ప్రొ.నాగేశ్వర్ : టీఆర్ఎస్‌తో కలవడం వల్ల వైసీపీకి వచ్చే లాభం ఏమిటి..?

ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు. తెలంగాణ అధికారపక్షం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… హైదరాబాద్ లో సమావేశం అయ్యారు. ఫెడరల్ ఫ్రంట్ పై ప్రాధమిక చర్చలు జరిగాయన్నారు. ఇటీవలి కాలంలో జగన్ వ్యాఖ్యలను చూస్తే ఆయన ఫెడరల్ ఫ్రంట్ లో భాగం కావడం ఖాయమని తెలుస్తోంది. అయితే ఇది సడన్ గా జరిగిన పరిణామం కాదు. టీడీపీ అధినేత చంద్రబాబు .. తెలంగాణలో ఎప్పుడైతే… కాంగ్రెస్ పార్టీతో మహాకూటమి ఏర్పాటు చేసి.. టీఆర్ఎస్ ను ఓడించేందుకు ప్రయత్నించారో.. అప్పట్నుంచే ఈ రాజకీయం ప్రారంభమయింది.

వైసీపీకి మద్దతు ద్వారా ఏపీ రాజకీయాల్లో టీఆర్ఎస్ వేలు..!

తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి ఏర్పాటు తర్వాత కేసీఆర్ చంద్రబాబుకు చాలా సార్లు హెచ్చరికలు పంపారు. తాము కూడా ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామని ప్రకటించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచి దానికి తగ్గ కార్యాచరణ ప్రారంభమయింది. జగన్ స్వయంగా కేసీఆర్ కు ఫోన్ చేశారని చెప్పుకొచ్చారు. ఏపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ వేలు పెట్టాలంటే… ప్రత్యక్ష ఎన్నికల ద్వారా సాధ్యం కాదు. ఏపీలో టీఆర్ఎస్ పోటీ చేయడం సాధ్యం కాదు.. కాబట్టి ఏదో ఓ పార్టీకి మద్దతివ్వాలి. ఏపీలో వైసీపీ, జనసేన పార్టీలు ఉన్నాయి. ఏపీలో బలమైన పార్టీకి మద్దతిస్తామని.. చాలా రోజులుగా చెబుతున్నారు. ఇప్పుడా బలమైన పార్టీగా వైసీపీని నిర్ణయించుకున్నట్లు ఉన్నారు. అందుకే ఇటీవలి కాలంలో జనసేన అధినేత కూడా.. విమర్శలు చేస్తున్నారు. తనను తెలంగాణలో తిరగనివ్వని… తన తండ్రిని విమర్శించిన కేసీఆర్ తో.. జగన్ రాజకీయాలు వ్యవహారాలు నడుపుతున్నారని .. మద్దతు పొందుతున్నారని ఆరోపిస్తున్నారు. తనతో పొత్తు కోసం.. జగన్ టీఆర్ఎస్ నేతలను తన వద్దకు పంపుతున్నారని కూడా చెప్పుకొచ్చారు. అంటే… టీఆర్ఎస్ మద్దతు జగన్ కే ఇస్తున్నారన్న విషయం మాత్రం స్పష్టమయింది.

గతంలో ఫెడరల్ ఫ్రంట్ కోసం జగన్ ను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు..?

ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టి.. టీడీపీని ఓడిస్తామన్న కేసీఆర్ వ్యూహంలో భాగంగానే.. ఈ మీటింగ్ జరిగిందని చెప్పుకొవచ్చు. కానీ ఫెడరల్ ఫ్రంట్ కోసం అని రెండు పార్టీల నేతలు చెబుతున్నారు. కానీ ఫెడరల్ ఫ్రంట్ కోసం… చర్చించడానికి వైసీపీ అధికార పార్టీ కాదు. అలా కాకపోయిన వచ్చే ఎన్నికల్లో కొన్ని సీట్లు వస్తాయనుకుందాం. కానీ కేసీఆర్ ఇప్పటి వరకూ ఫెడరల్ ఫ్రంట్ లో వైసీపీని తీసుకోవాలనే విషయంపై ఇప్పటి వరకూ.. ఎలాంటి చర్చలు జరపలేదు. తెలంగాణ ఎన్నికల ముందు వరకూ.. ఇంకా చెప్పాలంటే.. గతంలో.. కర్ణాటక, తమిళనాడు వెళ్లిన సందర్భాల్లో .. మీడియా అడిగిన ప్రశ్నలకు… తాను అమరావతి వెళ్లి చంద్రబాబును కలుస్తానని చెప్పారు. తనకు చంద్రబాబునాయుడు గుడ్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు.. జగన్ ను గుడ్ ఫ్రెండ్ గా భావిస్తున్నారు. అందుకే మిత్రులుగా మారిపోయారు.

వైసీపీతో స్నహం వల్ల టీఆర్ఎస్‌కు లాభమే..కానీ వైసీపీకి…!?

వైసీపీ, టీఆర్ఎస్ వల్ల ఎవరు లాభపడుతారన్నది కీలకం. ఎందుకంటే.. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్న మాటలను… వైసీపీ నేతలు… టీడీపీని ఓడిస్తారన్నట్లు తీసుకుని సంతోష పడుతున్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తే… అది నిజంగా చంద్రబాబుకు లాభం చేసే గిఫ్ట్ అవుతుందేమో అని పించకమానదు. తెలంగాణలో చంద్రబాబు అగ్రెసివ్ గా ప్రచారం చేయడం వల్ల టీఆర్ఎస్ గెలుపొందింది అన్న ప్రచారం ఉంది. ఇందులో నిజం కూడా ఉంది. అలాగే… ఏపీలో కేసీఆర్ ప్రచారం చేసి.. చంద్రబాబుకు అనుకూలంగా పరిస్థితిని మారుస్తారేమో..? ఎందుకంటే… టీఆర్ఎస్ వల్ల వైసీపీకి అదనంగా వచ్చే లాభం ఏమీ ఉండదు. కానీ టీఆర్ఎస్ కు లాభం. ఎందుకంటే… తెలంగాణలో వైసీపీకి కొంత ఓటు బ్యాంక్ ఉంది. 2019లో వైసీపీ పోటీ చేయడం లేదు. తెలంగాణలో వైసీపీని అభిమానించే సీమాంధ్ర ఓటర్లు ఉన్నారు. వీరంతా.. టీఆర్ఎస్ కు మద్దతు గా ఉంటారు. దీని వల్ల టీఆర్ఎస్‌కు లాభం కలుగుతుంది.

టీఆర్ఎస్‌తో దోస్తీ జగన్‌కు సెల్ఫ్ గోల్ లాంటి నిర్ణయమేనా..?

టీఆర్ఎస్ వల్ల వైసీపీకి కలిగే లాభం ఏమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే.. ఏపీలో కేసీఆర్ కు ఎలాంటి ఓటు బ్యాంక్ లేదు. ఏపీలో కేసీఆర్ అంటే గౌరవం ఉండొచ్చు. గౌరవం వేరు.. ఓటు బ్యాంక్ వేరు. ఆ గౌరవం కూడా.. ఎవరిస్తారు..? చంద్రబాబును వ్యతిరేకించేవారు మాత్రమే.. ఆ గౌరవం ఇస్తారు. ఎలా చూసినా.. కేసీఆర్ వల్ల… ఓటింగ్ పెరిగే అవకాశం లేదు. అయినప్పటికీ కేసీఆర్ తో జగన్ ఎందుకు కలుస్తున్నారో అర్థం కావడం లేదు. పైగా.. ఇది రివర్స్ అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ తో .. టీడీపీ కలవడం వల్ల ప్రజలు తెలంగాణలో ఎలా రియాక్ట్ అయ్యారో అలా రియాక్ట్ అయినా ఆశ్చర్యపోవాలసిన పని లేదు. ఇక… ఫెడరల్ ఫ్రంట్లో జగన్ చేరడం వల్ల టీఆర్ఎస్ కే లాభం. జగన్ ఎప్పుడూ… కాంగ్రెసేతర, బీజేపీయేతర ఫ్రంట్ కోసం ప్రయత్నించలేదు. జాతీయ రాజకీయాల్లో ఎలాంటి పాత్రా లేదు. పైగా.. ఇంత కాలం.. మోడీ, కేసీఆర్, జగన్ కలిసి ఏపీకి అన్యాయం చేస్తున్నారని టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మేలా జగన్ చేస్తున్నారు. ఏ విధంగా చూసినా.. కేటీఆర్, జగన్ భేటీ.. టీఆర్ఎస్ కు లాభం చేస్తుంది. కానీ జగన్ కు మాత్రం.. ఎలాంటి లాభం చేకూర్చదు. జగన్… సెల్ఫ్ గోల్స్ చేసుకోవడంలో ప్రసిద్ధుడంటారు. అలాంటి నిర్ణయమే టీఆర్ఎస్‌తో కలవడం కావొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com