రివ్యూ: మా ఊరి పొలిమేర – 2

maa oori polimera 2 movie telugu review

తెలుగు360 రేటింగ్ : 2.5/5

సత్యం రాజేష్ కి గుర్తింపు తెచ్చింది కామెడీ పాత్రలే. ఆయన కామెడీ టైమింగ్ భలే వుంటుంది. అయితే ‘పోలిమేర’ చిత్రంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు రాజేష్. క్షుద్రపూజలు నేపధ్యంలో ఓటీటీలో విడుదలైన ఆ చిత్రం ప్రేక్షకులని బాగానే అలరించింది. ఇప్పుడు సినిమా పార్ట్ 2 నేరుగా థియేటర్స్ లోకి వచ్చింది. తొలి భాగం క్లైమాక్స్ లో వచ్చే మలుపులు ఆసక్తిని పెంచడంతో పార్ట్ 2 ప్రేక్షకులు ఎదురుచూసేలా చేసింది. ఈసారి పొలిమేర దాటి చిత్రీకించారని ప్రచార చిత్రాలు ఆసక్తిని పెంచాయి. మరి రెండో భాగంలో కథ ఎలాంటి మలుపులు తిరిగింది ? తొలిభాగంలోని ఆసక్తి కొనసాగిందా?

ఒకసారి తొలిసగం కథని రివైండ్ చేసుకుంటే.. కొమురయ్య (సత్యం రాజేష్‌) కవిత (రమ్య)ను చేతబడి చేసి చంపాడని తెలుసుగున్న కొమరయ్య తమ్ముడు జంగయ్య (బాలాదిత్య) కోర్టులో వేసిన కేసుని వెనక్కి తీసుకుంటాడు. కొమరయ్య చనిపోలేదని కేరళలో కవితతో కలిసి జీవిస్తున్నట్లు క్లైమాక్స్‌లో చూపించి ఒక్కసారిగా కొమురయ్య పాత్రపై ఆసక్తిని పెంచి తొలిసగం ముగించారు.

మళ్ళీ కేరళలోని కొమరయ్య, కవిత పాత్రలని చూపిస్తూనే రెండో సగం కథ ప్రారంభం అవుతుంది. జాస్తిపల్లి కి కొత్త ఎస్సై గా వస్తాడు రవీంద్ర నాయక్‌ ( రాకేందు మౌళి). కొమరయ్య కుటుంబం గురించి తెలుసుకుంటాడు. కొమరయ్య తమ్ముడు జంగయ్య కనిపించడం లేదని తెలుస్తుంది. కేసుని మళ్ళీ ఓపెన్ చేస్తాడు. ఇదే సమయంలో ఊరి కొత్త సర్పంచ్ జాస్తిపల్లి ఊరి పొలిమేరలో ఉన్న ఏకపాదమూర్తి గుడి దగ్గర అనూహ్యంగా చనిపోతాడు. రావీంద్ర నాయక్ విచారణలో.. ఏకపాదమూర్తి గుడి, కెరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామిఆలయానికి, కొమరయ్యకు ఓ లింక్ వుందని కనిపెడతాడు. ఏమిటా లింక్ ? అసలు పోలిమేరలోని గుడిని ఎందుకు మూశారు ? కొమరయ్య కేరళ అడవుల్లో ఎందుకు తిరుగుతున్నాడు ? జంగయ్య ఎక్కడికి వెళ్ళాడు ? కొమరయ్య తిగిరి ఊరి పొలిమేరలో అడుగుపెట్టాడా ? అనేది మిగతా కథ

బేసిగ్గా సినిమాకి పార్ట్ 2 అన్నప్పుడు తొలి విజయాన్ని క్యాష్ చేసుకోవడానికి చేసుకునే ప్రయత్నమనే అభిప్రాయం కొందరికి వుంటుంది. కానీ ఈ చిత్రం విషయంలో మాత్రం అలాంటి అభిప్రాయం రాదు. నిజంగానే దర్శకుడు దగ్గర చెప్పడానికి చాలా కథ, మలుపులు, ఫ్లాష్ బ్యాక్ లు వున్నాయి. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా పార్ట్ 2 కోసం రాసుకున్నట్లుగా వుండవు. నిజంగానే ఇందులో రెండో పార్ట్ లో చెప్పడానికి విషయం వుంది. అందుకే తొలిసగం చూడకుండా రెండో సగం చూస్తే మాత్రం ఇది అస్సల్ కనెక్ట్ కాదు. సినిమా ప్రారంభంలో రివైండ్ వేశారే కానీ ఫ్రెష్ గా తొలిసగం చూసి వెళితే.. అందులోని పాత్రలు వాటి చుట్టూ వున్న మలుపులు ఇంకా కనెక్టింగా వుంటాయి.

తొలిప్రేమని మర్చిపోలేని ఓ వ్యక్తి.. క్షుద్రపూజలతోనైన కోరుకున్న అమ్మాయిని దక్కించుకున్నాడని తొలి సగం ముగింపు చూసినవారిలో కలిగిన భావన. కానీ రెండో సగం కాయిన్ కి రెండో వైపులా కొన్ని ఊహించని మలుపుల్లోకి వెళుతుంది. ఒక్కసారిగా కథ నిధివేట వైపు టర్న్ తీసుకుటుంది. దర్శకుడు ఎలాంటి రీసెర్చ్ చేశాడేమో కానీ మహాభారత కాలానికి, అనంత పద్మనాభ స్వామి ఆలయానికి, జాస్తిపల్లి గుడికి ముడిపెట్టాడు. ఈ ముడి సినిమాటిక్ లిబార్టీ అనుకున్నా.. ఆ ఊహ మాత్రం ఆసక్తికరంగా వుంది. కథ అక్కడి నుంచి నాగబంధనం, నిధి వేట దిశగా సాగుతుంది.

ఇందులోని పాత్రలని దర్శకుడు వాడుకున్న తీరు బావుంది. ప్రతి పాత్ర చూస్తూ ఒక బ్యాక్ స్టొరీ రాసుకున్నాడు. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు కొన్ని లాజిక్ కి దూరంగా వున్నప్పటికీ ప్రేక్షకుడిని ఎదో రకంగా థ్రిల్ చేసేయాలనే తపన దర్శకుడిలో కనిపించింది. ఇందులో ప్రతి పదినిమిషాలకు ఒక ట్విస్ట్ లేదా ఫ్లాష్ బ్యాక్ వచ్చిపడుతుంది. తొలిసగం గనుక గుర్తులేకపోతే చాలా సన్నివేశాలు అయోమయానికి గురి చేసే అవకాశం కూడా వుంది. కథను వేర్వేరు వ్యక్తుల కోణంలో నడిపాడు దర్శకుడు. ఆ క్రమంలో వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా వుంటాయి. అయితే ఈ కథ రెండు టైం లైన్స్ లో ముందుకు వెనెక్కి అవుతూ వుంటుంది. సడన్ ఒక పాత్ర ఒక ఫ్లాష్ బ్యాక్ చెబుతుంది. సడన్ గా ఒక ట్విస్ట్ వచ్చి పడిపోతుంది. ఇదంతా కొన్ని గంధరగోళానికి దారితీసినట్లుగా కూడా వుంటుంది. ముఖ్యంగా కవిత ఎపిసోడ్, కనికట్టు, ప్రెసిడెంట్ గారి అమ్మాయి, కొమిరికి.. బలిజ( గెటప్ శ్రీను) భార్యకూ ఉన్న ఫ్లాష్ బ్యాక్.. ఇవన్నీ దర్శకుడు తీసుకున్న సినిమాటిక్ లిబార్టీ అయినప్పటికీ అందులో మంచి సస్పెన్స్ డ్రామా వుంది. అయితే ఒకే కథనం రెండు మూడు పాత్రల కోణం నుంచి చూపించడంతో అవే సన్నివేశాలు అక్కడక్కడే తిరుగుతూ కథ ముందుకు వెళ్ళలేదనే భావన కలుగుతుంది.

కొమిరి చేతబడులు చేయడానికి వెనకున్న కారణం ఊరిలో ఉన్న ఏకపాదమూర్తి ఆలయంలోని నిధి, దానికి అనంత పద్మనాభ స్వామీ ఆలయంతో వున్నముడి పార్ట్ 2 లో అసలు కథ. అయితే కొమిరి దేవాలయంలో నిర్వహించే పూజా, తర్వాత గుడిలోకి వెళ్ళడం, అక్కడ ఎదో వింత విజువల్ చూడటం, దానిని ప్రేక్షకుడికి చూపించకపోవడంతో అదే సస్పెన్స్ ని ఉంచారు. దిని తర్వాత కథ కొమిరి భార్య లక్ష్మి పాత్రతో ముందుకు వెళుతుంది. ఆమె కోణంలో ఇంకో కథ ప్రేక్షకుడికి పరిచయం అవుతుంది. దీనికి మూడో పార్ట్ కూడా వుంది. దానికి ఇచ్చిన లీడ్ కూడా బావుంది. దర్శకుడు దగ్గర కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన కంటెంట్ వుందని పార్ట్ 2 ముగింపు చూస్తే అర్ధమౌతుంది.

కొమరయ్య పాత్రలోకి సత్యం రాజేష్‌ పరకాయప్రవేశం చేసినట్లుగా నటించాడు. క్షుద్రపూజలు, మంత్రాలు.. ఇవన్నీ చాలా భయాన్ని కలిగించేలా తెరపై ప్రదర్శించాడు. బాలాదిత్య పాత్రని మూడో భాగానికి ఉంచారు. ఎస్సైగా రాకేందు మౌళి పాత్రలో కూడా చాలా సినిమాటిక్ లిబార్టీ వుంది. లక్ష్మీ పాత్రని ముగించిన తీరు ఎమోషనల్ గా వుంది. ఆమె పాత్రతో క్షుద్ర పూజలు సమాజానికి మంచిదికాదనే సందేశం కూడా ఇచ్చారు. గెటప్‌ శ్రీను తో పాటు మిగతా పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి.

పార్ట్ 1 తో పోల్చుకుంటే పార్ట్ 2 లో మంచి ప్రొడక్షన్ వాల్యూస్ కనిపించాయి. కేరళ అడవుల్లో తీసిన విజువల్ తో పాటు చివర్లో నాగబంధన ఎపిసోడ్ బావున్నాయి. సీజీ వర్క్ మరీ అంత అద్భుతం కాకపోయినా ఎబ్బెట్టుగా అయితే లేవు. భయపెట్టే సౌండ్స్ తో కాకకుండా కంటెంట్ పరంగానే నేపధ్య సంగీతం చేశారు. కెమరాపనితనం కూడా వుంది. దర్శకుడు రాసుకున్న ట్విస్ట్ లు చాలావరకు వర్క్ అవుట్ అయ్యాయి. పోలిమేర1 నచ్చిన వారికి పొలిమేర 2 కూడా నచ్చుతుంది.

తెలుగు360 రేటింగ్ : 2.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాల్పులు – నరికి వేతలు ! గోదావరి జిల్లాల్లో రక్త చరిత్ర !

ఓ వ్యక్తిని ఇంట్లోనే రెండు రౌండ్లతో కాల్చి చంపేశారు. అదీ కూడా గోదావరి జిల్లాల్లో. ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లో ఇలాంటి హత్యలు కూడా జరుగుతున్నాయా అని జనం ఆశ్చర్యపోయారు. చనిపోయిన...

‘హ‌ను – మాన్‌’ బ‌లం స‌రిపోతుందా?

'హను - మాన్‌' ప్రాజెక్ట్ మొద‌లెట్టిన‌ప్పుడు ఎవ‌రికీ ఆ సినిమాపై ఆశ‌లు, అంచ‌నాలూ లేవు. ఎప్పుడైతే టీజ‌ర్ వ‌చ్చిందో.. అప్పుడు అటెన్ష‌న్ సంపాదించుకొంది. ప్ర‌శాంత్ వ‌ర్మ ఏదో చేస్తున్నాడు, ఓ విజువ‌ల్ వండ‌ర్...

సుప్రీంకోర్టు తీర్పులపైనా నీలి, కూలి మీడియా తప్పుడు ప్రచారం !

తెలుగులో నీలి, కూలి మీడియా వ్యవహారం రాను రాను సంచలనంగా మారుతోంది. ఎంతగా అంటే చివరికి సుప్రీంకోర్టు తీర్పులనూ పూర్తిగా రివర్స్ లో ప్రచారం చేసేంత. సుప్రీంకోర్టు...

ఎల్జీ పాలిమర్స్ బాధితులకు కంపెనీ ఇచ్చిన సొమ్ము జగన్ రెడ్డి సర్కార్ నొక్కేసిందా !?

జగన్ రెడ్డి సీఎం సీట్లో కూర్చోగానే... ఏపీలో జరిగిన అతి పెద్ద అరిష్టం విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం. ఆ ఘటనపై చాలా అనుమానాలున్నా... విచారణలో ఏదీ బయటకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close