మోడీ చరిష్మా అసెంబ్లీ ఎన్నికల్లో “నాట్ వర్కింగ్” ..!

పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన అనితర సాధ్యమైన విజయం చూసిన తర్వాత.. ఆ పార్టీకి ఇక ఎదురు లేదని ఎవరైనా అనుకుంటారు. ఆ స్థాయిలో ఏకపక్ష ఫలితాలు వచ్చాయి. అంతకు ముందు మూడు రాష్ట్రాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్‌లలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలైంది. దాంతో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఎదురీత తప్పదని అనుకున్నారు. కానీ మోడీ చరిష్మా ముందు అంతా.. కొట్టుకుపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వెంటనే వచ్చిన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో బీజేపీ స్వీప్ చేస్తుందని సర్వేలు చెప్పుకొచ్చాయి. అంతా నిజమేనని అనుకున్నారు. అమిత్ షా వ్యూహంలో కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. మహారాష్ట్ర, హర్యానాల్లో ఆ పార్టీ ముఖ్యనేతలందరూ… బీజేపీలో చేరిపోయారు.

అయినప్పటికీ… అక్కడ బీజేపీకి కలిసి వచ్చిందేమీ లేదు. హర్యానాలో.. పూర్తి మెజార్టీ దక్కించుకోలేదు. కానీ… జేజేపీ అనే కొత్త పార్టీతో ఎన్నికల అనంతరం పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. జేజేపీ చీఫ్.. దుష్యంత్ చౌతాలా తండ్రి అవినీతి కేసుల్లో జైల్లో ఉండటంతో పని సులువు అయింది. అదే సమయంలో.. మహారాష్ట్రలో గెలిచినా.. పరువు పోగొట్టుకోవాల్సి వచ్చింది. దశాబ్దాల మిత్రుడు శివసేన గుడ్ బై చెప్పి.. కాంగ్రెస్ కూటమిలో కలిసిపోవడంతో.. ఆ రాష్ట్రం కూడా చేజారినట్లయింది. ఇప్పుడు.. జార్ఘండ్‌లో పరాభవం ఎదురైంది. గతంలో విజయం సాధించి.. మోడీ వేవ్‌లో దున్నిపారేస్తామని… బీరాలు పలికిన.. ముఖ్యమంత్రి రఘుబర్ దాస్.. తాను కూడా.. అసెంబ్లీకి వెళ్లలేని పరిస్థితిలో పడ్డారు. రెబల్ చేతిలో ఘోరపరాజయం పాలయ్యారు.

రానున్న రోజుల్లో ఢిల్లీ, బీహార్, బెంగాల్ లాంటి పెద్ద రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. ఢిల్లీ ఎన్నికల ప్రచారాన్ని… మోడీ ఇప్పటికే ప్రారంభించారు. ఈ రాష్ట్రాల్లో బీజేపీకి అంత సానుకూలత ఏమీ లేదు. ఢిల్లీలో కేజ్రీవాల్.. తనదైన రాజకీయం చేస్తున్నారు. నిన్నామొన్నటిదాకా.. కేజ్రీవాల్.. బీజేపీకి సరెండర్ అవడానికి రెడీ అయ్యారు కానీ.. ఎన్నార్సీ ఆందోళనలకు ఆయనకు ఊపునిచ్చాయి. బీహార్‌లో… నితీష్ కుమార్ వైఖరి.. ఎన్నార్సీ.. బీజేపీకి ఆశలు గల్లంతు చేసేలా కనిపిస్తున్నాయి. బెంగాల్‌లో దీదీని ఎదుర్కోవడం అంత తేలిక కాదని.. గత నెలల్లో జరిగిన ఉపఎన్నికల ఫలితాలే నిరూపించాయి. మొత్తంగా చూస్తే పార్లమెంట్ ఎన్నికలు వేరు.. అసెంబ్లీ ఎన్నికలు వేరు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close