ప్ర‌జాకూట‌మి కొన‌సాగించాల‌నే టి. కాంగ్రెస్ భావిస్తోందా..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఏర్ప‌డిన ప్ర‌జా కూట‌మి…. రాబోయే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో కూడా కొన‌సాగుతుందా అనే చ‌ర్చ గ‌త కొద్దిరోజులుగా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూట‌మి వైఫ‌ల్యాల‌పై ఇప్ప‌టికీ స‌రైన చ‌ర్చ జ‌ర‌గ‌లేదు. ఓట‌మి కార‌ణాల‌పై కాంగ్రెస్ పార్టీ కొన్ని నివేదిక‌లు త‌యారు చేసి, హైక‌మాండ్ కి కూడా పంపించింది. అయితే, టీడీపీతో పొత్తు కూట‌మికి కొంత ఇబ్బంది క‌లిగింద‌నేది కొంత‌మంది కాంగ్రెస్ నేత‌ల అభిప్రాయంగా ఉన్నా… ఇత‌ర కార‌ణాలే ఎక్కువ ప్ర‌భావితం చేసేశాయ‌నే ఉద్దేశంతో పీసీసీ అధ్య‌క్షుడు ఉన్న‌ట్టుగా తెలుస్తోంది. కాబ‌ట్టి, లోక్ స‌భ ఎన్నిక‌ల్లో కూడా ఇదే కూట‌మిని కొన‌సాగించినా త‌ప్పులేదు అనే అభిప్రాయం పీసీసీ వ‌ర్గాల్లో ఉన్న‌ట్టుగా చ‌ర్చ జ‌రుగుతోంది.

ప్ర‌జా కూట‌మి ఓట‌మిపై తాజాగా కోదండ‌రామ్ స్పందిస్తూ… అభ్య‌ర్థుల ఎంపిక త్వ‌ర‌గా చేయ‌క‌పోవ‌డం, ప్ర‌చారానికి స‌రైన స‌మ‌యం లేకపోవ‌డం, ప్ర‌చార వ్యూహాన్ని ప‌క్కాగా త‌యారు చేసుకోక‌పోవ‌డం లాంటివే కార‌ణాల‌న్నారు. అంతేకాదు, లోక్ స‌భ ఎన్నిక‌ల గురించి ఆయ‌న మాట్లాడుతూ… ఆ ఎన్నిక‌ల్లో కూడా ప్ర‌జా కూట‌మి కొన‌సాగుతుంద‌న్న‌ట్టుగానే ఆయ‌న మాట్లాడారు. తెరాసపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉన్న మాట వాస్త‌వ‌మే అయిన‌ప్ప‌టికీ, దాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌డంలోనే కూట‌మి ఫెయిల్ అయింద‌నేది ఆయ‌న విశ్లేష‌ణ‌. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌రిగిన పొర‌పాట్ల‌ను పునరావృతం కాకుండా చూసుకోవాల‌నేది ఆయ‌న సూచ‌న‌. ఇక‌, టీడీపీ నుంచి కూడా ప్ర‌జా కూట‌మి నుంచి బ‌య‌ట‌కి వ‌చ్చేయాల‌నే ఆలోచ‌న ఉన్న‌ట్టుగా కూడా సంకేతాల్లేవు. కాంగ్రెస్ తో పొత్తు కొన‌సాగింపు ధోర‌ణిలోనే టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఉన్నారు. జాతీయ స్థాయిలో భాజ‌పాయేత‌ర ప‌క్షాల‌ను ఏకం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఆయ‌న పెట్టుకున్నారు.

ఇక, కాంగ్రెస్ వైపు నుంచి చూసుకున్నా… ప్ర‌జా కూట‌మి కొన‌సాగింపున‌కే వారూ సిద్ధ‌మ‌నే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. భాజ‌పాకి వ్య‌తిరేకంగా దేశంలో ఏ పార్టీ త‌మ వెంట వ‌చ్చినా క‌లుపుకుని లోక్ స‌భ ఎన్నిక‌లను ఎదుర్కోవాల‌ని కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్నారు. ఇప్ప‌టికే మ‌హారాష్ట్రలో ఎన్సీపీతో సీట్ల స‌ర్దుబాటు కూడా జ‌రిగిపోయింది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో ఇప్ప‌టికే ఏర్ప‌డి ఉన్న కూట‌మిని కాద‌నుకునే విధంగా కాంగ్రెస్ వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం లేదు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెరాస‌ను నేరుగా ఎదుర్కొన్నారు, లోక్ స‌భ‌లో భాజ‌పాకి వ్య‌తిరేకంగా కాంగ్రెస్ పోరాటం ఉంటుందనే ఆలోచ‌న‌తో పార్టీ సంసిద్ధ‌మ‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. కాంగ్రెస్ తోపాటు, కూట‌మి భాగ‌స్వామ్య ప‌క్షాలైన తెలంగాణ జ‌న స‌మితి, టీడీపీలు కూడా క‌లిసే కొన‌సాగే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టుగా ప్ర‌స్తుత ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close