ప్రేమ‌మ్ గురించి డౌట్లున్నాయా??

భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రేమ‌మ్ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ప‌బ్లిసిటీ విష‌యంలో నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించిన ప్రేమ‌మ్ బృందం ఇప్పుడు మేల్కొని ప్ర‌మోష‌న్ల‌ను స్పీడ‌ప్ చేసింది. అయితే ప్రేమ‌మ్ కి ప్రీ రిలీజ్ టాక్ అంత గొప్ప‌గా ఏం లేదు. సినిమా స్లోగా ఉంద‌ని, సెకండాఫ్ అయితే క‌నెక్ట్ అవ్వ‌లేక‌పోయామ‌ని ఆల్రెడీ ఈసినిమా చూసిన వాళ్లు చెబుతున్నారు. మ‌రోవైపు నాగ‌చైత‌న్య మాట‌లు వింటుంటే… ఈ సినిమా ఏమంత న‌మ్మ‌కంగా లేన‌ట్టే క‌నిపిస్తోంది. `మ‌ల‌యాళ ప్రేమ‌మ్‌ని దృష్టి పెట్టుకొని ఈ సినిమా చూడొద్దు` అని చెప్ప‌డం అనుమానాల‌కు దారి తీస్తోంది. ఇది ప్రేమ‌మ్ రీమేక్‌. ప్రేమ‌మ్ సినిమా గురించి తెలుసుకొన్న చాలామంది సినీ ప్రేమికులు ఆ భాష అర్థం కాక‌పోయినా డీవీడీలు కొనుక్కొని మ‌రీ ఈ సినిమా చూశారు. ప్రేమ‌మ్ లో విష‌య‌మేంటో అంద‌రికీ తెలుసు. అలాంట‌ప్పుడు ప్రేమ‌మ్‌ని దృష్టిలో ఉంచుకోకుండా ఈసినిమా ఎలా చూస్తారు??

కేవ‌లం అవుట్ లైన్ తీసుకొని ద‌ర్శ‌కుడు కొత్త క‌థ‌ని, కొత్త స‌న్నివేశాల‌నూ అల్లుకొన్నాడంటే అదీ లేదు. ట్రైలర్ చూస్తుంటే కాపీ పేస్ట్ వ్య‌వ‌హారంలానే తోస్తోంది. అలాంట‌ప్పుడు ఈ రెండు సినిమాల మ‌ధ్య పోలిక‌లు లేకుండా ఎలా ఉంటాయి?? ఈ సినిమా చూసిన నాగార్జున చాలా వ‌ర‌కూ క‌ర‌క్ష‌న్లు చెప్పాడు. మొన్న‌టి వ‌ర‌కూ ఎడిటింగ్ టేబుల్ ద‌గ్గ‌ర ఈ సినిమా న‌లుగుతూనే ఉంది. అందుకే ప్రేమ‌మ్ రిజ‌ల్ట్‌పై చైతూ కూడా కాస్త డౌట్ ఫుల్ గానే ఉన్నాడ‌ని టాక్‌. ఈరోజు మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూల‌లో కూడా చైతూ కంఫ‌ర్ట్‌గా ఏం క‌నిపించ‌లేదు. దానికి తోడు ప్రేమ‌మ్ పై ప్ర‌శ్న‌ల‌కు చాలా ముస్త‌స‌రిగా స‌మాధానాలు ఇచ్చాడు. ప్రేమ‌మ్‌లో ఉన్న ఫీల్ ఈ సినిమాలో క్యారీ అవ్వ‌గ‌లిగితే… ఎన్ని మైన‌స్‌లు ఉన్నా త‌ట్టుకోవొచ్చు. కేవ‌లం ఏ క్లాస్ కే ప‌రిమితం అయితే మాత్రం పెట్టుబ‌డి రాబ‌ట్టుకోవ‌డం క‌ష్టం అవుతుంది. ద‌స‌రా సీజ‌న్, చైతూ- శ్రుతి – అనుప‌మ‌ల‌కు ఉన్న ఫాలోయింగ్‌, యూత్‌లో ఈ సినిమాపై ఉన్న క్రేజ్.. ఇవే ప్రేమ‌మ్‌ని నిల‌బెట్టాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close