లుంగీ & నంబర్ సెంటిమెంట్‌లో ‘భరత్ అనే మహేశ్’

హీరోలు, దర్శకులకు సెంటిమెంట్స్ వున్నాయా? లేదా? అనేది పక్కన పెడితే… అభిమానులకు వుంటాయ్. కొత్త సినిమా విడుదలకు ముందు సెంటిమెంట్స్‌ని చెక్ చేసుకుని సినిమా ఫేట్ చెబుతుంటారు. హిట్ సిన్మాలతో విడుదల కాబోయే సినిమాలను కంపేర్ చేస్తారు. మహేశ్ బాబు అభిమానుల సెంటిమెంట్ ప్రకారం ‘భరత్ అనే నేను’ సూపర్ డూపర్ హిట్ కొట్టబోతోంది. దీనికి రెండు సెంటిమెంట్స్ వున్నాయి. ముందుగా చెప్పుకోవాల్సింది లుంగీ సెంటిమెంట్. మహేశ్ ఇప్పటివరకూ రెండు సినిమాల్లో లుంగీ కట్టాడు. పూరి జగన్నాథ్ తీసిన ‘పోకిరి’లోని పాటలో తొలిసారి లుంగీలో కనిపించాడు. కొరటాల శివ తీసిన ‘శ్రీమంతుడు’లో రెండోసారి కనిపించాడు. ముచ్చటగా మూడోసారి మహేశ్ చేత కొరటాలే లుంగీ కట్టించాడు. రెండు మూడు రోజులుగా విడుదల చేస్తోన్న ప్రచార చిత్రాల్లో మహేశ్ పంచెలో సందడి చేస్తున్నారు. ‘పోకిరి’, ‘శ్రీమంతుడు’ సినిమాలు ఎంతెంత భారీ విజయాలు సాధించాయో అందరికీ తెలిసిందే. ‘భరత్ అనే నేను’ అంతకంటే భారీ విజయం సాధిస్తుందని అభిమానులు ధీమాగా వున్నారు. ఇక, రెండోది.. నంబర్ సెంటిమెంట్. అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘పోకిరి’లో ఖైదీ నంబర్ 4005గా మహేశ్ కనిపిస్తాడు. జైల్లో పలక పట్టుకునే సన్నివేశంలో. మహేశ్ కారు నంబర్ కూడా అదే… 4005. తాజాగా విడుదలైన ‘భరత్ అనే నేను’ పోస్టర్లలో కారు నంబర్ కూడా సేమ్ టు సేమ్. సో… ఇదీ బ్లాక్‌బ‌స్ట‌ర్‌కి సంకేతమే అంటున్నారు అభిమానులు. ఈ విధంగా లుంగీ & నంబర్ సెంటిమెంట్‌లో ‘భరత్ అనే మహేశ్’ అభిమానుల మధ్య చర్చకు తెర తీశాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close