కృష్ణా పుష్కరాలకు జీరో పబ్లిసిటీ!

కృష్ణా పుష్కరాలకు ముందుగా ప్రచారం చేయనవసరంలేదని ముఖ్యమంత్రి భావిస్తున్నారని తెలిసింది. గోదావరి పుష్కరాలకు నెలరోజుల ముందునుంచే రాష్ట్రప్రభుత్వం యాడ్ ఫిల్ముల ద్వారా, పేపర్ యాడ్ లద్వారా ప్రచారం మొదలు పెట్టింది. రాజమహేంద్రవరాన్ని ఒక బ్రాండ్ గా, గోదావరిని ఒక టూరిజమ్ ఐకాన్ గా, రకరకాల సర్వీసులకు ఒక స్టిమ్యులేటర్ గా గోదావరి పుష్కరాలను మలచుకోవాలని అందుకు ప్రచారం అవసరమని అప్పట్లో స్వయంగా చంద్రబాబే మీడియా సమావేశంలో చెప్పారు. అయితే ఆసూత్రాన్ని ఆగస్టు 12 న మొదలయ్యే కృష్ణా పుష్కరాలకు మాత్రం వర్తింపజేయడంలేదు.

విజ‌య‌వాడ కేంద్రంగా ప‌రిపాల‌న సాగిస్తున్న చంద్ర‌బాబు పుష్క‌ర స‌న్నాహాల‌పై దృష్టి పెట్టారు. ఇప్ప‌టికే పుష్క‌ర ప‌నుల్లో లోపాల‌ను ఆయ‌న గుర్తించారు. అధికారుల్లో స‌మ‌న్వ‌యం కనిపించ‌క‌పోవ‌డంతో ఎక్క‌డ ప‌నులు అక్క‌డే ఉన్నాయ‌న్న విష‌యాన్ని గమనించారు. సీరియ‌స్ అయ్యారు. పుష్క‌రాల కోసం ఇప్ప‌టికీ ఒక్క ఘాట్ కూడా పూర్తిగా సిద్ధం కాక‌పోవ‌డంపై కాంట్రాక్టర్ ను అరెస్ట్ చేయండి అనేటంతవరకూ వెళ్ళారు.

ఇప్ప‌టికే విజ‌య‌వాడ న‌గ‌రంలో ట్రాఫిక్ స‌మ‌స్య వెంటాడుతోంది. ఇక పుష్క‌రాల పేరుతో భారీ సంఖ్య‌లో యాత్రికులు త‌ర‌లివ‌స్తే ఏం జ‌రుగుతుందోన‌న్న ఆదుర్దా ప్రభుత్వయంత్రాంగంలో బెజ‌వాడ వాసుల్లోను క‌నిపిస్తోంది. అయినా స‌న్నాహాలు అర‌కొర‌గానే క‌నిపిస్తున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో అతిగా ప్ర‌చారం చేసి భారీ సంఖ్య‌లో జ‌నాల‌ను త‌ర‌లిస్తే అస‌లుకే మోసం వ‌స్తుంద‌ని ముఖ్యమంత్రితో సహా విజయవాడ నాయకులు భావిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. పుష్క‌రాల నాటికి పూర్తిచేస్తామ‌ని చెప్పిన ఫ్లైఓవ‌ర్ ప‌రిస్థితి దాదాపు ప‌డ‌కేసింది. ఇప్ప‌టికీ సిద్ధం అవుతుందో తెలియ‌ని స్థితి ఉంది. ఈలోగా పిల్ల‌ర్లు కుప్ప‌కూలి క‌ల‌వ‌రం క‌లిగిస్తున్నాయి.

ఏడాది క్రితం గోదావ‌రి పుష్క‌రాల సంద‌ర్భంగా ప్ర‌చారం హోరెత్తించిన సంగ‌తి తెలిసిందే. అదే స‌మ‌యంలో ప్ర‌చారం శృతిమించ‌డంతో తొలిరోజే తొక్కిసలాటలో 29 మంది చనిపోయిన సంఘటన మాయ‌ని మ‌చ్చ‌గా బాబుని వెంటాడుతోంది.

రాజ‌మండ్రితో పోలిస్తే విజ‌య‌వాడ‌లో అంత సౌక‌ర్య‌వంతంగా క‌నిపించ‌దు. అలాంటి చోట ల‌క్ష‌ల మంది పోగుప‌డితే ఇబ్బందులు వ‌స్తాయి. ద‌స‌రా లాంటి సంద‌ర్భంలో భ‌వానీ భ‌క్తుల రాక‌తోనే న‌గ‌రం కిక్కిరిసిపోయి ఉంటుంది. అలాంటిది పుష్క‌రాల పేరుతో పెద్ద‌గా ప్ర‌చారం సాగిస్తే ఎక్కువ సంఖ్య‌లో జ‌నం వస్తారు కనుక ఇప్పటినుంచే ప్ర‌చారం చేయ‌డం ఇబ్బందులు కొనితెచ్చుకోవ‌డ‌మేన‌ని లెక్క‌లేస్తున్న‌ట్టు స‌మాచారం. పుష్క‌రాలు ప్రారంభ‌మ‌యిన త‌ర్వాత మాత్ర‌మే ప్ర‌చారం చేయవచ్చని ప్రభుత్వంలో పెద్దలు భావిస్తున్నారు.

అంతెందుకు గోదావరి పుష్కరాలకు రూపొందించిన లోగోకే కృష్ణా పుష్కరాలు అనే పేరు రాసి ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖమంత్రి మాణిక్యాల రావు కలసి విడుదల చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close