మావోయిస్టుల హిట్ లిస్టు ఇంకా ఉందా..?

అర‌కు ఎమ్మెల్యే కిడారు ఈశ్వ‌ర‌రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ‌లను మావోయిస్టులు హ‌త‌మార్చిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఇప్ప‌టికీ ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి మావోయిస్టుల‌కు చెందిన ఒక ద‌ళం నుంచిగానీ, కేంద్ర క‌మిటీ నుంచిగానీ ఎలాంటి స్పంద‌నా రాలేదు. దీంతోపాటు, ఈ జంట‌ల హ‌త్య‌ల‌కు సంబంధించి ర‌క‌ర‌కాల క‌థ‌నాలు బ‌య‌ట‌కి వస్తూనే ఉన్నాయి. వారి వాహ‌నాల్లో డ‌బ్బులున్నాయంటూ ఓ క‌థ‌నం తాజాగా చ‌క్క‌ర్లు కొట్టింది. అయితే, ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి మ‌రింత స‌మాచారం అధికారంగా వెల్ల‌డి కావాల్సి ఉంది.

రాష్ట్రంలో లేద‌నుకున్న మావోయిస్టుల బెడ‌ద ఈ ఘ‌ట‌న‌తో అనూహ్యంగా మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చింద‌నే చెప్పాలి. ఆంధ్రా ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మ‌రోసారి త‌మ ఉనికిని చాటుకున్నార‌నీ అనొచ్చు. అవ‌స‌రం అనుకుంటే చ‌త్తీస్ గ‌ఢ్ వంటి ప్రాంతాల నుంచి ద‌ళాల‌ను ర‌ప్పించుకుంటూ, ఈ ప్రాంతాల్లో ఆప‌రేష‌న్లు నిర్వ‌హిస్తున్నారని తెలుస్తోంది. దీంతో ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు కొంత ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితే ఏర్ప‌డిన‌ట్ట‌యింది. ఏవోబీ ప్రాంతంలో దాదాపు వంద గిరిజన తండాలు ఇప్పుడు పూర్తిగా మావోయిస్టుల ఆధిప‌త్యంలో ఉన్నాయ‌నీ, ఆయా ప్రాంతాల్లోకి పోలీసులు వెళ్లే ప‌రిస్థితి కూడా లేద‌నే స‌మాచారం కూడా కొంత ఆందోళ‌నక‌రంగానే ఉంది. అంతేకాదు, ఇటీవ‌లి కాలంలో దాదాపు మూడు వంద‌ల మంది గిరిజ‌న యువ‌త‌ను మావోయిస్టులు రిక్రూట్ చేసుకున్న‌ట్టు కూడా స‌మాచారం ఉంద‌ని తెలుస్తోంది. దీంతో గ‌తంతో పోల్చుకుంటే ఇప్పుడు మావోయిస్టులు మ‌రింత బ‌ల‌ప‌డుతున్నార‌నే సంకేతాలు వ్య‌క్త‌మౌతున్నాయి. దాన్ని చాటి చెప్పేందుకే తాజా దాడికి పాల్పడి ఉంటారనే అనుమానాలూ ఉన్నాయి.

కిడారు హ‌త్యానంత‌రం ఇత‌ర నేత‌లు కూడా వారి హిట్ లిస్టులో ఉండే అవ‌కాశం ఉంద‌నే అనుమానాలు వ్య‌క్త‌మౌతున్నాయి. ఈ నేప‌థ్యంలో వైకాపా నుంచి ఇటీవ‌లే టీడీపీలోకి వ‌చ్చిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రికి పోలీసులు భద్ర‌త పెంచారు. అయితే, తాను మావోయిస్టుల హిట్ లిస్టులో లేన‌నీ, అసాధార‌ణ‌మైన భ‌ద్ర‌త అవ‌స‌రం లేద‌ని ఆమె స్పందించారు. కానీ, పోలీసులు అధికారుల ఆమె భ‌ద్ర‌త విష‌య‌మై ప్ర‌త్యేక జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్టు వెల్ల‌డించారు. మావోయిస్టుల హిట్ లిస్టులో ఇంకా కొంత‌మంది ఉన్నార‌నే అనుమానాలు వ్య‌క్త‌మౌతున్న నేప‌థ్యంలో, పోలీసులు మ‌రింత అప్ర‌మత్తం అయ్యార‌ు. ఎన్నిక‌ల స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌జా ప్ర‌తినిధుల ప‌ర్య‌ట‌న‌లూ, రాజ‌కీయ పార్టీల కార్య‌క‌లాలు పెరిగే అవ‌కాశం ఉంది కాబ‌ట్టి… ఈ నేప‌థ్యంలో మ‌రింత అప్ర‌మ‌త్తంగా నేత‌లు వ్య‌వ‌హ‌రించాల‌ని, పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌కుండా ఎలాంటి కార్య‌క్ర‌మాలు పెట్టుకోవ‌ద్ద‌ని పోలీసులు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close