నాగ చైతన్య, సమంత కలిసి మళ్ళీ నటిస్తున్నారా?? వీరిద్దరి కలయికలో మరో సినిమా వస్తోందా? టాలీవుడ్ లో ఇప్పడు ఇదో హాట్ టాపిక్. ఇప్పటికే వీరిద్దరూ జాయింటుగా హ్యాట్రిక్ కొట్టేశారు. మరో హ్యాట్రిక్ కోసం రంగం సిద్ధం చేసుకోవడం సూపర్ న్యూస్ అవుతొంది కూడా. పైగా కాబోయే భార్యా భర్తలు కలిసి నటిస్తే ఆ క్రేజే వేరు. టూ స్టేట్స్ రీమేక్ కోసం చైతూ, సమంత లను చిత్ర బృందం సంప్రదించింది అనగానే అక్కినేని అభిమానులు సంబరపడ్డారు కూడా. ఐతే అలాంటిది ఏమీ లేదని తేలింది. టూ స్టేట్ ప్రపోజల్ చైతూ దగ్గరికి రాలేదని, అసలు ఆ ఆలోచనే లేదని నాగ చైతన్య సన్నిహిత వర్గాలు తేల్చేశాయి.
”టూ స్టేట్స్ సినిమా ఒప్పుకున్నాం అనే వార్తల్లో నిజం లేదు. అలాంటి ప్రతిపాదన ఏదీ రాలేదు” అని అక్కినేని కాంపౌండ్ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. మరో వైపు నిర్మాతలు కూడా ”ఇంకా హీరో హీరోయిన్ల గురించి అనుకోలేదు. స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి కాలేదు. అన్నీ అయ్యాక ఓ క్లారిటీ వస్తుంది. చైతూ – సమంత లు కూడా ఓ మంచి ఆప్షన్ అవుతుంది” అన్నారు. అంటే… మీడియా వాళ్ళే నిర్మాతలకు ఓ మంచి జోడీ వెదికి పెట్టిందన్నమాట. ఒకవేళ నిర్మాతలు సంప్రదిస్తే చైతూ – సమంత ఓకే చేసినా చెయ్యొచ్చు. ప్రస్తుతానికైతే జోడీ ఎవరనేది ఇంకా కన్ఫర్మ్ కానట్టే.