ఒలింపిక్ చాంపియ‌న్‌ను మ‌ట్టి క‌రిపించిన కిడాంబి

అత‌ని దీక్ష ముందు ఒలింపిక్ ఛాంపియ‌న్ త‌లొంచాడు. అత‌ని ప‌దునైన రిట‌ర్న్‌లు.. ధాటైన స్మాష్‌లకు స‌మాధానం లేక‌పోయింది. ఫ‌లితంగా వారం రోజుల వ్య‌వ‌ధిలో రెండో సూప‌ర్ టైటిల్ అత‌ని ఒడిలో వాలింది. గుంటూరుకు చెందిన తెలుగు తేజం కిడాంబి శ్రీ‌కాంత్ అద్భుత‌మైన ఆట తీరు ష‌టిల్ ప్ర‌పంచంలో అత‌డిని శిఖ‌రాగ్రంపై నిల‌బెట్టింది. ఆదివారం ఉద‌యం జ‌రిగిన ఆస్ట్రేలియా ఓపెన్ సూప‌ర్ సిరీస్ ఫైన‌ల్లో ఒలింపిక్ చాంపియ‌న్ చెన్ లాంగ్‌పై శ్రీ‌కాంత్ అలవోక‌గా విజ‌యం సాధించాడు. రెండు వ‌రుస సెట్ల‌లో ప్ర‌త్య‌ర్థిని మ‌ట్టిక‌రిపించాడు. అత‌ని ఆట తీరుకు లాంగ్ అచ్చెరువొందాడు. 24 ఏళ్ళ కిడాంబి శ్రీ‌కాంత్ న‌మ్మాళ్వార్ త‌న ష‌టిల్ కెరీర్‌లో ఇంత‌వ‌ర‌కూ 138 విజ‌యాల‌ను చ‌విచూశాడు. 75 ఓట‌ముల‌ను రుచి చూశాడు. మొత్తం ప‌ది టైటిల్స్‌ను కైవ‌శం చేసుకున్నాడు. 2015 జూన్ నాటికి 3 వ‌ర్యాంకులో ఉన్న కిడాంబి ప్ర‌స్తుత ర్యాంకు 11. 2011 కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో అత‌డి ప్ర‌తిభ బ‌య‌ట‌ప‌డింది. మిక్స్‌డ్ డ‌బుల్స్ పోటీలో ర‌జ‌త ప‌త‌కాన్ని గెలుచుకున్నాడు. పుల్లెల గోపీచంద్ శిక్ష‌ణ‌లో రాటుదేలిన శ్రీ‌కాంత్ ఆదివారం నాటి గెలుపుతో ష‌టిల్ ప్ర‌పంచంలో త‌న పేరు మార్మోగేలా చేసుకున్నాడు. వారం క్రితం ఇండోనీషియా సూప‌ర్ సిరీస్ విజేత‌గా నిలిచిన ఈ ఆట‌గాడు ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ సూప‌ర్ సిరీస్‌లోనూ విజ‌య‌కేత‌నాన్ని ఎగుర‌వేశాడు. ష‌టిల్ ప్ర‌పంచంలో రారాజైన చైనా నైపుణ్యాన్ని ప్ర‌శ్నించేలా అత‌డి ఆట తీరు సాగింది. ఒలింపిక్ ఛాంపియ‌న్ లాంగ్… శ్రీ‌కాంత్ షాట్ల‌కు నిరుత్త‌రుడై చూడ‌టం మిన‌హా ఏమీ చేయ‌లేక‌పోయాడు. ఒలింపిక్ చాంపియ‌న్‌కు అవ‌కాశ‌మీయ‌కుండా వ‌రుస సెట్ల‌లో నెగ్గ‌డం మామూలు విషయం కాదు. తెలుగు క్రీడా య‌వ‌నిక‌పై మెరిసిన మ‌రో క్రీడాకారుని ప‌ట్ల ఆంధ్ర ప్ర‌భుత్వం ఎలా స్పందింస్తుందో చూడాల్సి ఉంది. ఒలింపిక్స్‌లో ర‌జ‌త ప‌త‌కాన్ని గెలుచుకున్న బ్యాడ్మింట‌న్ స్టార్ పివి సింధుపై చంద్ర‌బాబు వరాల వ‌ర్షం కురిపించారు. స్థ‌ల‌మిచ్చారు. డిప్యుటి క‌లెక్ట‌ర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. తెలుగు గడ్డ కీర్తిని ప‌తాక‌స్థాయిలో నిలిపిన శ్రీ‌కాంత్ త‌ల్లితండ్రులు త‌మ బిడ్డ సాధించిన ఘ‌న‌త‌ను చూసి, ఉప్పొంగిపోతున్నారు. స్వీట్లు పంచి త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close