అక్కడ అడుగు పెట్టాలంటే మోడీకి భయం!

అయిదు రాష్ట్రాల ఎన్నికలకు గంట మోగింది. అంతవరకు అంతా బాగానే ఉంది. అయితే మోడీ ప్రచారం ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల విషయంలో మోడీ చాలా ఎక్కువ ఎఫర్ట్‌ పెట్టారు. చాలా పర్యాయాలు ఆ రాష్ట్రంలో పర్యటించారు. సభలు నిర్వహించారు. విస్తృతంగా పర్యటించారు. వేల లక్షల కోట్ల రూపాయల హామీలు కురిపించారు. ఎన్ని చేసినప్పటికీ.. బీహార్‌ ప్రజలు మోడీని భయంకరంగా తిరస్కరించారు.

అయితే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు వేరు. అందుకే ఈ రాష్ట్రాల్లో ఆయన ప్రచారం ఎలా ఉండబోతున్నదనేది ఆసక్తికరంగా ఉంది.

ప్రస్తుతం ఎన్నికలు జరగబోతున్న అయిదు రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు చాలా కీలకమైన రాష్ట్రాలు. కేంద్రంలో సంఖ్యాబలం పరంగా కూడా కీలకమైనవి. ఈ రెండు చోట్ల ఎన్డీయే కూటమితో సంబంధంలేని పార్టీలే అధికారంలో ఉన్నాయి. ఈ రెండు చోట్ల మహిళలే రాజ్యమేలుతున్నారు. నిజానికి ఈ రెండు రాష్ట్రాల్లో బలం పుంజుకోవడం అనేది.. వ్యూహాత్మకంగా చాలా కీలకం గనుక.. ఎవరైనా సరే ఈ రెండు చోట్ల ఎక్కువ ఫోకస్‌ పెడతారని అంతా భావిస్తారు.

కానీ రాజకీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. బీహార్‌ ఎన్నికల మీద దృష్టిపెట్టినంత కీలకంగా మోడీ ఈరెండు రాష్ట్రాల గురించి పట్టించుకునే అవకాశం లేదని అంటున్నారు. ఎందుకంటే.. అక్కడ నితీశ్‌ బలం సన్నగిల్లిందని అనుకుంటున్న తరుణంలోనే… మోడీ అంత ఎఫర్ట్‌ పెట్టినా పార్టీ పతనం అయిపోయింది.

అలాంటిది.. ఈ దఫా అసలు భాజపాకు ఎలాంటి అస్తిత్వమూ లేని తమిళనాడులో గానీ, నామమాత్రంగా ఉనికి ఉన్న వెస్ట్‌ బెంగాల్‌లోగానీ.. మోడీ తల్లకిందులుగా తపస్సు చేసినా.. పార్టీని అక్కడ అధికారంలోకి తీసుకురావడం కల్ల అని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. అందుకే కష్టం ధారపోసి ఖంగుతినడం కంటె, ముందుగానే మన హద్దుల్లో మనం ఉంటే మంచిదనే వ్యూహం ప్రకారం మోడీ వెళ్తారని అంతా అనుకుంటున్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో విస్తృత ప్రచారం ఉండదని, అక్కడ అడుగుపెట్టాలంటేనే మోడీకి భయం అనే సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి తన కరిష్మాను నిరూపించుకోవడానికి మోడీ.. ఎలాంటి జిమ్మిక్కులు నడిపిస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close