ఆ ఎత్తిపోతల టెండర్లు ఆపాల్సిందే..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణాబోర్డు నుంచి ఒక్కటంటే.. ఒక్క మంచి కబురు అందడం లేదు. శ్రీశైలంలోకి నీరు చేరక ముందే.. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని.. ఫిర్యాదు చేసినా… కేఆర్ఎంబీ పట్టించుకోలేదు కానీ… రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లను పిలవడంపై… తెలంగాణ ఫిర్యాదు చేయగానే… కేఆర్ఎంబీ స్పందించింది. తక్షణం టెండర్ల ప్రక్రియ నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. కొద్ది రోజుల కిందట… ఎన్జీటీ నుంచి టెండర్లు కొనసాగించడానికి.. అనుకూలంగా ఏపీ సర్కార్ ఉత్తర్వులు పొందింది. దాంతో.. టెండర్లు పిలిచి.. జ్యూడిషియల్ ప్రీవ్యూ ప్రక్రియకు సిద్ధమయింది. అయితే.. ఈ టెండర్లపై తెలంగాణ ప్రభుత్వం కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేసింది.

రాయలసీమ ఎత్తిపోతల పథకం… ప్రాజెక్ట్‌ ప్రకటన చేసి.. జీవో విడుదల చేసినప్పటి నుంచి ఏపీ సర్కార్ తీరు వివాదాస్పదమవుతోంది. ఆ ప్రాజెక్టును.. రాజకీయంగా ఉపయోగించుకోవడానికి .. సెంటిమెంట్లు రెచ్చగొట్టడానికి హంగామా చేస్తున్నారు కానీ.. నిజంగా కట్టాలనుకుంటే… సన్నిహిత సంబంధాలు ఉన్న.. తెలంగాణ సర్కార్‌తో మాట్లాడి.. ఇబ్బందుల్లేకుండా చూసుకునేవారని విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో… ఆ వివాదాన్ని అంతకంతకూ పెంచే ప్రయత్నమే చేశారు. కృష్ణారివర్ బోర్డును కూడా పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఏకపక్ష నిర్ణయాలతో.. కేఆర్ఎంబీ కూడా.. పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఏపీ విభజన చట్టాన్ని పట్టించుకోకుండా… ప్రాజెక్టులు నిర్మిస్తోందన్న ఆరోపణలతో.. కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లన్నింటినీ.. ఇవ్వాలని కేంద్రం కోరింది. పీఎంఓ కూడా ఈ అంశంపై ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. అయితే… ఏపీ సర్కార్ మాత్రం.. ఎవరూ అడ్డుకోలేరంటూ.. టెండర్లకు వెళ్లిపోతోంది. ఇప్పుడు.. కేఆర్ఎంబీ మళ్లీ లేఖ రాయడంతో.. టెండర్లు నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వచ్చే నెల ఐదో తేదీన.. అపెక్స్ కౌన్సిల్ భేటీ ఉందని.. అందులో తెలంగాణ నుంచి ఏపీ సర్కార్ ఆమోదం పొందితే.. ఇబ్బంది లేకుండా.. ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. లేకపోతే.. ప్రాజెక్టుకు గండం ఏర్పడుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ నేతలు కోరుకున్న డోస్ ఇచ్చేసిన మోదీ

చిలుకలూరిపేట సభలో ప్రధాని మోదీ తమను పెద్దగా విమర్శించలేదని .. ఆయనకు తమపై ప్రేమ ఉందని.. తమ నేతను జైలుకు పంపబోని గట్టిగా ఆశలు పెట్టుకున్న వైసీపీ నేతలకు.. ప్రధాని మోదీ...

సెన్సార్ అయ్యింది..కానీ స‌ర్టిఫికెట్ లేదు!

'ప్ర‌తినిధి 2' విచిత్ర‌మైన స‌మ‌స్య‌లో ప‌డింది. నిజానికి గ‌త వార‌మే విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. కానీ.. సెన్సార్ ఆఫీస‌ర్ సెల‌వులో ఊరు వెళ్ల‌డం వ‌ల్ల, సెన్సార్ జ‌ర‌క్క‌, ఆగిపోయింది. ఇప్పుడు సెన్సార్...

కాంగ్రెస్ లోకి వెంకీ మామ‌!

ప‌ర్ ఫెక్ట్ టైమింగ్, క‌థ‌లో ఇమిడిపోయే త‌త్వం, క్యారెక్ట‌ర్ లో జీవించే న‌ట‌న‌... వెంక‌టేష్ అన‌గానే ఇవ‌న్నీ గుర్తుకొస్తాయి. ఏ పార్టీకి అనుబంధంగా ఉండ‌కుండా, కేవ‌లం సినిమాలే లోకంగా ఉండే వెంక‌టేష్ కాంగ్రెస్...

అలాగైతే రాజ‌మౌళితోనే సినిమాలు చేసేవాడ్ని!

నారా రోహిత్ కెరీర్ చాలా డీసెంట్ గా మొద‌లైంది. 'బాణం', 'సోలో', 'ప్ర‌తినిధి' లాంటి మంచి సినిమాల్ని అందించారాయన‌. రోహిత్ ఓ క‌థ ఎంచుకొన్నాడంటే అందులో విష‌యం ఉండే ఉంటుంద‌న్న న‌మ్మ‌కం క‌లిగించాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close