బలహీనుల్ని సీఎంలను చేసి బలమైన నాయకులుగా మోడీ, షా చెలామణి !

కాంగ్రెస్ పార్టీలో ఓ పీసీసీ చీఫ్‌ను మార్చాలన్నా.. ఓ సీఎంను మార్చాలన్నా.. జరిగే పంచాయతీ అంతా ఇంతా కాదు. ఆ పార్టీ నేతలు ఎంత రచ్చ చేయాలో.. పార్టీ పరువును ఎంత బజారున పడేయాలో అంతా చేస్తారు. ఈ ఎపిసోడ్ తరవాత ఎవరు పార్టీలో ఉంటారో ఎవరు అసంతృప్తితో వెళ్లిపోతారో అంచనా వేయడం కష్టం. అలాంటి జాతీయ పార్టీ రాజకీయాలు చూసిన వారికి ప్రస్తుత బీజేపీ రాజకీయాలు కొత్తగానే ఉన్నాయి. ముఖ్యమంత్రుల్ని రాత్రికి రాత్రి మార్చేస్తున్నారు. ఎవరూ నోరు మెదపడం లేదు.

బీజేపీపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షాలు ఇద్దరూ తిరుగులేని పట్టును పార్టీపై సాధించారు. వారు అలా పట్టు సాధించడానికి కారణం.. ఇతర సీనియర్ నేతలందర్నీ సైడ్ చేసేసి.. పెద్దగా ప్రజాబలం లేని వారిని అందలం ఎక్కించడం. మోడీ,షా ముఖ్యమంత్రులుగా నియమించిన వారు కూడా బలవంతులేమీ కాదు. ఎమ్మెల్యేలపై పట్టు సాధించి .. దిగిపొమ్మంటే బెట్టు చేసే నేతలను ఇద్దరూ ప్రోత్సహించలేదు. దానికి గుజరాత్‌నే ఉదాహరణకు తీసుకోవచ్చు. విజయ్ రూపానీ అమిత్ షా,మోడీలకు సన్నిహితుడే కానీ మాస్ లీడర్ కాదు. ప్రస్తుతం సీఎంగా ఎంపికైన భూపేంద్రపటేల్ అయితే తొలి సారి ఎమ్మెల్యే. వీరెవరూ పదవి నుంచి దిగిపోవాలంటే దిగిపోతారు కానీ తిరుగుబాటు చేసే ప్రయత్నం చేయరు.

ఉత్తరాఖండ్‌లో కొత్త సీఎం అయినా.. కర్ణాటక కొత్త సీఎం అయినా బీజేపీ అగ్రనేతల ద్వయం మాటను కాదనేవారు కాదు. పార్టీపై వారు సాధించిన పట్టు..బలమైన నేతల్ని ఉన్నతమైన స్థానాలకు చేరకుండా చేయడం వంటి వారి వ్యూహాలుగా సులువుగా అంచనా వేయవచ్చు. అదే తమపై తిరుగుబాటు ఎగరేస్తారు అనే డౌట్ వచ్చిన వారిని వీరు వదిలేస్తున్నారు. అలాంటి వారు పార్టీల్లో మరికొంత మందికి స్ఫూర్తి కాకుండా తగ్గి వ్యవహరిస్తున్నారు. దానికి యూపీ సీఎంనే సాక్ష్యం. సీఎం యోగిని మార్చాలని రెండు నెలల కిందట బీజేపీ హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చింది. కానీ అక్కడ ఆదిత్యనాథ్ తనను మారిస్తే రాజకీయంగా తిరుగుబాటుకు సిద్ధమన్న సంకేతాలు పంపారు. అదే సమయంలో మోడీతో పాటు యోగికి కూడా దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉందన్న మీడియా సంస్థలు కొన్ని రిపోర్టులు ప్రకటించాయి. దాంతో మోడీ, షా వెనక్కి తగ్గారు.

అలా బలహీనమైన నేతల్ని అందలం ఎక్కించి.. సీనియర్ నేతలందర్నీ సైడ్ చేసేయడం ద్వారా మోడీ,షా లు బలమైన నేతలుగా చెలామణి అవగలుగుతున్నారు. బీజేపీలో వారికి ఇక తిరుగులేదని చెప్పుకోవచ్చు.కానీ వారి తర్వాత బీజేపీ పరిస్థితి ఏమిటన్నది అప్పుడప్పుడు చర్చకు వచ్చే అంశం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close