నాగబాబు వ్యాఖ్యలతో జనసేన కే నష్టం అంటున్న ఏబిఎన్

మెగా బ్రదర్ నాగబాబు నిన్న చేసిన వీడియో వైరల్ కావడం తెలిసిందే. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో లోకేష్ ని ఆకాశానికి ఎత్తేస్తూ ఆంధ్రజ్యోతి చేసిన కథనం పై సెటైర్లు వేస్తూ నాగబాబు నవ్వులు పూయించారు. బహుశా ఆంధ్రజ్యోతి ఛానల్ ని, రాధాకృష్ణ ని టార్గెట్ చేస్తూ నాగబాబు సెటైర్లు వేయడం ఛానల్ కి ఎంత మాత్రం నచ్చినట్టు లేదు. దీంతో నాగబాబు వ్యాఖ్యలతో జనసేన పార్టీకే నష్టం అంటూ ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రసారం చేసింది. వివరాల్లోకి వెళితే..

ఆంధ్రజ్యోతి ఛానల్ లో లోకేష్ ని ఆకాశానికి ఎత్తేస్తూ వచ్చిన ఒక కథనం మీద నిన్న నాగబాబు ఒక వ్యంగ్యమైన వీడియో చేశారు. అది కాస్తా వైరల్ అయ్యింది. ఎటువంటి వాస్తవాలు లేకపోయినా లోకేష్ ని ఆకాశానికి ఎత్తేస్తూ ఆ చానల్ ఎలాంటి కథనం చేసిందో వివరించడం నాగబాబు వీడియో లక్ష్యం.

Click here:
https://www.telugu360.com/te/naga-babu-on-abn-radha-krishna/

నాగబాబు వీడియోపై ఆంధ్రజ్యోతి స్పందన:

నాగబాబు చేసిన ఈ వీడియో సహజంగానే ఆంధ్రజ్యోతి కి నచ్చలేదు. దాంతో నాగబాబు వ్యాఖ్యల కారణంగా జనసేన కు నష్టం కలుగుతుంది అంటూ ఒక కథనాన్ని ప్రసారం చేసింది. అయితే ఆంధ్రజ్యోతి ఈ ప్రసారంలో ఎక్కడా కూడా, తాము ప్రసారం చేసిన ఒక కథనాన్ని నాగబాబు టార్గెట్ చేసిన విషయాన్ని ప్రస్తావించలేదు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్న సామెత తో మొదలుపెట్టిన ఆంధ్రజ్యోతి, నాగబాబు గతంలో కత్తి మహేష్ మీద , శ్రీరెడ్డి వ్యాఖ్యల మీద స్పందించినప్పుడు ప్రజలు దాన్ని అర్థం చేసుకున్నారని వ్యాఖ్యానించింది. అలాగే బాలకృష్ణ పవన్ కళ్యాణ్ మీద చేసిన అహంకారపు వ్యాఖ్యల మీద ప్రతీకారం గా అన్నట్టు నాగబాబు చేసిన కథనాలను కూడా సమర్థించింది. కానీ ఇటీవల కాలంలో నాగబాబు వ్యాఖ్యలు శృతిమించుతున్నాయని, జగన్ మీద, బాలసుబ్రమణ్యం మీద చేసిన వ్యాఖ్యల కారణంగా నాగబాబు ను ప్రజలు చీదరించుకుంటున్నారు అని ఆంధ్రజ్యోతి కథనం ప్రకటించింది. ఇప్పటికైనా నాగబాబు తన వ్యవహారశైలి మార్చుకోకపోతే అది జనసేన పార్టీకే నష్టం అని ముక్తాయించింది.

ఆంధ్రజ్యోతి స్పందన తర్వాత కూడా మిగిలిన ప్రశ్నలు:

ఏది ఏమైనా నాగబాబు సోషల్ మీడియాలో చేసిన వీడియో మీద ఆంధ్రజ్యోతి కూడా స్పందించాల్సి వచ్చింది. అయితే ఆ స్పందన ఏదో నేరుగా తమ ఛానల్ మీద నాగబాబు వ్యాఖ్యలు చేసినందుకు స్పందిస్తున్నాము అని చెప్పి ఉంటే బాగుండేది. జగన్ ని తిట్టినందుకు ప్రజలు నాగబాబు ని చీదరించుకుంటున్నారు అన్న వాదన కూడా సమంజసం గా కనిపించడం లేదు. ఒకవేళ అదే నిజమైతే జగన్ మీద నాగబాబు కంటే పదునైన వ్యాఖ్యలు ఆంధ్రజ్యోతి గతంలో చాలా చేసింది.

ఇంకొక విషయం ఏమిటంటే, లోకేష్ ని ఆకాశానికి ఎత్తేస్తూ తాము ప్రసారం చేసిన కథనంలో ఒక పేరున్న కుబేరుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి మోడీ ని కాదని సైతం ముందుకు వస్తున్నారని, కేవలం చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ కారణంగానే ఆయన వేలకు వేల కోట్లు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి తహతహ లాడుతున్నారని చెప్పిన ఆంధ్రజ్యోతి, ఇప్పటివరకు ఆ అపర కుబేరుడి పేరు ప్రకటించలేదు, అతను ఎవరో చెప్పలేదు, పోనీ అలాంటి పెట్టుబడులు ఏవైనా ఆంధ్రప్రదేశ్ కి ఇప్పటిదాకా వచ్చాయా లేకపోతే ఎప్పటిలోగా వస్తాయి అన్న విషయం కూడా ఎటువంటి కథనాన్ని ప్రసారం చేయలేదు.

ఇక చివరిగా, ఆంధ్రజ్యోతి మాత్రమే కాకుండా మిగతావి కూడా కొన్ని మీడియా సంస్థలు సొంత కథనాలను ప్రసారం చేస్తూ ఉంటాయి. తాము వంతపాడే పార్టీలకు మేలు చేయడానికి సృజనాత్మక శక్తిని ఉపయోగించి మరీ కథనాలు వండుతూ ఉంటాయి. గతంలో సోషల్ మీడియా లేదు కాబట్టి ఇలాంటి కథనాలు మీద ప్రజలు ఏం అనుకుంటున్నారు అనేది తెలిసేది కాదు. అయితే ఇప్పుడు కాలం మారింది. ఎటువంటి వాస్తవాలు లేకుండా వండే కథనాలు ఏవి అన్నది ప్రజలకు అర్థం అవడమే కాకుండా వాటి మీద సెటైర్లు వేస్తూ సోషల్ మీడియాలో తమ స్పందన కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే మామూలు ప్రజలు చేసే స్పందనలు ఎక్కువమందికి చేరకపోవచ్చు కానీ నాగబాబు లాంటి సెలబ్రిటీ స్పందించినప్పుడు అది ఎక్కువమందికి చేరుతుంది ‌. పైగా నాగబాబు చేసిన వ్యాఖ్యల్లో నిజం ఉంది కాబట్టే ఆ వీడియో అంతగా వైరల్ అయింది అనుకోవచ్చు.

బహుశా ఇక మీదట అయినా, ఇలాంటి గాల్లో సృష్టించే కథనాలు రాసేటప్పుడు మీడియా ఒకటికి రెండుసార్లు పునరాలోచించుకునే పరిస్థితిని నాగబాబు కల్పించారు అని చెప్పవచ్చు.

– జురాన్ ( @CriticZuran)

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close