విశాల్ ‘అభిమన్యుడు’దీ అల్లు అర్జున్ సిన్మా కథేనా?

కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని ఓ సైనికుడి కథే ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ఐదు రోజుల క్రితం విడుదలైన ఈ సినిమాలో హీరో అల్లు అర్జున్ యాక్టింగ్‌కి మంచి పేరొచ్చింది. సేమ్ టు సేమ్ క్యారెక్టర్‌లో తమిళ్ హీరో విశాల్‌కి ఎలాంటి పేరు వస్తుందో చూడాలి. ఎందుకంటే… విశాల్, సమంత జంటగా నటించిన తమిళ సినిమా ‘ఇరుంబుతిరై’. తెలుగులో ‘అభిమన్యుడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఇందులో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని, కోపం ఎక్కువ కల క్యారెక్టర్‌ని విశాల్ చేశార్ట‌. మూడు రోజుల క్రితం విడుదలైన తమిళ ట్రైలర్ చూస్తే ‘చేశార్ట‌’ కాదు.. చేశారని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అందులో విశాల్ కూడా సైనికుడిగా కనిపించడం విశేషమే. క్యారెక్టర్ ఒక్కటే అయినా, కథలో కీ పాయింట్ ఒక్కటే అయినా… స్క్రీన్‌ప్లే, కథలో డిస్కస్ చేసే టాపిక్స్ డిఫరెంట్‌గా వుంటుందని ఆశించవచ్చు.

‘నా పేరు సూర్య’ దర్శకుడు వక్కంతం వంశీ కథను తండ్రీకొడుకుల అనుబంధం, కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని సైనికుడి మనసులో సంఘర్షణగా తీర్చిదిద్దితే… ‘అభిమన్యుడు’ దర్శకుడు పీఎస్ మిత్రన్ సైబర్ వార్, బయో వార్ అంశాల నేపథ్యంలో కథ రాసుకున్నాడు. ఇంటర్నెట్ కారణంగా ప్రజల సమాచారం ఎక్కడికి వెళ్తుంది? దాంతో దేశద్రోహులు ఏం చేస్తున్నారు? అనే విషయాలను డిస్కస్ చేసినట్టున్నాడు. ఇంకో విచిత్రం ఏంటంటే… ‘నా పేరు సూర్య’లో హీరో తండ్రిగా నటించిన యాక్షన్ కింగ్ అర్జున్, ‘అభిమన్యుడు’లో విలన్ క్యారెక్టర్ చేశార్ట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close