ఫ్లాష్ బ్యాక్‌: ఎన్టీఆర్‌ని ఢీ కొట్టిన కోట‌

ఎన్టీఆర్ అభిమానులు, ఆయ‌న్ని విమ‌ర్శించేవారూ… ‘మండ‌లాదీశుడు’ సినిమాని మ‌ర్చిపోలేరు. ఎన్టీఆర్‌పై, ఆయ‌న పాల‌న‌పై అదో సెటైర్‌. ఎన్టీఆర్ హ‌యాంలో.. ఎన్టీఆర్‌ని విమ‌ర్శిస్తూ, సెటైరిక‌ల్ సినిమా తీయ‌డం నిజంగా గొప్ప సాహ‌సం. ఎన్టీఆర్ పాత్ర‌లో కోట శ్రీ‌నివాస‌రావు న‌టించారు. అది కూడా కొంత‌మంది బ‌ల‌వంతం చేయ‌డంతో. ఆ సినిమా అటూ ఇటూ అయినా, ఎన్టీఆర్ అభిమానులు త‌న‌పై ప‌గ‌బట్టినా, త‌న సినిమా కెరీర్ అక్క‌డితో అంతం అయిపోతుంది. అయినా స‌రే, కోట ధైర్యం చేశాడు. ఎన్టీఆర్‌కి ఎదురెళ్లి మ‌రీ ఆ సినిమా పూర్తి చేశాడు.

సినిమా విడుద‌లైన త‌ర‌వాత‌.. చాలా విమ‌ర్శ‌ల‌కు గురైంది. ముఖ్యంగా కోట శ్రీ‌నివాస‌రావుకి సినిమా అవ‌కాశాలు త‌గ్గాయి. కోట‌కి ఛాన్స్ ఇస్తే, ఎన్టీఆర్ నుంచీ, ఆయ‌న వ‌ర్గం నుంచీ, ఏమైనా ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌న్న‌ది ద‌ర్శ‌క నిర్మాత‌ల భ‌యం. అందుకే కోట చేతిలోంచి సినిమాలు జారిపోయాయి. అంతేకాదు.. కొంత‌మంది టీడీపీ ఎం.ఎల్‌.ఏలు కోట‌కు ఫోన్ చేసి ‘ఎన్టీఆర్‌ని అవ‌మానిస్తూ సినిమా తీశారు. మీకెందుకొచ్చిన గొడ‌వ‌..’ అంటూ ప‌రోక్షంగా బెదిరించ‌డం మొద‌లెట్టారు. కోట ఇంటిపై కూడా చాలాసార్లు దాడులు జ‌రిగాయి. ఓసారి కోట బెజ‌వాడ వెళ్లారు అదే స‌మ‌యంలో ఎన్టీఆర్ అభిమానులు అక్క‌డ గుమిగూడారు. కోట‌ని చూసి ఆవేశంతో వెంట‌ప‌డ్డారు. ‘మా నాయ‌కుడ్ని అవ‌మానించే పాత్ర చేస్తావా’ అంటూ భౌతికంగానూ దాడి చేశారు. ఆ క్ష‌ణంలో ఏదోలా ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ‌గలిగాడు కోట‌.

ఇలానే రోజులు కొన‌సాగితే.. ఎన్టీఆర్ అభిమానులు త‌న‌పై క‌క్ష క‌ట్టే ప్ర‌మాదం ఉంద‌ని కోట‌కి భ‌యం వేసింది. ఎలాగోలా ఈ చాప్ట‌ర్‌కి ముగింపు ప‌ల‌కాల‌ని భావించాడు. ఆ అవ‌కాశం అనుకోకుండా వ‌చ్చింది. ఓసారి చెన్నై ఎయిర్ పోర్టులో ఎన్టీఆర్‌ని క‌లిసే అవకాశం వ‌చ్చింది కోట‌కు. అప్ప‌టికి ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్నారు. చుట్టూ జెడ్ కాట‌గిరీ సెక్యురీటీ ఉంది. అయినా స‌రే, ఆ సెక్యురిటీని ఛేదించుకుని మ‌రీ.. ఎన్టీఆర్‌ని క‌లుసుకుని, కాళ్ల‌మీద ప‌డిపోయాడు కోట‌. అయితే ముందు ఎన్టీఆర్ కోట‌ని గుర్తు ప‌ట్ట‌లేదు. ఆ త‌ర‌వాత ‘ఏం బ్ర‌ద‌ర్‌… మీరా… ఆరోగ్యం ఎలా వుంది..’ అంటూ కుశ‌ల స‌మాచారం అడిగారు. తాను ఏ ప‌రిస్థితుల్లో మండ‌లాదీశుడు సినిమా చేయాల్సివ‌చ్చిందో ఎన్టీఆర్‌కి వివ‌రించి, ఆయ‌న ఆశీర్వాద‌లు తీసుకుని అక్క‌డి నుంచి బ‌య‌ట ప‌డ్డాడు కోట‌. అలా ఎన్టీఆర్ తో వైరం అనే ఎపిసోడ్‌కి త‌నంత‌ట తానే తెర‌దించుకోగ‌లిగాడు కోట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

షర్మిల రాజకీయానికి జగన్ బెదురుతున్నారా..?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై జగన్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మరుసటి రోజే షర్మిలకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు....

నిస్సహాయుడిగా కేసీఆర్..!?

బీఆర్ఎస్ నేతలపై కేసీఆర్ పట్టు కోల్పోతున్నారా..? క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే ఆ పార్టీలో క్రమశిక్షణ లోపిస్తుందా..? నేతలు హద్దులు దాటుతున్న చర్యలు తీసుకోని నిస్సహాయ స్థితికి కేసీఆర్ చేరుకున్నారా..? అంటే అవుననే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close