మహేష్ పాట తో ఆడుకుంటున్నారు

మ‌హేష్‌బాబు ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ నుంచి తొలి పాట ‘మైండు బ్లాకు’ నిన్న‌నే విడుద‌లైంది. ర్యాప్ స్టైల్లో సాగే మాస్ గీత‌మిది. హుషారుగానే ఉంది. కాక‌పోతే… ఈ పాట‌ని సోష‌ల్ మీడియాలో ఇష్టంవ‌చ్చిన‌ట్టు ఆడుకుంటున్నారు. విప‌రీతంగా ట్రోల్ అవుతోంది. రిలిక్స్‌మీద‌, పాడిన విధానంపై, ట్యూన్‌పై… సెటైర్లు ప‌డుతున్నాయి. మ‌హేష్‌బాబు ఫ్యాన్స్‌కి దేవిశ్రీ అన్యాయం చేశాడంటూ కొంద‌రు, ఒక‌ప్పుడు సూప‌ర్ హిట్ ట్యూన్లు ఇచ్చిన దేవికి ఏమైంద‌ని ఇంకొంద‌రు – చెడుగుడు ఆడేసుకుంటున్నారు.

మ‌హేష్ పాట‌ని ఇలా ట్రోల్ చేయ‌డం ఇదేం కొత్త‌కాదు. ‘స్పైడ‌ర్‌’లో ‘పుచ్చ‌కాయ పుచ్చ‌కాయ’ పాట కూడా ఇలానే ట్రోల్ అయ్యింది. ఇదేం పాట‌…?  అంటూ సాక్ష్యాత్తూ మ‌హేష్ అభిమానులే పెద‌వి విరిచారు. బ్ర‌హ్మోత్స‌వంలో మ‌హేష్ వేసిన స్టెప్పుల్నీ అప్ప‌ట్లో ఇలానే కామెడీ చేసేశారు. ఇప్పుడు ‘స‌రిలేరు..’ వంతు వ‌చ్చింది. ఈ పాట తీసిన విధానం క‌ల‌ర్‌ఫుల్‌గా ఉండి, మ‌హేష్ భ‌యంక‌ర‌మైన స్టెప్పులు వేసి – ఈ పాట సినిమాలోని స‌న్నివేశానికి త‌గ్గ‌ట్టుగా ఉంటే త‌ప్ప – థియేట‌ర్లో ఈ పాట‌కు సంతృప్తిక‌ర‌మైన ఫ‌లితం వ‌చ్చేట్టు కనిపించ‌డం లేదు. ఈలోగా `మా పాట సోష‌ల్ మీడియాలో ఇన్ని రికార్డులు సృష్టించిందం`టూ చిత్ర‌బృందం హ‌డావుడి మొద‌లెట్టేసింది. అల‌వాటుప్ర‌కారం. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close