చైతన్య : నిజం కేటీఆర్ గారూ.. ఆ బాధ మీకూ ఇప్పుడే అర్థమవుతోంది !

యూట్యూబ్ చానళ్లు పిచ్చి పిచ్చి థంబ్ నెయిల్స్ పెట్టి… ఫేక్ వార్తలు రాసి మానసిక వేదనకు గురి చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆవేదనలో అర్థం ఉంది. సోషల్ మీడియా వెర్రి తలలు వేయడం ప్రారంభమయ్యాక.. దాన్ని పీక్ స్టేజ్ కి తీసుకు వెళ్తున్నాయి రాజకీయ పార్టీలు. ఆ చానళ్లను నడిపే వారిని ప్రోత్సహించి .. ఫండింగ్ చేసి పండగ చేసుకుంటున్నాయి. ఇవన్నీ తమ అభిమాన నేతల్ని పొగుడుకుంటే ఏ సమస్యా ఉండదు.. అవి చేసేది.. తమ అభిమాన నేతలకు ప్రత్యర్థులైన వారిపై బురద చల్లడమే. అక్కడే అసలు సమస్య వస్తోంది.

బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా చేసింది అదే !

పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా దీనికి మినహాయింపు కాదు. ఓ రకంగా చెప్పాలంటే తెలంగాణలో వ్యక్తిత్వ హననం అనే మిషన్ ను ప్రారంభించింది బీఆర్ఎస్ సోషల్ మీడియా. విచ్చలవిడిగా యూట్యూబ్ చానళ్లు.. సోషల్ మీడియా పేజీలతో రాజకీయ ప్రత్యర్థులపై అత్యంత ఘోరమైన కథనాలు రాసేవారు. థంబ్ నెయిల్స్ తో విరక్తి పుట్టించేవారు. రేవంత్ రెడ్డి మీద ఏ ముద్ర వేశారు ?. ఈటల రాజేందర్ ను బయటకు పంపాలనుకున్నప్పుడు ఏం చేశారు ?. ఇలాంటివన్నీ చూసిన వారికి.. ఇప్పుడు .. బీఆర్ఎస్, కేసీఆర్ టార్గెట్ గా వస్తున్న వీడియోలు.. పెడుతున్న థంబ్ నెయిల్స్ అంత అభ్యంతరకరంగా అనిపించడం లేదు. దీనికి కారణం ఎవరంటారు ?

ఆ బాధ తట్టుకోలేరు కేటీఆర్ గారూ.. మీకూ తెలుస్తోంది !

తప్పుడు ప్రచారాల బాధ తట్టుకోవడం చాలా కష్టం. ముఖ్యంగా ప్రజా జీవితంలో ఉన్న వారు… తమపై ఆధారాలు లేని తప్పుడు కథనాలు రాస్తే భరించలేరు. నిజాలు చెప్పినా పట్టించుకోకుండా అదే రాస్తే.. ఇంకా చెప్పాలంటే.. ఆ మీడియా పవర్.. ఆ సోషల్ మీడియా పవర్ తోనే ఓ నేతను టార్గెట్ చేస్తే.. భరించడం ఇంకా కష్టం. బీఆర్ఎస్ టార్గెగా చేసుకున్న లీడర్లపై గత పదేళల్లో ఎలాంటి మానసిక దాడులు జరిగాయో…కేటీఆర్ కు తెలియకుండా ఉంటుందా ?. ఆ దాడులతో వారు ఇబ్బంది పడుతూంటే.. మానసికంగా ఎంజాయి చేసి.. ఇప్పుడు తమ వంతు వచ్చే సరికి .. ఫైర్ అయిపోవడం.. ఇబ్బందికరమే. ఆ బాధ ఎంత ఘోరంగా ఉంటుందో అనుభవిస్తున్నందున కేటీఆర్.. పశ్చాత్తాపం చెందాల్సింది. .. కానీ ఆయన బెదిరింపులకు దిగుతున్నారు.

వాళ్లు చేశారని వీళ్లు.. వీళ్లు చేశారని వాళ్లు.. ఈ సైకిల్ ఇలా కంటిన్యూ… ప్రారంభించిన వాడితే తప్పు !

అధికారంలో ఉన్నప్పుడు యూట్యూబ్ చానళ్లు.. మీడియాతో బీఆర్ఎస్… తప్పుడు ప్రచారాలతో హోరెత్తించింది. అనేక మంది నేతల వ్యక్తిత్వాన్ని చర్చకు పెట్టింది. ఆ లీడర్.. ఈ లీడర్ అని లేడు… స్థాయి గురించి ఆలోచించలేదు. కానీ ఇప్పుడు తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫీలవుతున్నారు. ఇప్పుడు వాళ్లకు అధికారం వచ్చింది కాబట్టి చేస్తున్నారు. చేయకపోతే చేతకానితనం అని బీఆర్ఎస్ వాళ్లే ముద్ర వేస్తారు. ఇప్పటికే శాంపిలే అనుకోవచ్చు. ఎందుకంటే నాలుగు నెలలు కూడా కాలేదు అధికారం పోయి. గుండె దిటవు చేసుకోవాల్సిందే. దీనికి కారణం ఎవరు.. ఈ సైకిల్ ను ప్రారంభించిన వారిదే. అంటే ఎవరు ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close