ఢిల్లీ అల్ల‌ర్ల‌పై మ‌మ‌తా సొంత క‌మిటీ విచార‌ణ‌!

అదేంటీ… దేశ రాజ‌ధాని ఢిల్లీలో అల్ల‌ర్లు జ‌రిగితే, అక్క‌డ విచార‌ణ జ‌రిపిస్తామ‌ని ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించ‌డ‌మేంటీ? స‌మ‌గ్ర ద‌ర్యాప్తు జ‌ర‌పాల‌ని డిమాండ్ చేయాలిగానీ, తామే ఆ ప‌ని చేసేస్తామ‌ని ఒక రాష్ట్రం ముందుకు రావ‌డ‌మేంటీ? అచ్చంగా ఇదే ప‌ని చేశారు ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ. ఢిల్లీ అల్ల‌ర్ల‌పై ఆమె మాట్లాడుతూ… ఇవి ఒక ప‌థ‌కం ప్ర‌కారం జ‌రిగిన ఊచకోత‌గా అభివ‌ర్ణించారు! అల్ల‌ర్ల‌ను నియంత్రించ‌డంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ స‌ర్కారు పూర్తిగా విఫ‌ల‌మైంద‌న్నారు. ఢిల్లీ పెద్ద‌ల ఉదాసీన వైఖ‌రి వ‌ల్ల‌నే ఇది జ‌రిగింద‌న్నారు. ఈ అల్ల‌ర్ల‌ను కేంద్రం ఎలా తీసుకుంటోందో అర్థం కావ‌డం లేద‌న్నారు. దీనిపై టీఎంసీ నేత‌ల‌తో ఒక క‌మిటీని వేస్తున్నామ‌నీ, ఆ బృందం ఢిల్లీలో ప‌ర్యటించి వాస్త‌వాల‌ను వెలుగులోకి తెస్తుంద‌న్నారు.

మమతా ఇలాంటి సంచ‌న‌ల వ్యాఖ్య‌లు చేయ‌డానికి ఓర‌కంగా హోం మంత్రి అమిత్ షా కార‌ణంగా చెప్పొచ్చు. నిన్న‌నే ఆయ‌న మ‌మ‌త‌ను ఉద్దేశించి మాట్లాడుతూ… మ‌త క‌ల‌హాల‌ను రెచ్చ‌గొట్టేందుకు మ‌మ‌తా ప్ర‌య‌త్నిస్తార‌నీ, ఆమె వ్యాఖ్యల వల్ల దేశానికి నష్టమని ఆరోపించారు. దానికి కౌంట‌ర్ గా ఆమె ఇలా స్పందించారు. పార్టీకి చెందిన ఎంపీల‌తో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న‌కు పంపుతామ‌న్నారు. పార్లమెంటు స‌మావేశాల్లో ఈ అంశాన్ని ప్ర‌ధానంగా చేసుకుని కేంద్రాన్ని నిల‌దీస్తామ‌ని మమ‌తా అంటున్నారు.

ఢిల్లీ అల్ల‌ర్ల‌కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బాధ్య‌త వ‌హించాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. భాజపాని రాజ‌కీయంగా కార్న‌ర్ చేయ‌డం కోసం మ‌మ‌తా బెనర్జీ కూడా చాన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. మ‌రి, టీఎంసీ బృందం త‌యారు చేసే నివేదిక ఎలా ఉంటుందో చూడాలి. దానికంటే ముందు ఢిల్లీ వెళ్ల‌బోతున్న టీఎంసీ బృందానికి ఎలాంటి అనుభ‌వాలు ఎదురౌతాయో అదీ చూడాలి. మమతా తాజా వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close