భరత్ : ఫైటర్ దీదీ.. మోడీకి ఆమె ప్రత్యామ్నాయం..!

మమతా బెనర్జీ బెంగాల్‌లో పాతుకుపోయిన కమ్యూనిస్టుల్ని కూకటివేళ్లతో పెకిలించేశారు. అది ఆషామాషీగా జరగలేదు. ఆమె…ప్రజల సెంటిమెంట్లను రెచ్చగొట్టలేదు. ఓ ప్రాంతం మీదకు..మరో ప్రాంతం వాళ్లని ఉసిగొల్పలేదు. కానీ.. ఆమె అచ్చమైన రాజకీయ పోరాటం చేశారు. కమ్యూనిస్టులపై దశాబ్దాల పాటు పోరాడి.. వాళ్లకు అధికారాన్ని దూరం చేయడమే లక్ష్యంగా పోరాడారు. ఇప్పుడామె అలాంటి లక్ష్యాన్ని మోడీపై గురి పెట్టారు.

కమ్యూనిస్టుల్ని పడగొట్టిన ధీరవనిత..!

మమత ఒక పోరాటయోధురాలు. ఆమే వేషధారణ చూసి.. అంచనా వేయలేం. ఏదైనా సరే ప్రజల సమక్షంలో… ప్రజల సాక్షిగా తేల్చుకోవాలనుకుంటారు. బెంగాల్‌లో సింగూర్ ఉద్యమం సందర్భంగా ఆమె 25 రోజులు నిరాహారదీక్ష చేశారు. ఆ పోరాటమే.. ఆమెను.. అధికారానికి దగ్గర చేసింది. ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంటులో ఒక సారి నిరసనగా ఆమె స్పీకర్ పై నల్ల శాలువా విసిరారు. ఎప్పటికప్పుడు ఆమె ఫైర్ బ్రాండ్‌గానే కనిపిస్తున్నారు. అధికారానికి వచ్చిన తర్వాత కాస్త .. తగ్గినప్పటికీ.. ఇప్పుడు మోడీపై పోరాటం విషయంలో మరోసారి అదే పంథలోకి వెళ్లారు. విపక్షాల భారీ ర్యాలీ నిర్వహించి సత్తా చాటారు. అప్పట్లో వామపక్షాలను కూల్చడంలో.. ఎలాంటి పోరాట స్ఫూర్తి చూపారో.. ఇప్పుడూ అదే పద్దతిలో పయనిస్తున్నారు.

బెంగాలీలను ఒకే మాటపైకి తెచ్చినట్లే..!

బెంగాల్ లో బీజేపీ పుంజుకుంటోంది. వామపక్షాలు బలహీనమైపోతుండగా ఆ స్థానాన్ని బీజేపీ భర్తీ చేస్తోంది. బీజేపీని అడ్డుకోకపోతే తృణమూల్‌కు కష్టమేనని మమతకు తెలుసు. బెంగాలీల్లో ఐక్యతాభావాన్ని పెంపొందించే చర్యలే తగిన మార్గమని మమత గ్రహించారు. పోలీస్ కమిషనర్ ఇంటిపైకి సీబీఐ అధికారులు రావడాన్ని ఉపయోగించుకున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఆమె ధర్నా ప్రారంభించిన వెంటనే తృణమూల్ కార్యకర్తలు ఊరువాడ తేడా లేకుండా నిరసనోద్యమాలు ప్రారంభించారు. సామాన్య ప్రజలను అందులో భాగస్వాములను చేశారు. డెమోక్రసీ దెబ్బతింటోందని, ప్రజాస్వామ్య పరిరక్షణకు సామాన్యులు సైతం కదలి రావాలని నమ్మించగలిగారు. ఇప్పుడు బెంగాల్‌లో… కేంద్రం తమపై దురాక్రమణ చేస్తోందన్న అభిప్రాయం ఏర్పడింది. అదే బీజేపీకి మైనస్‌గా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

మోడీకి ధీటైన నేత మమతా బెనర్జీనే..!

విపక్షాలల్లో తానే బలమైన నేతనని చెప్పుకోవడానికి కూడా మమతా ఈ దీక్ష ద్వారా ప్రయత్నించారు. మోదీకి వ్యక్తిరేకంగా విస్తృత స్థాయి ఫ్రంట్ అంటూనే వేర్వేరు రాష్ట్రాల్లో రెండు మూడు పార్టీలు జట్టు కడుతున్నాయి. పొరుగు రాష్ట్రం సంగతి తర్వాత చూద్దాం..ముందు మన రాష్ట్రంలో బలంగా ఉందామని యూపీ, బిహార్ పార్టీలు తీర్మానించుకున్నాయి. ఇదీ ప్రతిపక్షాల ఐక్యతకు తూట్లు పొడిచే ప్రమాదముందని ఆమె గుర్తించారు. మోదీ నుంచి ఏదో ప్రమాదం పొంచి ఉందని అనుమానం వస్తేనే విపక్షాలన్నీ ఒకటిగా ఉండే అవకాశాలుంటాయని మమత అర్థం చేసుకున్నారు. అందుకే సీబీఐ అధికారులు దాడి చేసిన వ్యవహారంలో కూడా ఆమె మోదీని తప్పుపట్టారు. కేంద్ర విచారణ సంస్థలను బూచిగా చూపించి రాష్ట్రాలను లొంగదీసుకుంటున్నారని, రాష్ట్రపతి పాలన విధించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని ఆరోపించారు. దానితో విపక్షాలన్నీ ఒక తాటిపైకి వచ్చాయి. కొందరు నేతలు కోల్ కతా వెళ్లి మరీ మమతకు సంఘీభావం తెలిపారు. ఎవరికి వారే యుమునా తీరేగా విపక్షాలన్నీ విడిపోతాయని అనుమానించిన తరుణంలోనే మమత తన ధర్నా ద్వారా వారికి ఏకతాటిపైకి ఉంచే ప్రయత్నం చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close