బీజేపీ కుట్రతోనే లాలూ జైలుకు..! కేంద్రానికి అలోక్ వర్మ సెగ ..!

బీహార్‌లో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. ఎలా ఉంది..? 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘోర పరాజయం పాలైంది. 243 స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీలో.. బీజేపీ సాధించిన సీట్లు కేవలం 53. ఆ ఎన్నికల్లో… లాలూ ప్రసాద్ నేతృత్వంలోని.. రాష్ట్రీయ జనతా దళ్, నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతా దళ్ యనైటెడ్, కలసి పోటీ చేశాయి. రెండు పార్టీలు కలిసి 151 స్థానాలు గెలుచుకున్నాయి. జేడీఎస్ కన్నా.. లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. అయినా… ముఖ్యమంత్రి పీఠాన్ని నితీష్ కుమార్ కే ఇచ్చారు లాలూ ప్రసాద్ యాదవ్. కానీ బీహార్‌లో అధికారం పొందాలన్న బీజేపీ కలలు కల్లలు అవడం.. ఆక్కడ.. ఆపరేషన్ గరుడను ప్రయోగించారు బీజేపీ అగ్రనేతలు.

బీహార్ బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ… లాలూపై.. సీబీఐ కేసుల విషయంలో.. పొలిటికల్ చార్జ్ తీసుకున్నారు. ఏడాదిన్నరలోనే.. .మొత్తం ఫేట్ మార్చేశారు. అప్పటికే లాలూ ప్రసాద్ యాదవ్ జైలు శిక్ష అనుభవించి ఉన్నారు. అయినప్పటికీ.. పాత కేసులు బయటకు తీసి.. వరుసగా.. కొత్త అవినీతి ఆరోపణలను సీబీఐ ద్వారా బయటకు తీసుకు వచ్చారు. ఈ ఆరోపణల్లో… నితీష్ సర్కారులో మంత్రులుగా ఉన్న లాలూ కుమారుల మీదకు కూడా మళ్లించారు. లాలూ ప్రసాద్ యాదవ్‌కు జైలుకు పంపేలా చేశారు. ఆ తర్వాత.. అవినీతి పేరుతో.. నితీష్ కుమార్.. ఆర్జేడీని ప్రభుత్వం నుంచి గెంటేశారు. వెంటనే బీజేపీతో కలిసి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అక్కడితో అక్కడ ఆపరేషన్ గరుడ పూర్తయిపోయింది. బీహార్ ప్రజలు తిరస్కరించిన బీజేపీ .. అక్కడ ప్రభుత్వంలో భాగమైపోయింది.

బీహార్‌లో తెర వెనుక ఏం జరిగిందో.. సీబీఐ పేరుతో బీజేపీ ఆడిన పొలిటికల్ గేమ్ ఏమిటో… మోడీ సర్కార్ బలవంతంగా సెలవుపై పంపిన అలోక్ వర్మ.. చీఫ్ విజిలెన్స్ కమిషనర్‌కు ఆధారాలతో సహా సమర్పించారు. లాలూ ప్రసాద్ యాదవ్ కేసులను.. సీబీఐ పేరుతో నేరుగా.. రాకేస్థాన్ ఆస్థానా ద్వారా.. ప్రధానమంత్రి కార్యాలయంలోని ఓ అధికారి… బీహార్ బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ.. పర్యవేక్షించారని.. స్పష్టంగా తెలిపారు. జాతీయ మీడియా.. ఈ విషయాలను బయటపెట్టింది. ఈ వ్యవహారం సంచలనాత్మకమవుతోంది. రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐని ప్రయోగిస్తున్న అంశంపై ఎవరికీ భిన్నాభిప్రాయం లేదు కానీ.. మొదటిసారి.. సీబీఐ ఉన్నతాధికారే ఈ విషయంలో సీవీసీకి స్పష్టమైన వాంగ్మూలం ఇచ్చారు. సీబీఐని ఉపయోగించుకుని.. ఇప్పటికే తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలను.. పార్టీలను గుప్పిట్లో పెట్టుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏపీ లాంటి రాష్ట్రాల్లో ఏదే చేయబోయారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు … బీహార్ విషయం బయటపడింది. దీన్ని బీజేపీ నేతలు ఎలా సమర్థించుకుంటారో చూడాలి.. !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com