చైతన్య : పారిపోవద్దు కేటీఆర్ – నిరూపించుకో !

భారత రాష్ట్ర సమితి పరాజయం తర్వాత కేటీఆర్ బాధ్యతల నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. కేసీఆరే మళ్లీ ప్రతిపక్ష నేతగా పోరాడతారని…ఆయన వస్తే కాంగ్రెస్ పని ఖతం అని చెబుతున్నారు. కానీ తానే ముందుండి పార్టీ నడిపిస్తానని … కాంగ్రెస్ సంగతి చూస్తానని చెప్పడం లేదు. పైగా ఎంపీగా పోటీ చేస్తానని లీకులిస్తున్నారు. అంటే రాష్ట్ర రాజకీయాలకు దూరంగా వెళ్లాలనుకుంటున్నారు. మళ్లీ బరువుంతా కేసీఆర్ పైనే పెట్టాలనుకుంటున్నారు.

కేసీఆర్ బాధ్యత పూర్తయిపోయింది.. ఇక కేటీఆర్ దే !

తెలంగాణ సాధన లక్ష్యంగా పార్టీని ఏర్పాటు చేసిన కేసీఆర్ అనుకున్నది సాధించారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా అత్యున్నత స్థానానికి ఎదిగారు. పదేళ్లు సీఎంగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ మొదటికి వచ్చారు. ఇప్పుడు బ్యాటన్ అందుకోవాల్సింది కేటీఆర్. పార్టీని మంచినా తేల్చినా ఆయనదే భారం. కొత్త తరం రాజకీయ వ్యహాలతో ముందుకు వెళ్లి యూపీలో అఖిలేష్ తరహాలో పార్టీని నిలబెడతారని ఎక్కువ మంది అనుకుంటున్నారు. అయితే కేటీఆర్ అనూహ్యంగా ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంటోంది. ఇది సహజగానే బీఆర్ఎస్ క్యాడర్ లో ఆశ్చర్యానికి కారణం అవుతోంది.

రాజకీయ నేతగా అసలైన పరీక్ష ఇంకా ఎదుర్కోని కేటీఆర్

కేటీఆర్ రాజకీయనాయకుడిగా ఇంకా పూర్తి స్తాయిలో సామర్థ్యాన్ని నిరూపించుకోలేదు. అంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీని ప్రజల తరపున పోరాడి అధికారంలోకి తెచ్చే స్థాయి రాజకీయం ఇంత వరకూ చేయలేదు. సవాళ్లను ఎదుర్కోలేదు. రాజకీయంగా వాటిని ఎలా అధిగమించాలన్న విషయంలో కేటీఆర్ రాజకీయంపై ఇంకా స్పష్టత లేదు. పూలపాన్పు మీద అన్నట్లుగా ఆయన రాజకీయాల్లోకి రాగానే ఉద్యమ బలం అంతా పార్టీకి వచ్చింది. అప్పట్నుంచి అధికారం అనుభవించారు. కానీ ఇప్పుడు ముళ్లబాట ప్రారంభమయింది. ఇది నడిస్తేనే రాజకీయ భవిష్యత్

బీఆర్ఎస్ ఓటమి ఓ రకంగా కేటీఆర్‌కు అవకాశం

కేటీఆర్ కు ఇప్పుడే అవకాశం వచ్చింది. తాను కూడా రాజకీయ నాయకుడ్నని.. నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ దిశగా కేటీఆర్ ప్రయత్నాలు సాగుతున్నాయా లేదా అన్నదానిపై బీఆర్ఎస్ లోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ములాయం సింగ్ యాదవ్ వయసు అయిపోయి స్లో అవుతున్న సమయంలో అఖిలేష్ యాదవ్ మెల్లగా పార్టీపై పట్టు పెంచుకున్నారు. ఆయన నేరుగా పదవిలోకి రాలేదు. పార్టీని గెలిపించారు. ఇందుకోసం యూపీ అంతా విస్తృతంగా పర్యటించారు. ములాయంనే చూపించి ఎన్నికల ప్రచారం చేశారు. గెలిచిన తర్వాత అందరూ ఆయననే సీఎంగా ఎన్నుకున్నారు. ఐదేళ్లు సీఎంగా ఉన్నారు. అఖిలేష్ చేసిన పోరాటం వల్లే రెండు సార్లు ఓడిపోయినా ఇంకా ప్రధానంగా పోరాడుతోంది ఎస్పీ. అలాంటి పునాదుల్ని.. నాయకత్వాన్ని ఇప్పుడు కేటీఆర్ నుంచి బీఆర్ఎస్ క్యాడర్ ఆశిస్తోందని అనుకోవచ్చు.

అలా చేయకుండా మళ్లీ టైగర్ కేసీఆరే అని పక్కకు తప్పుకుంటే అందివచ్చిన అవకాశాన్ని కాలదన్నుకున్నట్లే అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close