కేటీఆర్ ఆమెరికా టూర్ సక్సెస్.. ఆ కంపెనీలన్నీ వస్తే..

తెలంగాణ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించడం.. ప్రభుత్వం ప్రారంభించిన మన ఊరు – మన బడి కార్యక్రమానికి విరాళాలు సేకరించే లక్ష్యంతో కేటీఆర్ అమెరికాలో పర్యటించారు. వారం రోజులకుపైగా సాగిన టూర్‌లో ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. అనేక మల్టినేషనల్ కంపెనీలు హైదరాబాద్‌లో కొత్తగా పెట్టుబడులు పెట్టడమో.. లేకపోతే ఇప్పటికే ఉన్నవాటిని విస్తరించడమో చేసేందుకు ఆసక్తి చూపించాయి.

అయితే కేటీఆర్ పర్యటనలో అన్నీ ప్రాధమిక మాటలే జరిగాయి. ఎలాంటి ఒప్పందాలు జరగలేదు. వీటిని ప్రభుత్వం తరపున పక్కాగా ఫాలో అప్ చేసుకుంటే పెట్టుబడులు మెటీరియలైజ్ అవుతాయి. హైదరాబాద్‌కు మరిన్ని అగ్రశ్రేణి సంస్థలు వచ్చినట్లవుతుంది. పెట్టబడుల ఆకర్షణ విషయంలో కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు కాబట్టి అమెరికా పర్యటన సక్సెస్ అయి నట్ల అనుకోవాలి .

అలాగే స్కూళ్లను అభివృద్ధి చేయాడాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. తెలంగాణకు చెందిన ఎన్నారైలు తమ స్వగ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ముందుకు రావాలని, తెలంగాణకు బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యవహరించాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చేందుకు అమెరికా వెళ్లారు. అమెరికాలో స్థిరపడిన తెలంగాణ వాసులు .. బాగా స్పందించారు. వీలైనంత ఎక్కువగా స్కూళ్ల రూపురేఖలను విరాళాలతో మార్చే లక్ష్యం నేరవేరే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close