సీఎల్పీ విలీనం ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కార‌మే జ‌రిగింద‌న్న కేటీఆర్‌!

కాంగ్రెస్ ఎల్పీ విలీనంపై తెరాస వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ… ఈ ప్ర‌క్రియ‌లో ఏదైనా చ‌ట్ట విరుద్ధంగా, లేదా రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే ఎవ‌రైనా ప్ర‌శ్నించ‌వ‌చ్చ‌న్నారు. కాంగ్రెస్ శాస‌న స‌భాప‌క్షంలోని మూడింట రెండు వంతుల మిత్రులు… తెరాస ఎల్పీలో క‌లిసేందుకు సిద్ధ‌ప‌డ్డార‌న్నారు. వారు కోరిన వెంట‌నే తెరాస శాస‌న స‌భా ప‌క్ష నాయ‌కుడు ఆమోదం తెలిపారనీ, కాబ‌ట్టి విలీనానికి తాను కూడా అనుమ‌తిస్తున్న‌ట్టు అసెంబ్లీ స్పీక‌ర్ కూడా ప్ర‌క‌టించార‌న్నారు. కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే తాము చాలా రాజ్యాంగ‌బ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రించామ‌న్నారు!

గ‌తంలో తెరాస స‌భ్యుల‌ను లాక్కున్న విధానాన్ని ఒక్క‌సారి గ‌మ‌నిస్తే… ఇప్పుడు తాము అనుస‌రించిన వైఖ‌రి ఎంతో మ‌ర్యాద ‌పూర్వకంగా ఉన్న‌ట్టు లెక్క అన్నారు కేటీఆర్. ఈ పార్టీ ఫిరాయింపులు రాజ్యంగ విరుద్ధంగా జ‌రిగి ఉంటే, దానికి సంబంధించిన వేదిక‌లున్నాయ‌నీ, కోర్టుకు వెళ్తామ‌ని ఇప్ప‌టికే కాంగ్రెస్‌ వారూ ప్ర‌క‌టించి ఉన్నార‌నీ, ఏం జ‌రుగుతుందో వేచి చూద్దామ‌న్నారు. తెరాస‌కు చెందిన కొంత‌మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేర‌తామ‌ని ముందుకొస్తే ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వ‌ద్దంటారా అని ప్ర‌శ్నించారు. అలాగే, తెరాస‌లోకి వ‌చ్చి చేర‌తామ‌ని ముందుకు వ‌స్తున్న‌వారిని ఎందుకు వ‌ద్దంటామ‌న్నారు. పార్టీలో చేర్చుకున్నాక‌ టీడీపీ నుంచి గెలిచిన రేవంత్ రెడ్డితో రాజీనామా చేయించారా, అలాంట‌ప్పుడు తెరాస‌లో చేరిన‌వారిని రిజైన్ చేయాల‌ని కాంగ్రెస్‌ డిమాండ్ చేయ‌డం స‌రికాద‌న్నారు!! తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్షంగా కాంగ్రెస్ వ‌ద్దు అని ప్ర‌జ‌లే వ‌రుస ఎన్నిక‌ల్లో తీర్పులు ఇస్తున్నార‌ని గుర్తు చేసుకోవాల‌న్నారు.

కాంగ్రెస్ ఎల్పీ విలీనాన్ని కేటీఆర్ బాగానే స‌మ‌ర్థించుకున్నారు. అయితే, నిపుణులు చెబుతున్నమాట ఏంటంటే.. మూడింట రెండొంతులు మెజారిటీ ఉన్నా, ఆ పార్టీ అనుమ‌తి లేకుండా ఆ పార్టీకి చెందిన శాస‌న స‌భాప‌క్షాన్ని ఇంకో పార్టీలోకి ఎలా విలీనం చేస్తార‌న్న‌ది ప్ర‌శ్న‌..? ఉదాహ‌ర‌ణ‌కు ప్ర‌జారాజ్యం పార్టీ విలీనాన్ని గుర్తు చేసుకుంటే… ఆ పార్టీ తీర్మానించిన త‌రువాత స‌భ్యుల‌తో స‌హా కాంగ్రెస్ లో విలీన‌మైంది. ఇప్పుడు, తెలంగాణ‌లో కేవ‌లం కాంగ్రెస్ శాస‌న స‌భాప‌క్షం ఒక్క‌టే తెరాస‌లో విలీనం అవుతోంది. కాంగ్రెస్ పార్టీ కాదు క‌దా! అంటే, ఒక పార్టీ వేరు… ఆ పార్టీకి చెందిన శాస‌న‌స‌భా ప‌క్షం వేరు అనేది ఉండ‌దు క‌దా! శాస‌న స‌భా ప‌క్షం విలీనానికి సంబంధించి రాజ్యాంగంలో ఉన్న వెసులుబాటును రాజ‌కీయ పార్టీలు వేరే ర‌కంగా అర్థం చేసుకుంటున్నాయ‌నే అభిప్రాయ‌మూ కొంత‌మంది నిపుణులు వ్య‌క్తం చేస్తున్నారు. ఏదైమైనా, ఈ వ్య‌వ‌హారం ఎలాగూ కోర్టుకు వెళ్తుంది. దీనిపై మ‌రింత స్ప‌ష్ట‌త అక్క‌డే వ‌చ్చే అవకాశం ఉంది. మొత్తానికి, ఫిరాయింపులు అనేవి అన్ని పార్టీలూ చేస్తున్న ప‌నే అన్న‌ట్టుగా.. దాన్నొక స‌హ‌జ స్వ‌భావంగా నిర్వ‌చించే ప్ర‌య‌త్నం కేటీఆర్ చేశారు. ఈ క్ర‌మంలో ప్ర‌జాతీర్పు మాటేంటి, దానికున్న విలువ ఎంత అనే ప్ర‌శ్నలు‌… ఎప్ప‌టికీ ప్ర‌శ్నలు‌గానే ఉంటున్నాయి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close