ప్రజాధనాన్ని దోచుకోవడానికి ప్రత్యేకంగా యూనివర్శిటీల్లో పాఠాలు చెప్పరు.కానీ కొంత మందికి తాము చదువుకున్న చదువులోనో, చేసిన పనులతోనే అనుభవం పెంచుకుని లార్జ్ స్కేల్‌కు వెళ్లిపోతారు. ఇలాంటి పనుల్లో జగన్ ముఠా చేసిన నిర్వాకాలు చూస్తే..ఇలా కూడా చేయవచ్చా అని అందరూ ఆశ్చర్యపోతారు.తమ దోపిడీకి అధికారిక ముద్రవేయించుకునేందుకు ప్రపంచ స్థాయి కంపెనీలను కూడా వదిలి పెట్టకుండా వాడేశారు.
క్విడ్ ప్రో కోలో డెలాయిట్ వాడకం
క్విడ్ ప్రో కో సమయంలో .. జగన్ రెడ్డి తనకు లేని కంపెనీల ఆస్తుల విలువ లెక్క కట్టడానికి డెలాయిట్ ను వాడారు. తాను పావలా పెట్టుబడి పెట్టి వందల కోట్లకు అందులో .. ఐదు శాతం షేర్లను అమ్మేసిన ఘనత ఆయన సొంతం. దీనికి చట్టబద్ధత ఉందని నిరూపించడానికి డెలాయిట్ ను వాడేశారు. డెలాయిట్ నివేదికల ప్రకారం వారు పెట్టుబడులు పెట్టారని నమ్మించారు. అప్పట్లో ఇదంతా విజయసాయిరెడ్డి చూసుకున్నారు. డెలాయిట్ తో తప్పుడు నివేదికలు ఇప్పించి..క్విడ్ ప్రో కో చేసేశారు.
లిక్కర్ స్కాంలో కేపీఎంజీ
ఇప్పుడు లిక్కర్ స్కాం చేయడానికి కేపీఎంజీని వాడేశారు. తమకు ఎలాంటి నివేదికలు కావాలో వాళ్లకు చెప్పి తెప్పించుకున్నారు. అయినా వారు అడ్డగోలుగా నివేదిక ఇవ్వకపోయేసరికి.. వారు చెప్పకపోయినా చెప్పినట్లుగా రాసుకుని .. వారి పేరు మీదే పనులు పూర్తి చేశారు. ఇప్పుడు దొరికిపోయారు. కేపీఎంజీ కంపెనీ ఇరుక్కుపోయింది. తమకేం సంబంధం లేదని అసలేం జరిగిందో వారు పూసగుచ్చినట్లుగా చెప్పారు.
అమరావతి రిపోర్టుల కోసం బోస్టన్ కన్సల్టెన్సీ వాడకం
గతంలో అమరావతిని చంపేయడానికి బోస్టన్ కన్సల్టెన్సీని వాడుకున్నారు. ఆ సంస్థ పేరుతో నివేదికలు తెప్పించారు. ఇప్పుడు ఆ విషయం బయటకు లాగితే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి. బోస్టన్ కన్సల్టెన్సీ కూడా పెద్దదే. వారు ఏపీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికను ఎవరు తయారు.. ఎవరు చెప్పారు.. ఏం పరిశీలించారో బయటకు లాగితే..అమరావతిపై జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ చేసి నకుట్రలు బయటకు వచ్చే అవకాశం ఉంది.