మెగా బ్ర‌ద‌ర్ సొంత దుకాణం

మెగా హీరోలు వివాదాల‌కు దూరంగా ఉండాల‌నుకుంటారు. ఏం మాట్లాడితే ఏం ముంచుకొస్తుందో అన్న భ‌యం చాలా మందిలో క‌నిపిస్తుంది. ఇంత సీనియారిటీ ఉన్న చిరంజీవి సైతం ఏది ప‌డితే అది మాట్లాడ‌డు. కానీ.. నాగ‌బాబు దారి వేరు. ఈమధ్య ఈ మెగా బ్ర‌ద‌ర్‌… సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో వివాదాల‌కు కేంద్ర బిందువు అవుతున్నాడు. నంద‌మూరి బాల‌కృష్ణ‌ను ఎపిసోడ్ల వారిగా ఆడుకున్న నాగ‌బాబు.. ఇప్పుడు సొంతంగా `మై ఛాన‌ల్ నా ఇష్టం` అంటూ యూ ట్యూబ్ ఛాన‌ల్‌ని మొద‌లెట్టాడు. దీని ఉద్దేశం ఒక్క‌టే… ఇప్ప‌టి వ‌ర‌కూ ఫేస్ బుక్ పోస్ట్‌ల ద్వారా చేసిన సంచ‌ల‌నాలు.. ఇప్పుడు యూ ట్యూబ్ ఛాన‌ల్ ద్వారా చేస్తాడంతే.

నాగ‌బాబు ఓపెనింగ్ కూడా అదిరింది. తొలుత బాల‌య్య అల్లుడు నారా లోకేష్‌ని టార్గెట్ చేశాడు. లోకేష్ గ‌తంలో చేసిన కొన్ని వ్యాఖ్య‌ల‌ని మ‌ళ్లీ తిర‌గ‌దోడాడు. లోకేష్ త‌ర‌చూ నోరు జార‌తాడ‌న్న సంగ‌తి అంద‌రికీ తెలుసు. ఓసంద‌ర్భంలో టీడీపీకి వ్య‌తిరేకంగా మాట్లాడి, ఆ త‌ర‌వాత నాలిక క‌ర‌చుకున్నాడు. ఇప్పుడు అదే వీడియోని నాగ‌బాబు వైర‌ల్ చేయ‌డం మొద‌లెట్టాడు. స‌స‌లోకేష్‌ చిన్నపిల్లాడు.. అన్నీ నిజాలే చెప్పాడు. అందుకే అంటారు పిల్లలూ, దేవుడూ చల్లని వారే. కల్ల కపటమెరుగని కరుణామయులే..“ అని సెటైర్ వేశాడు. మొత్తానికి నాగ‌బాబు సొంత కుంప‌టి మొద‌లెట్టాడు. చేతిలో యూట్యూబ్ ఛాన‌ల్, అందులోని పోస్టుంగుల్ని వైర‌ల్ చేసే అభిమానులు ఉన్నారుగా. ఇక మెగా బ్ర‌ద‌ర్‌.. జ‌బ‌ర్‌ద‌స్త్‌తో పాటు త‌న ఛాన‌ల్ ద్వారానూ వినోదాలు పంచ‌బోతున్నాడ‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close