అట్టహాసంగా కుమారస్వామి ప్రమాణస్వీకారం..! బలప్రదర్శన చేసిన బీజేపీ వ్యతిరేక పార్టీలు..!!

కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా కాంగ్రెస్ నేత పరమేశ్వర ప్రమాణం చేశారు. బలపరీక్ష పూర్తయిన తర్వాత కేబినెట్ విస్తరణ చేయనున్నారు. అనుకున్నట్లుగానే కుమారస్వామి ప్రమాణ స్వీకారం.. బీజేపీ వ్యతిరేక పక్షాల కూటమిగా సభగా కనిపించింది. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే ప్రతి పార్టీ అధ్యక్షులు హాజరయ్యారు. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా.. కాంగ్రెస్ వేదికపై ఉన్నందు వల్ల టీఆర్ఎస్, శినసేన వంటి పార్టీలు హాజరు కాలేదు. కానీ వారు జేడీఎస్ కు సంఘీభావం తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపిస్తారనుకున్న ప్రాంతీయ పార్టీల నేతలందరూ… ప్రమాణస్వీకారానికి రావడం ఆసక్తి రేపింది. అత్యంత సుందరంగా ముస్తాబయిన.. విధానసౌధ భవనం ముందు ఉన్న విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రమాణస్వీకారంలో… దేశంలోని నేతలంతా కనిపించారు. శరద్ పవార్ దగ్గర్నుంచి.. సీతారారం ఎచూరీ వరకు… పదుల సంఖ్యలో కీలక నేతలు సందడి చేశారు. ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, చంద్రబాబు, కేజ్రీవాల్, పినరయి విజయన్‌లు అందరి దృష్టిని ఆకర్షించారు. మాయవతి, అఖిలేష్ యాదవ్, తేజస్వీయాదవ్ లాంటి ఉత్తరాది ప్రముఖ నేతలూ వచ్చారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, సోనియా గాంధీ ప్రమాణ స్వీకారానికి వచ్చారు. కాంగ్రెస్ తో సన్నిహితంగా ఉన్న పార్టీలు .. సోనియా, రాహుల్ తో చొరవగా మాట్టాడారు. కానీ కాంగ్రెస్ తో దూరం మెయిన్ టెయిన్ చేయాలనుకున్న నేతలు మాత్రం పొడిపొడిగా మాట్లాడారు. అందరూ కలిసి చేతులెత్తి ఫోటోలు తీసుకునే కార్యక్రమానికి కూడా చంద్రబాబు దూరంగా ఉన్నారు. ప్రమాణస్వీకారం పూర్తయిన తర్వాత చంద్రబాబు సోనియా ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.

కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణస్వీకారం అంటే.. సాధారణంగా ఇంత ఆసక్తి ఏర్పడేది కాదు. వచ్చే ఎన్నికల ముందు.. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఓడించేందుకు ప్రాంతీయ పార్టీల నేతలంతా ఏమయ్యారన్న సూచనలు దేశ ప్రజల్లోకి పంపేందుకు వ్యూహాత్మకంగా నేతలంతా ఈ వేదికను ఉపయోగించుకున్నారు. ప్రస్తుతానికి అది మంచి ఫలితాలే ఇచ్చినట్లు భావిస్తున్నారు. ఈ పార్టీల ఐక్యత ఇలాగే కొనసాగితే… వచ్చే ఎన్నికల్లో బీజేపీకి చిక్కులు తప్పకపోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బ్ర‌హ్మానందం…. ఇదే చివ‌రి ఛాన్స్!

బ్ర‌హ్మానందం త‌న‌యుడు గౌత‌మ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఏకంగా 20 ఏళ్ల‌య్యింది. 2004లో 'ప‌ల్ల‌కిలో పెళ్లి కూతురు' విడుద‌లైంది. అప్ప‌టి నుంచీ... బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. మ‌ధ్య‌లో 'బ‌సంతి' కాస్త...

లోక్ సభ ఎన్నికలు : తెలంగాణలో ఏ పార్టీ ఎన్ని సీట్లను సాధిస్తుంది..?

లోక్ సభ సీట్లపై ఎవరి లెక్కలు వారివే. 14సీట్లు సాధిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుంటే,తాము డబుల్ డిజిట్ స్థానాలను దక్కిచుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.బీఆర్ఎస్ కూడా...

మళ్లీ డేట్ మార్చుకొన్న విశ్వ‌క్ సినిమా

విశ్వ‌క్‌సేన్ క‌థానాయ‌కుడిగా నటించిన చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి'. ఎప్పుడో రెడీ అయినా, ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. మార్చిలో రావాల్సిన సినిమా ఎల‌క్ష‌న్ల వ‌ల్ల ఆగింది. ఎన్నిక‌లు అయిపోయిన...

విదేశాలకు వెళ్లేందుకు జగన్‌కు పర్మిషన్ ఇవ్వొద్దన్న సీబీఐ

పోలింగ్ ముగియగానే కుటుంబంతో సహా లండన్ వెళ్లిపోవాలనుకున్న జగన్ కు సీబీఐ షాకిచ్చింది. ఆయన మళ్లీ తిరిగి వస్తాడన్న నమ్మకం లేదని నేరుగా చెప్పలేదు కానీ.. అలాంటి అర్థం వచ్చేలా అఫిడవిట్ దాఖలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close