అద్వానీ మాటల అంతరార్థం “నూతన బీజేపీ” నేతలకు అర్థం అవుతుందా..?

ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే మోడీ.. మోడీ అంటే భారతీయ జనతా పార్టీ. పార్టీ వ్యవస్థాపకులుగా.. శ్యాంప్రసాద్ ముఖర్జీతో పాటు ఇతరులకు క్రెడిట్ ఇస్తారు. కానీ బీజేపీ వ్యవస్థాపకులు… ఎల్ కే అద్వానీ, వాజ్‌పేయి. జనసంఘ్‌ నుంచి.. బీజేపీగా మార్చి… రెండు సీట్ల నుంచి… అత్యున్నత స్థితికి తీసుకొచ్చారు. రథయాత్రతో.. బీజేపీకి పునాదులు వేశారు. ఇప్పుడా అద్వానీకి బీజేపీ దూరమయింది. మోడీ నేతృత్వంలో “నూతన బీజేపీ” ఆవిష్కృతమయింది. అప్పట్లో వారు చెప్పిన జాతీయవాద సిద్ధాంతాన్ని ఇప్పుడు మోడీ అండ్ కో.. కొత్తగా అన్వయిస్తూ.. బీజేపీని వ్యతిరేకించేవారినందర్నీ దేశద్రోహులు అనేస్తున్నారు. దీనిపై.. అద్వానీ తొలి సారి నోరు విప్పారు.

బీజేపీని వ్యతిరేకిస్తే దేశద్రోహులు కారు..!

బీజేపీ ఆవిర్భావ దినోత్సవానికి ముందు తన సొంత బ్లాగ్‌లో అద్వానీ తన అంతర్మథనాన్ని బయటపెట్టారు. తనకు ముందు దేశం, తర్వాత పార్టీ.. ఆ తర్వాతే తానని నినాదించారు. తమను వ్యతిరేకించిన వారిని జాతి వ్యతిరేకులు అని ఏనాడు ముద్ర వేయలేదన్నారు. అయితే ఇదే మాట బీజేపీలో ప్రకంపనలకు కారణం అవుతోంది. మోదీని వ్యతిరేకించిన వారిపై జాతి వ్యతిరేకి అంటూ బీజేపీ నేతలు ముద్రలు వేస్తున్న సమయంలో… అద్వానీ చురకలు వేయడం చర్చనీయాంశంగా మారింది. మోదీ సర్కార్‌ నిర్ణయాలను ప్రశ్నించిన వాళ్లనీ.. ఎదురించిన వాళ్లనీ శత్రువులుగా, జాతి వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారు బీజేపీ నేతలు. కొందరైతే పాకిస్తాన్‌కి వెళ్లిపోవాలంటూ మాటల దాడులకు దిగుతున్నారు. కానీ అది బీజేపీ సిద్ధాంతం కానే కాదంటున్నారు ఎల్‌కే అద్వానీ. బీజేపీ ఆవిర్భావం నుంచి పార్టీని భూజాన మోస్తున్న నాయకుడి నుంచి ఈ మాటలపై ఆసక్తికర చర్చ సాగుతోంది.

రాజకీయ ప్రత్యర్థులైతే శత్రువులు కారు..!

బీజేపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఉక్కు మనిషి నిశాబ్ధాన్ని బద్ధలు కొట్టారు. పార్టీ మూల సూత్రాలను, సిద్ధాంతాలను మరోసారి గుర్తు చేస్తూ… ఇపుడున్న నాయకత్వానికి చురకలంటించారు. తమతో విభేదించిన వారిని ఏనాడు జాతి వ్యతిరేకులని ముద్ర వేయలేదని చెప్పారు. శత్రువులుగా చూడలేదన్నారు. బీజేపీ అధినాయకత్వానికి నేరుగా చురకలంటించారు ఆ పార్టీ వృద్ధనాయకుడు లాల్‌ కృష్ణ అద్వానీ. సరిగ్గా ఎన్నికలకు ముందు… తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. బీజేపీ మూల సూత్రాలు, ప్రజాస్వామ్య అంశాలను తన బ్లాగ్‌లో రాసిన లేఖ ద్వారా గుర్తు చేశారు. బీజేపీ జాతీయ వాదంతోనే పుట్టినప్పటికీ… తమను వ్యతిరేకిస్తే వారిని జాతి వ్యతిరేకులు, తమ శత్రువులు అని ఏనాడు అనలేదన్నారు. బీజేపీలో అంగర్గత ఉందని.. ఇదే పార్టీ మూల సూత్రంగా చెప్పారు. ఎన్నికలకు ముందు అద్వానీ… నిశాబ్ధాన్ని బద్ధలు కొట్టడం సంచలనమవుతోంది.

మోడీ,షాలు వారికి కావాల్సిన రీతిలోనే అర్థం చేసుకుంటారా..?

రాజకీయ అవినీతికి బీజేపీ బద్ధ వ్యతిరేకి అన్నారు అద్వానీ. సత్యం, నిష్ఠ, ప్రజాస్వామ్య పరిరక్షణ, సుపరిపాలన ఇవే బీజేపీకి మూల స్తంభాలని చెప్పారు. ఇవి కూడా పరోక్షంగా మోదీ, షా ద్వయాన్ని ఉద్దేశించినే అన్న వాదనలు ఉన్నాయి. అంతేకాదు.. ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా జాతిహితం కోసమే ఆలోచించాలని, పార్టీలు, మీడియా అన్నింటికీ మించి ప్రతి పౌరుడు ప్రజాస్వామ్య పరిరక్షణకు నిబద్ధుడై ఉండాలని సూచించారు. బీజేపీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న సమయమంలో అద్వానీ కామెంట్స్‌… హీట్‌ పెంచుతున్నాయి. మోదీ, షాలు వ్యవస్థలను దెబ్బతీశాయనే విమర్శలు దేశమంతా వినిపిస్తున్నాయిప్పుడు. ఈ సమయంలో అద్వానీ ప్రజాస్వామ్య మూల సూత్రాలను గుర్తు చేశారు. ఇపుడున్న బీజేపీ… ఆవిర్భావం నాటి మూలసూత్రాలను పట్టించుకోవడం లేదన్న వాదన అద్వానీ బ్లాగ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. కానీ అద్వానీ ఆవేదన… మోడీ, షా ద్వయం తమకు అర్థమైన రీతిలోనే అర్థం చేసుకుంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close