కోదండ‌రామ్ పార్టీకి ఏర్పాట్లు జరుగుతున్న‌ట్టేనా..!

తెలంగాణలో మ‌రో కొత్త రాజ‌కీయ పార్టీ రాబోతోందా..? ఇన్నాళ్లూ ప్ర‌జల తర‌ఫున పోరాటాలంటూ ఉన్న ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్ రాజ‌కీయ పార్టీ పెట్టేందుకు బ్యాక్ గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారా..? పార్టీకి సంబంధించిన ప‌నులు మొద‌ల‌య్యాయా..? ఈ ప్ర‌శ్న‌ల‌న్నింటికీ అవున‌నే స‌మాధానం చెప్పాలి. నిజానికి, కోదండ‌రామ్ రాజ‌కీయ పార్టీ పెట్టే ఉద్దేశంలో ఉన్నార‌న్న వార్త కొత్త‌దేం కాదు. గ‌తంలో ఈ అంశ‌మై చాలా ర‌కాల అభిప్రాయాలు చ‌క్క‌ర్లు కొట్టాయి. తెలంగాణ‌లో మ‌రో రాజ‌కీయ పార్టీ అవ‌స‌రం ఎంతైనా ఉందంటూ గ‌తంలో కోదండ‌రామ్ వ్యాఖ్యానిస్తూ… కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించి కొన్ని సంకేతాలు ఇచ్చారు. అయితే, తాజాగా జ‌రుగుతున్న చ‌ర్చ ఏంటంటే.. తెలంగాణ యాక్టివ‌స్టు గాదె ఇన్న‌య్య పేరుతో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఓ సందేశం!

దీని సారాంశం ఏంటంటే.. కోదండ‌రామ్ భాగ‌స్వామ్యంలో ఏర్పాటు కాబోతున్న పార్టీలో చేరాల‌నుకునేవారు త‌మ‌ని కాంటాక్ట్ చెయ్యొచ్చూ అనేది! జూన్ నెల త‌రువాత తెలంగాణ రాజకీయాల్లో సంచ‌ల‌నాలు ఉంటాయంటూ ఇన్న‌య్య సోష‌ల్ మీడియాలో విశ్లేష‌ణ‌లు చేస్తూ ఉన్నారు. త్వ‌ర‌లోనే మ‌రోసారి తెలంగాణ‌లో రాజ‌కీయ వ‌ల‌స‌లు ఉంటాయ‌ని కూడా ఆయ‌న జోస్యం చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో తాజా మెసేజ్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పార్టీ ఏర్పాటుకు కోదండ‌రామ్ సిద్ధ‌మౌతున్నార‌నే సంకేతాలు వెలువ‌డుతున్నాయి.

అయితే, పార్టీ ఏర్పాటుకు సంబంధించిన క‌థ‌నాలను కోదండ‌రామ్ ఇప్పటికీ ఖండిస్తూనే ఉన్నారు. కొత్త రాజ‌కీయ పార్టీని పెట్టాల‌నే అంశం ఇంత‌వ‌ర‌కూ జేయేసీలో చ‌ర్చ‌కు వ‌చ్చింది లేద‌ని ఆయ‌న అంటున్నారు. ఇలాంటి క‌థ‌నాల‌ను, సందేశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌ద్ద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే, జూన్ నుంచి పార్టీకి సంబంధించిన కొన్ని ప‌నులు ప్రారంభించి.. ర‌క‌రకాల వేదికల ద్వారా అభిప్రాయాలు సేక‌రించి.. ద‌శలువారీగా క‌మిటీలు వేసుకుంటూ ఈ ఏడాది అక్టోబ‌ర్ లో పార్టీ ఏర్పాటు ఉంటుంద‌నే వ్యాఖ్యానాలు కూడా అక్క‌డ‌క్క‌డా వినిపిస్తున్నాయి. ఏదైతేనేం, మ‌రోసారి కోదండ‌రామ్ పార్టీకి సంబంధించిన చ‌ర్చ తెలంగాణ స‌మాజంలో హాట్ టాపిక్ గా మారుతోంది. నిజానికి, కోదండ‌రామ్ ప్ర‌స్థానం కూడా పార్టీ ఏర్పాటు దిశ‌గానే అడుగులు వేస్తోంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close