రాజాసింగ్ దెబ్బకు శ్రీశైలంలో అంతా సర్దేశారు..!

తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ … శ్రీశైలం రాకుండా చేసిన పోరాటంతో అక్కడ వైసీపీ నేతలు మొత్తం సర్దేసుకున్నారు. అన్య మతస్తులను ఉద్యోగాల నుంచి తప్పించారు. అన్యమతస్తు ల వ్యాపారాలను ఖాళీ చేయించారు. వారం రోజుల క్రితం.. ఎనిమిది మంది ముస్లిం ఉద్యోగులను… తప్పించారు. వారంతా ఆలయంలో తిష్ట వేశారు. వారంతాచాలా కాలంగా కీలక విధుల్లో ఉన్నారు. శుక్రవారం.. అన్యమతస్తుల షాపులను సీజ్ చేశారు. అగ్రిమెంట్ కాలపరిమితి ముగియడంతో 13 ముస్లింల షాపులు సీజ్ చేసినట్లు అధికారులు ప్రకటించారు. వీరంతా గతంలో హైకోర్టును ఆశ్రయించారు. కానీ వారి పిటిషన్లను హైకోర్టు కొట్టి వేసింది.

కొద్ది రోజుల కిందట.. శ్రీశైలం ఆలయంలో పెత్తనం అంతా ముస్లింలదేనని రాజాసింగ్ మండిపడ్డారు . వైసీపీ ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డినే మొత్తం ముస్లింల చేతుల్లో పెట్టారని.. అక్కడ పని చేస్తున్న ఉద్యోగులు… వ్యాపారులు… కాంట్రాక్టర్ల జాబితాను బయట పెట్టారు. గతంలో ఓ సారి దుకాణాల వేలం జరుగుతున్న సమయంలోఆయన చలో శ్రీశైలం కార్యక్రమం పెట్టుకున్నారు. కానీ దుకాణాల వేలాన్ని హైకోర్టు నిలిపివేసింది. రాజాసింగ్‌ను శ్రీశైలం రాకుండా అడ్డుకున్నారు. అప్పటితో ఆ వివాదం ముగిసింది. తాజాగా..రాజాసింగ్ శ్రీశైలంపై గురి పెట్టారు.

రాజాసింగ్ ఆరోపణల్ని సీరియస్‌గా తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి సవాళ్ల మీద సవాళ్లు చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కూడా చాలెంజ్ చేశారు. అయితే తర్వాత ఒక్కొక్కటిగా… శ్రీశైలంలో సర్దడం ప్రారంభించారు. ముందుగా ఉద్యోగుల్ని తొలగించారు. ఆ తర్వాత దుకాణాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పటికే ఆలయంలో అనేక పనుల కాంట్రాక్టులు ముస్లింలు చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అంశాన్ని ఇంతటితో వదిలి పెట్టబోమని అంటున్నారు. మొత్తంగా ఇరుక్కుపోయిన శిల్పా చక్రపాణి రెడ్డి… తప్పు జరగలేదని వాదించడం ప్రారంభించారు. తప్పు జరగకపోతే.. ఇన్ని సర్దుళ్లు ఎందుకు చేశారన్నది బీజేపీ నేతల వాదన.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close