సీఎం సీటుపై లోకేష్ కామెంట్‌!

నారా లోకేష్‌కు మంత్రి ప‌ద‌వి ఎప్పుడొస్తుందా అంటూ ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు దేశం నేత‌లు! ఈసారి మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటే, ముందుగా చిన‌బాబుకు ఆమాత్య ప‌ద‌వి ఇస్తార‌ని విశ్వసిస్తున్నారు. ఇంత‌కీ క్యాబినెట్ విస్తర‌ణ ఎప్పుడ‌నేది మాత్రం ఇంకా స్ప‌ష్ట‌త‌లేదు. ద‌స‌రా అయిన వెంట‌నే విస్త‌ర‌ణ ఉంటుంద‌ని గ‌తంలో సీఎం చంద్ర‌బాబు సంకేతాలు ఇచ్చారు. దీపావ‌ళి దాటిపోతున్నా దాని గురించి మారుమాట్లాడ‌టం లేదు. సంక్రాంతి స‌మీపిస్తున్నా అలాంటి సంకేతాలే లేకుండా పోయాయి! అయితే, త్వ‌ర‌లోనే ఎమ్మెల్సీ ఎన్నిక‌లు రాబోతున్నాయి. లోకేష్‌ ను ఎమ్మెల్సీ చేసిన వెంట‌నే మంత్రిప‌ద‌వి క‌ట్ట‌బెడ‌తార‌ని అనుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో మంత్రి ప‌ద‌వి, ముఖ్య‌మంత్రి ప‌ద‌వుల గురించి కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు నారా లోకేష్‌.

త‌న‌కు ప‌ద‌వీ వ్యామోహం లేద‌నీ, వెంట‌నే మంత్రి అయిపోవాల‌న్న ఆత్రం లేద‌ని గ‌తంలో నారా లోకేష్ చెప్పారు. కానీ, ఇప్పుడు మంత్రి ప‌ద‌వి గురించి మ‌రోలా మాట్లాడారు! ఒక ఇంట‌ర్వ్యూలో మంత్రి ప‌ద‌వి గురించి మాట్లాడుతూ… మంత్రి ప‌ద‌వి తీసుకోక‌పోతే త‌న‌ని అస‌మ‌ర్థుడు అని అనుకుంటార‌నీ, అందుకే పార్టీ ఇచ్చిన బాధ్య‌త‌ల్ని స‌మ‌ర్థంగా నిర్వ‌హిస్తాన‌ని లోకేష్ చెప్పారు. ఈ అభిప్రాయం త‌న‌దిగా చెప్ప‌లేదండోయ్‌! పార్టీ నేత‌లదు అని చెప్ప‌డం విశేషం. మంత్రిప‌ద‌వి విష‌యంలో పార్టీ నిర్ణ‌య‌మే శిరోధార్యం అని లోకేష్ చెప్పారు. ఏ శాఖ త‌న‌కు ఇచ్చినా స‌క్ర‌మంగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తాన‌ని త‌న మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట‌పెట్టారు.

ఇక‌, ముఖ్య‌మంత్రి ప‌ద‌వి గురించి మాట్లాడుతూ… ప్ర‌స్తుతం త‌న‌కు ఎలాంటి తొంద‌రా లేదన్నారు. తాను 25 సంవ‌త్స‌రాలు రాజకీయాల్లో ఉంటాన‌నీ, ఈలోగా ఎంతో అనుభ‌వం వ‌స్తుంద‌ని లోకేష్ చెప్పారు. ముఖ్య‌మంత్రి ప‌ద‌విపై లోకేష్‌కు క్లారిటీ ఉంద‌ని చెప్పుకోవాలి. ఎందుకంటే, 2019 ఎన్నిక‌ల్లో కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా చంద్ర‌బాబు నాయుడే మ‌రోసారి రంగంలోకి దిగుతార‌న్న‌ది సుస్ప‌ష్టం! కానీ, రాజకీయాల్లో మ‌రో పాతికేళ్లు ఉంటాన‌నీ, ఈలోగా అనుభ‌వం వ‌స్తుంద‌ని లోకేష్ అన‌డ‌మే కాస్త గంద‌ర‌దోళంగా ఉంది! అంటే, పాతికేళ్లు అనుభవం వ‌చ్చిన త‌రువాత సీఎం సీటు గురించి ఆలోచిస్తాన‌ని చెప్పిన‌ట్టా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close