రివ్యూ : ‘కృష్ణ వ్రింద విహారి’

Krishna Vrinda Vihari Movie Telugu Review

తెలుగు360 రేటింగ్: 2.5/5

లాక్ డౌన్ కారణంగా ఆలస్యమైన చిత్రాల్లో నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’ ఒకటి. 2020లో రావాల్సిన చిత్రమిది. ఎట్టకేలకు థియేటర్లోకి వచ్చింది. ‘అలా ఎలా’ ఫేమ్ అనీష్‌ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. తొలి సినిమాకే రొమాంటిక్ కామెడీ తీర్చిదిద్దడంలో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. నాగశౌర్యకు బాగా కలిసొచ్చిన జోనర్ ఇది. ఇప్పటివరకూ నాగశౌర్య హిట్స్ అన్నీ ఈ జోనర్ లో వచ్చినవే. ఈ ఇద్దరూ ‘కృష్ణ వ్రింద విహారి’ కోసం కలిశారు. ‘కృష్ణ వ్రింద విహారి’ .. నాని ‘అంటే సుందరానికీ’ కథ ఒకటేనని ప్రచారం జరిగింది. అయితే నాగశౌర్య ఎప్పుడూ లేనంతగా ఏకంగా పాదయాత్ర చేసి.. మాది ఒరిజినల్ కంటెంట్ ని నమ్మకంగా చెప్పాడు. మరి శౌర్య నమ్మకం నిజమైయింది ? రొమాంటిక్ కామెడీ శౌర్యకి మరోసారి కలిసొచ్చిందా ?

కృష్ణాచారి(నాగశౌర్య)ది సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. కృష్ణ తల్లి అమృతవల్లి (రాధిక శరత్ కుమార్) ఆచార, సంప్రాదాయాల విషయంలో చాలా క‌చ్చితంగా వుంటుంది. కృష్ణకి హైదరాబాద్ లో ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో చేరిన మొదటి రోజే తన టీమ్ లీడ్ వ్రింద (షర్లీ)ని చూసి ప్రేమలో పడిపోతాడు. వ్రింద అల్ట్రా మోడరన్ అమ్మాయి, ఇండిపెండెంట్. ఒకే ఆఫీస్ లో పని చేస్తున్న ఇద్దరూ దగ్గరౌతారు. కృష్ణ ఒక రోజు వ్రిందకి తన ప్రేమ గురించి చెబుతాడు. వ్రింద కూడా కృష్ణ ప్రేమని అంగీకరిస్తుంది. అయితే ఆ మరుసటి రోజే నువ్వు నాకు కరెక్ట్ కాదని చెబుతుంది. కారణం చెప్పమని వెంటపడతాడు కృష్ణ. అప్పుడు తన సమస్యని చెబుతుంది వ్రింద. వ్రింద చెప్పిన సమస్య వింటే ఎట్టిపరిస్థితిలో కృష్ణ ఇంట్లో పెళ్లికి అంగీకరీంచరు. అప్పుడు తన పెళ్లి కోసం కృష్ణ ఏం చేశాడు ? అల్ట్రా మోడరన్ అమ్మాయి వ్రింద ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంతో ఇమడగలిగిందా? ఇంతకీ వ్రిందకి వున్న సమస్య ఏమిటి ? అనేది మిగిలిన కథ.

‘కృష్ణ వ్రింద విహారి’ .. నాని ‘అంటే సుందరానికీ’ పాయింట్ ఒకటేనని ప్రచారం జరిగింది. అది నిజమేనని తేలిపోయింది. ‘కృష్ణ వ్రింద విహారి’, ‘అంటే సుందరానికీ’ పాయింట్ ఒకటే. ఒకటే నేపధ్యాలు. పెళ్లి కోసం ఒక అబద్ధం ఆడుతాడు హీరో. ఒక సమస్యని తనపై వేసుకుంటాడు. ఆ సమస్య తన కొడుక్కి వుండటం వలన సంప్రదాయాలు, ఆచారాలు పక్కన పెట్టి ఒక నిర్ణయాన్ని తీసుకుంటుంది కుటుంబం. అయితే అదే సమస్య మనకి కాదు వేరే వాళ్ళకి వుందని తెలిస్తే ఆచారాలు, సంప్రదాయాలు గుర్తుకువస్తాయి. అంటే సుందరంలో ఇదే చెప్పారు. ‘కృష్ణ వ్రింద విహారి’ థీమ్ కూడా ఇదే. ఈ రెండు సినిమాల మధ్య ఏడాది కూడా గ్యాప్ లేకపోవడం వలన ఆ పోలికలు ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి.

అయితే ఈ కథకి దర్శకుడు అనిష్ కృష్ణ ట్రీట్మెంట్ కొంత ఫ్రెష్ నెస్‌ని జోడించింది. అంటే సుందరం స్క్రీన్ ప్లే జిగ్ జాగ్ గా వుంటుంది. కానీ ఇందులో మాత్రం చాలా ప్లేన్‌గా ఎలాంటి ఫ్లాష్ కట్ లు లేకుండా ప్రజంట్ చేశారు. కృష్ణ హైదరాబాద్ కి రావడం, ఆఫీస్ లో సత్య, రాహుల్ రామ కృష్ణ కామెడీ , ఇంట్లో బ్రహ్మజీ ట్రాక్ కొన్ని నవ్వులు పంచుతాయి. అయితే ఈ పాయింట్ కి ప్రేమ కథ చాలా ముఖ్యం. ఇద్దరు ఖచ్చితంగా పెళ్లి చేసుకొని జీవితం గడపాలి, దిని కోసం ఎన్ని అబద్దాలు ఆడినా ఫ‌ర్లేదనే ఫీలింగ్ ప్రేక్షకుడిలో రావాలి. అంటే సుందరానికీలో ఇది వర్క్ అవుట్ అయ్యింది. కానీ కృష్ణ వ్రిందలో మాత్రం ప్రేమకథ అంత బలంగా వుండదు. కృష్ణకి చూసిన అమ్మాయిలు నచ్చేస్తుంటారు. ఆఫీస్ లో హౌస్ కీపర్ గా పని చేసే ఓ అమ్మాయిని చూసి కూడా రోజ్ ఫ్లవర్ ఇచ్చేస్తాడు. ఆ తర్వాత వ్రిందని చూస్తే కృష్ణ గుండెల్లో గంటలు కొట్టేస్తాయి. నవ్వుకోవడానికి ఇలాంటి ట్రీట్మెంట్ బావుంటుంది కానీ ప్రేమని మాత్రం ఫీలవ్వలేం. సాఫ్ట్వేర్ ఆఫీస్ లో కండలు పెంచుకొని ఒక
గ్యాంగ్ వుంటుంది. ఆ గ్యాంగ్ ట్రాక్ ఏంటో విచిత్రంగా వుంటుంది. నాగశౌర్య షర్టు విప్పి మీ కంటే నాకు ఎక్కువ బాడీవుందని చూపించడానికి ఆ సెటప్ ని వాడుకున్నట్లు వుంది.

ఈ కథ అసలు పాయింట్ ఇంటర్వెల్ లోనే రివిల్ అవుతుంది. నిజానికి అంటే సుందరానికీ పాయింట్ కూడా ఇంటర్వెల్ లోనే రివిల్ కావాలి. కానీ వివేక్ ఆత్రేయ తన స్క్రీన్ ప్లేతో గజిబిజీ చేసి దాన్ని క్లైమాక్స్ కి తీసుకెళ్ళాడు. ఈ పాయింట్ ని ఇంటర్వెల్ లో రివిల్ చేసే అవకాశం అనిష్ కృష్ణకి దక్కింది. నిజానికి నావెల్టీ ఉన్న‌ పాయింట్ ఇది. కానీ ఆ పాయింట్ అంటే సుందరానికీలో ఇదివరకే చేసేయడంతో సెకండ్ హాఫ్ పై కొత్త ఆసక్తి పెరగదు. అయితే సెకండ్ హాఫ్ లో అనిష్ కృష్ణ కొన్ని మార్పులు చేసుకున్నాడు. ఈ కథని అత్తాకోడళ్ళడ్రామాగా మార్చాడు. ఈ క్రమంలో వచ్చే కొన్ని సీన్లు ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి. అయితే లీడ్ పెయిర్ మధ్య వున్న కెమిస్ట్రీని సరిగ్గా డీల్ చేయలేదు. కృష్ణ, వ్రిందలా సంఘర్షణ వర్క్ అవుట్ కాలేదు. పైగా రాధిక పాత్రతో కథలోనే ఒక కమ్యునికేషన్ గ్యాప్ సృష్టించాడు దర్శకుడు. ఎంతో విజ్ఞానం, ఆధునిక భావాలు కలిగిన వ్రింద కళ్ళు తిరిగి పడిపోతే ఏమైయిందని డాక్టర్ ని అడక్కపోవడం, కృష్ణ డైవర్స్ నోటీసులు తెరపైకి రావడం, క్లూలెస్గా వుంటాయి. క్లైమాక్స్ కూడా తేలిపోయింది. అప్పటివరకూ చాలా బలంగా వున్న రాధిక పాత్ర ఒక్క డైలాగ్ తో మారిపోతుంది. ఆ డైలాగ్‌ బావున్నా అందులో
సన్నివేశ బలం లేదు. అయితే చివర్లో వెన్నెల కిషోర్ పాత్ర రూపంలో క్రియేట్ చేసిన కోమా డ్రామా కొంత రిలీఫ్ ని ఇవ్వగలిగింది. దాదాపు రెండు నిమిషాలు సాగే ఈ ట్రాక్ హిలేరియ‌స్‌గా న‌వ్విస్తుంది. సెకండాఫ్‌లో ఈ కోమా డ్రామా బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. ఇలాంటి ట్రాకులు ఇంకో రెండు మూడు ఉంటే… కృష్ణ జాత‌కం మ‌రోలా ఉండేది.

రొమాంటిక్ కామెడీలు నాగశౌర్యకి బాగా నప్పుతాయి. ఈ కథ కూడా శౌర్య ఇమేజ్ కి సరిగ్గా నప్పింది. అతని లుక్, యాక్టింగ్ డీసెంట్ గా వున్నాయి. చాలా ఫిట్ గా వున్నాడు శౌర్య, తెరపై ఆ గ్రేస్ కనిపిస్తుంది. కృష్ణ పాత్రని చాలా ఈజ్ తో చేశాడు. షర్లీ అందంగా వుంది. నటన ఓకే. డబ్బింగ్ సొంత చెప్పుకోవడం అభినందించదగ్గ విషయం. ఆమె పాత్ర నార్త్ నుండి వచ్చిన అమ్మాయి కావడంతో తెలుగు ఉచ్చారణ విషయంలో మరీ వంకలుపెట్టె విధంగా వుండదు. సత్య, రాహుల్ రామకృష్ణ, బ్రహ్మజీ పాత్రలు కొన్ని నవ్వులుపంచుతాయి. రాధిక హుందాగా కనిపించారు. వెన్నెల కిషోర్ కోమా డ్రామా ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి.

మహతి స్వరసాగర్ మ్యూజిక్ డీసెంట్ గా వుంది. ఏముందిరా పాట చిత్రీకరణ బావుంది. టైటిల్ సాంగ్ కూడా హుషారుగా చేశారు. నేపధ్య సంగీతం ఓకే. సాయిశ్రీరామ్ కెమరాపనితనం నీట్ గా వుంది. విజువల్స్ ప్లజంట్ గా వున్నాయి. అనీష్ కృష్ణ డైలాగ్స్ కొన్ని పేలాయి. మంచి పాయింట్ ఇది. ఐతే ఇదే పాయింట్తో అంటే సుందరానికీ వచ్చేయడంతో చూసిన కంటెంట్ మళ్ళీ చూసినట్లుగా అనిపిస్తుంది. అయితే సెకండ్ హాఫ్ ని ఒక ఫ్యామిలీ డ్రామాగా మార్చి కృష్ణని ఒక ఒడ్డున పడేయడానికి దర్శకుడు చేసిన ప్రయత్నం ఓకే అనిపిస్తుంది.

తెలుగు360 రేటింగ్: 2.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎగ్జిట్ పోల్స్ : గుజరాత్‌లో మళ్లీ బీజేపీ – హిమాచల్‌లో టఫ్ ఫైట్ !

రెండు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకే మొగ్గు కనిపిస్తోందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. హిమాచల్ ప్రదేశ్‌లో పోలింగ్ నెలకిందటే ముగిసింది. అయితే ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉంది. గుజరాత్...

రోజాకు ఇంత అవమానమా !

మంత్రి రోజా అంటే ఫైర్ బ్రాండ్. నోరు తెరిస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. ఆ నోరుకు భయపడే మంత్రి పదవి ఇచ్చారనే టాక్ కూడా ఉంది అది వేరే విషయం. కానీ మంత్రి...

3 రాజధానులు కాదు 3 రాష్ట్రాలు చేయాలన్న పయ్యావుల !

రాయలసీమ గర్జన పేరుతో వైసీపీ నిర్వహించిన సభ ద్వారా ప్రజల మూడ్ ఏమిటో వైసీపీ పెద్దలకు అర్థమయ్యే ఉంటుందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సెటైర్ వేశారు. సీమ గర్జన పేరుతో...

విజయ్ ఫ్యామిలీతో జాన్వీ కపూర్ బాండింగ్

విజయ్‌ దేవరకొండ కి బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ వుంది. లైగర్ సినిమాకి ముందే విజయ్ అక్కడ క్రేజ్ తెచ్చుకున్నాడు. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా విజయ్ అంటే ఇష్టపడతారు. జాన్వీ కపూర్ కి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close