చూడాల‌న్నారు. పార్ల‌మెంటు చేసిన చ‌ట్టాన్ని తిర‌స్క‌రించ‌డ‌మంటే, పార్లమెంటును అవ‌మానించ‌డ‌మే అన్నారు. ఆంధ్రాలో జ‌గ‌న్‌, ప‌వ‌న్‌, గ‌వ‌ర్న‌ర్ క‌లిసి చంద్రబాబుపై కుట్ర చేస్తున్నార‌న్నారు. మోడీ ఆడిస్తున్న నాట‌కంలో పాత్ర‌దారులు వీళ్లంతా అని నాని ఆరోపించారు. తాజా ప‌రిణామాల‌పై ఎలాంటి పోరాటం చేయాల‌నేదానిపై ముఖ్య‌మంత్రి త్వ‌ర‌లోనే ఒక నిర్ణ‌యం తీసుకుంటార‌ని చెప్పారు.

ప‌వ‌న్ విష‌యంలో కేశినేని నాని చేసిన వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ ఘాటుగా స్పందించే అవ‌కాశం ఉంది. ఎందుకంటే, గ‌తంలో కూడా ఇలానే ‘ప‌వ‌న్ సీరియ‌స్ పొలిటీషియ‌న్ కాదు’ అని టీడీపీ నేత‌లు విమ‌ర్శిస్తే ప‌వ‌న్ ఘాటుగా స్పందించారు. తాజాగా కూడా, తాను 2004 నుంచి క్రియాశీల రాజ‌కీయాల్లో ఉంటూ వ‌స్తున్నాన‌నీ, అనుభ‌వం కోసం ఇన్నాళ్లు ఎదురుచూశాన‌నీ, స‌త్తా లేక కాద‌ని భీమ‌వ‌రంలో మాట్లాడారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.