మ‌హేష్ – ప‌ర‌శురామ్ క‌థ‌… శంక‌ర్ స్టైల్‌లో..?!

మ‌హ‌ర్షి త‌ర‌వాత మ‌హేష్‌బాబు సినిమా ఏమిట‌న్న‌ది ఫిక్స‌యిపోయింది. అనిల్ రావిపూడితో మ‌హేష్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. వ‌చ్చే నెల‌లో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది. ఆ త‌ర‌వాత మ‌హేష్ చేయ‌బోయే సినిమాపై ఓ క్లారిటీ వ‌చ్చింది. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ న‌టించబోతున్నాడు. ఇటీవ‌ల మ‌హేష్‌ని క‌లిసిన ప‌ర‌శురామ్ ఓ లైన్ చెప్పి ఓకే చేయించుకున్నాడు.

ఈ క‌థ‌కు సంబంధించిన ఓ క్లూ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం దేశం ఎదుర్కుంటున్న ఓ క‌ఠిన‌మైన స‌మ‌స్య చుట్టూ ఈ క‌థ సాగ‌బోతోంద‌ట‌. దానికి క‌మ‌ర్షియ‌ల్ ఎటిమెంట్స్ జోడించాడ‌ని టాక్‌. సాధార‌ణంగా శంక‌ర్ ఇలాంటి కాన్సెప్టుల‌లో క‌థ‌ని అల్లుకుంటాడు. ఈసారి ప‌ర‌శురామ్ అదే బాట‌లో వెళ్లి ఓ క‌థని రాసుకున్నాడ‌ని స‌మాచారం. ప‌ర‌శురామ్ ఇప్ప‌టి వ‌ర‌కూ ఎంచుకున్న క‌థ‌ల‌న్నీ లైట‌ర్ వే లో సాగిన‌వే. తొలిసారి.. ఓ పెద్ద కాన్వాస్‌లో క‌థ‌ని త‌యారు చేసుకున్నాడు. ఈమ‌ధ్య మ‌హేష్ కూడా ఈ త‌ర‌హా క‌థ‌ల‌పై మ‌క్కువ చూపిస్తున్నాడు. శ్రీ‌మంతుడు, భ‌ర‌త్ అనే నేను, మ‌హ‌ర్షిలో అండ‌ర్ క‌రెంట్‌గా ఓ బ‌ల‌మైన పాయింట్ ఉంది. అనిల్ రావిపూడి సినిమా కోసం మాత్రం ట్రాకు మార్చి.. పూర్తి వినోదాత్మ‌క క‌థ‌లో క‌నిపించ‌బోతున్నాడు. ప‌ర‌శురామ్ సినిమా మాత్రం… శ్రీ‌మంతుడు, భ‌ర‌త్ అనే నేను, మ‌హ‌ర్షి స్టైల్‌లోనే సాగుతుంద‌ని, కాక‌పోతే.. ఈసారి దేశం ఎదుర్కుంటున్న ఓ స‌మ‌స్య‌కి ఈ సినిమా అద్దం ప‌ట్ట‌బోతోంద‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com